Vicky Vidya Ka Woh Wala Video OTT Release on December 6th: సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో విడుదలైన ‘యానిమల్’ సినిమాతో లైమ్ లైట్ లోకి వచ్చి, అందరి దృష్టినీ ఆకర్షించారు బాలీవుడ్ నటి తృప్తి డిమ్రి. ఆమె నటించిన యానిమల్ సినిమా సూపర్ హిట్ అయి, ఈ ఏడాది ఆమెకు నాలుగు సినిమాలు చేసేంత స్టేటస్ ఇచ్చేసింది.  అంతకు ముందు పలు సినిమాల్లో నటించినా, ఆమెకు అంత గుర్తింపునివ్వలేదు.  యానిమల్ ఆమె కెరీర్ కు పాన్ ఇండియా అప్పీల్ తీసుకొచ్చింది. యానిమల్ తర్వాత తృప్తి నటించిన ‘బ్యాడ్ న్యూస్’ కూడా డీసెంట్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత ఆమె నటించిన సినిమానే ‘విక్కీ విద్యా కా వో వాలా వీడియో’. ఇప్పుడీ సినిమా ఓటీటీలో విడుదలకు రెడీ అయ్యింది. 


నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో త్రిప్తి బోల్డ్ సినిమా స్ట్రీమింగ్


ఈ శుక్రవారం (అంటే డిసెంబర్ 6వ తేదీ) నుంచి నెట్ ఫ్లిక్స్ లో హిందీలో ‘విక్కీ విద్యా కా వో వాలా వీడియో’ స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్ లో విడుదలైంది. బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకు రాజ్ షాండిల్య దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిక్స్ డ్ టాక్ వచ్చింది. కొంత కాలం గ్యాప్ తర్వాత బాలీవుడ్ బ్యూటీ మల్లికా శెరావత్ బాలీవుడ్ లో తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఇందులోనూ ఆమె ఓ కీలక పాత్ర చేశారు.


Also Read: శృంగార తార సన్నీ లియోన్ నటించిన సూపర్ నేచురల్ థ్రిల్లర్... ఆహా ఓటీటీలో రిలీజ్ ఎప్పుడంటే?






1990 ల నాటి కాలంలో సాగుతుందీ సినిమా. తల్లిదండ్రులు కుదిర్చిన సంబంధం కాదని, చిన్న అబద్ధం ఆడి లవర్ విక్కీ (రాజ్ కుమార్ రావ్)ను పెళ్లి చేసుకుంటుంది డాక్టర్ విద్య(తృప్తి డిమ్రి). వీరిద్దరూ హనీమూన్ లో ఉండగా, తాము సన్నిహితంగా ఉన్న మోమెంట్స్ ని వీడియో తీసుకుంటారు. అదే రోజు, వాళ్లు ఉన్న హోటల్ లో దొంగలు పడతారు. ఆ సీడీ మిస్ అవుతుంది. అయితే ఈ సీడీ దొంగతనానికి గురైందన్న సంగతి భార్యకు చెప్పకుండా దాస్తాడు విక్కీ. ఇంతకీ ఆ సీడీ ఏమైంది? ఎవరి చేతుల్లోకి వెళ్లిందనేదే సినిమా.


Also Readసంక్రాంతికి కాదు... డిసెంబర్‌లోనే ఓటీటీలోకి సూర్య 'కంగువ' - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?



Tripti Dimri Upcoming Movies: 2017లో ‘పోస్టర్ బాయ్స్’ అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన డిమ్రీ హీరోయిన్ గా క్రేజీ ప్రాజెక్ట్స్ రెడీ అవుతున్నాయి. మాధురీ దీక్షిత్, విద్యా బాలన్, కార్తీక్ ఆర్యన్, తృప్తి డిమ్రి ప్రధాన పాత్రల్లో నటించిన ‘భూల్ భులౌయా 3’ కూడా సూపర్ హిట్ అయింది. కాగా, జాన్వీకపూర్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ‘సైరత్ ’ చిత్రానికి సీక్వెల్ నిర్మిస్తున్నారు కరణ్ జోహార్. ఇందులో తృప్తి డిమ్రి హీరోయిన్ గా ఎంపికైంది.