Tragedy At Pushpa 2 Premiere: పుష్ప-2 బెనిఫిట్ షో ఓ కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది. హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ఉన్న సంద్యా థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందింది. మరో ఇద్దరు చిన్నారులు గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
ప్రపంచవ్యాప్తంగా విడుదలకు ఒక రోజు ముందుగానే బెనిఫిట్‌షోలు వేశారు. టికెట్ రేటు భారీగా ఉన్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ కొనుగోలు చేసిని థియేటర్లకు వెళ్లారు. అందరి మాదిరిగానే భాస్కర్ ఫ్యామిలీతో వెళ్లారు. దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన భాస్కర్ తన భార్య రేవతి, పిల్లలు శ్రీతేజ, సన్వీకతో కలిసి సినిమాకు వెళ్లారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్యా థియేటర్‌లో టికెట్లు కొనుక్కొని రాత్రి 9.30 షోకు వెళ్లారు.
భాస్కర్ వెళ్లిన థియేటర్‌కే అల్లు అర్జున్ రావడంతో తోపులాట చోటుచేసుకుంది. అల్లు అర్జున్న ఆ థియేటర్‌కు వస్తున్న విషయాన్ని తెలుసుకున్న ఫ్యాన్స్ బారీగా తరలి వచ్చారు. గేట్లను తోసుకుంటూ థియేటర్ లోపలికి వచ్చేశారు. దీంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో భాస్కర్ ఫ్యామిలీ ఇరుక్కుంది.
భారీగా తరలి వచ్చిన జనాన్ని కంట్రోలే చేసేందుకు ప్రయత్నించిన పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. దీంతో జనం పరుగులు తీశారు. ఈ కారణంగా భాస్కర్ ఫ్యామిలీ కింద పడిపోయింది. ఆ విషయాన్ని పట్టించుకోని అల్లు అర్జున్ అభిమానులు వారిని తొక్కుకుంటూ వెళ్లిపోయారు. ఈ తొక్కిసలాటలో రేవతి తీవ్రంగా గాయపడింది. ఆమెతో ఉన్న కుమారుడు శ్రీ తేజ కూడా గాయాలుపాలు అయ్యాడు.
Also Read: మీ బాస్‌కు నేనే బాస్‌ని అనే డైలాగ్‌తో ఎవర్ని టార్గెట్ చేశావు పుష్పా?
థియేటర్‌లో జనం మధ్యలో పడిపోయిన రేవతి, శ్రీతేజను అతి కష్టమ్మీద పోలీసులు బయటకు తీసుకొచ్చారు. అప్పటికే వాళ్లిద్దరు స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే వారిని దగ్గర్లోనే ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ రేవతి కన్నుమూశారు. కుమారుడు శ్రీతేజ పరిస్థితి విషమంగా ఉండటంతో నిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం ఆ బాలుడి పరిస్థితి ఆందోళకరంగా ఉందని వైద్యులలు చెబుతున్నారు.
సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఓ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. ఈ దుర్ఘటనలో మరికొందరు కూడా గాయపడినట్టు తెలుస్తోంది. వారికి చిన్న చిన్న గాయాలు అయినట్టు సమాచారం. ఈ ఘటనపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.
Also Read: సుక్కు మార్క్ డైరెక్షన్‌లో అల్లు అర్జున్ మాస్ తాండవం... మరి సినిమా హిట్టా? ఫట్టా?