అన్వేషించండి

Telangana Elections 2023: కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ధరణి బంగాళాఖాతానికి, రైతులు అరేబియా సముద్రానికి: కేసీఆర్

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా మనల్ని ఆంధ్రాలో కలిపితే 58 ఏండ్లు తెలంగాణ గోస పడ్డాం, 1969 ఉద్యమంలో 400 మందిని కాల్చివేశారని సీఎం కేసీఆర్ అన్నారు.

పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఏం జరిగిందో.. యాభై ఏండ్ల కాంగ్రెస్ (Congress) పాలనలో ఏం జరిగిందో బేరీజు వేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ (Telangana CM KCR) అన్నారు.  కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా మనల్ని ఆంధ్రాలో కలిపితే 58 ఏండ్లు తెలంగాణ గోస పడ్డాం, 1969 ఉద్యమంలో 400 మందిని కాల్చివేశారని పేర్కొన్నారు. బోధన్ లో బుధవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఉద్యమ సమయంలో బోధన్ లో జరిగిన అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నాను, నాటి నుంచి నేటి వరకు తెలంగాణకు శత్రువే కాంగ్రెస్ పార్టీ అన్నారు.

2004 లో తెలంగాణ ఉద్యమాన్ని తీసుకొస్తే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం ఇస్తమని చెప్పి పొత్తు పెట్టుకున్నది. కానీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఓ ఏడాది అటూ ఇటూగా తెలంగాణ ఇవ్వాలె. కానీ 14 ఏండ్లు ప్రజల్ని ఎడిపించారని కేసీఆర్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వకుండా దోఖా చేసి, మోసం చేసి టీఆర్ఎస్ పార్టీని చీల్చాలని చూసిందని ఆరోపించారు. రాజీపడకుండా పులిలాగా కొట్లాడితే విధిలేని పరిస్థితుల్లో తెలంగాణ ఇచ్చిండ్రు. వందల మందిని పొట్టన పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందన్నారు. నిజాంసాగర్ ప్రాజెక్ట్ తో లక్ష్మి ఉండే జిల్లాగా నిజామాబాద్ జిల్లా ఉండేది. సమైక్య రాష్ట్రంలో నిజాం సాగర్ ప్రాజెక్ట్ ను ఎండబెట్టారు. సింగూరు నుంచి నీళ్లు రావాలని అనేక ఉద్యమాలు చేసిన రోజుల్ని గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు ఏడాది పొడుగునా నిజాం సాగర్ నిండే ఉంటదని హామీనిచ్చారు. 

బోధన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి సుదర్శన్ రెడ్డి ఇరిగేషన్ మంత్రిగా ఉండి కూడా గతంలో చుక్కా నీళ్లు తేలేదు, ఒక్క పైసా కూడా తీసుకురాలేదన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా షకీల్ గెలిచిన తర్వాత 72 కోట్ల రూపాయలతో కాలువలను బాగు చేయించారు. షకీల్ కట్టించిన చెక్ డ్యామ్ లతో భూగర్భ జలాలు పెరిగాయి. రైతుల బతుకులు బాగుండాలని బీఆర్ఎస్ వ్యవసాయ స్థిరీకరణ చేసింది. నీటి తీరువా బకాయిలు మాఫీ చేసి, శాశ్వతంగా రద్దు చేశాం. పెట్టుబడి సాయంగా రైతు బంధును ఇస్తున్నాం, రైతు బీమాతో రైతుల కుటుంబాలకు భద్రతనిస్తున్నం అని కేసీఆర్ పేర్కొన్నారు. 

గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు పెట్టి ధాన్యం కొనుగోలు చేసి డబ్బులు ఇస్తున్నాం. కాంగ్రెస్ పాలనలో ఎప్పుడన్నా రైతు బంధు పదం విన్నమా? అని ప్రశ్నించారు. కర్ణాటక, మహారాష్ట్రలోనే కాదు ఒక్క తెలంగాణలో తప్ప.. దేశంలోనే రైతు బంధు లేదన్నారు. కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్ గాంధీనే స్వయంగా వాళ్లు అధికారంలోకి వస్తే ధరణిని తీసి బంగాళాఖాతంలో వేస్తామంటున్నారని గుర్తుచేశారు. లంచం ఇవ్వకుండా రైతు బంధు, రైతు బీమా, పంట కొనుగోళ్ల డబ్బులు ధరణి ద్వారానే డైరెక్ట్ గా వస్తున్నాయని ప్రజలు గుర్తించాలన్నారు. కాంగ్రెస్ గెలిస్తే ధరణి బంగాళాఖాతానికి.. రైతులు అరేబియా సముద్రానికి చేరతారని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి రైతులకు 24 గంటల కరెంట్ వేస్ట్ అంటడు. 3 గంటలు చాలంటడు. మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ రైతు బంధు వేస్ట్ అనడం కరెక్టేనా అని ప్రశ్నించారు. షకీల్ ఎమ్మెల్యేగా గెలిస్తే రైతు బంధు రూ.16 వేలు అవుతది. కాంగ్రెస్ గెలిస్తే కరెంటు కాట కలుస్తది..రైతు బంధుకు రాంరాం అన్నారు. 

ప్రధానమంత్రి మోదీ స్వరాష్ట్రం గుజరాత్ లో కూడా 24 గంటల కరెంటు లేదు. మేం 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం. కేసీఆర్ 24 ఏండ్లాయె కొట్లాడబట్టి.. ఇంకెన్నాండ్లు కొట్లాడాలె.. జిందగీల నేనే కొట్లాడాల్నా? ఈసారి మీరే కొట్లాడాలే అని ప్రజలకు పిలుపునిచ్చారు. మంచిగున్న నిజాంసాగర్ ను ముంచిందే కాంగ్రెస్.. మళ్లీ నిజాంసాగర్ కు పూర్వ వైభవం తెచ్చింది బీఆర్ఎస్ అన్నారు.  బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తున్న ఒక్క రాష్ట్రం తెలంగాణ. మైనార్టీల కోసం రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజీలు పెట్టుకుని నాణ్యమైన విద్య. హిందూ, ముస్లిం, క్రైస్తవులందరం కలిసి మెలిసి ఉండి పండుగలు చేసుకుంటాం అన్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ఇక జీవోలన్నీ తెలుగులోనే విడుదల!
ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ఇక జీవోలన్నీ తెలుగులోనే విడుదల!
Allu Arjun Bail :  అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
China Virus: చైనాలో కొత్త వైరస్ కలకలం - ఆందోళన వద్దంటూ భారత్ హెల్త్ ఏజెన్సీ స్పందన, కీలక సూచనలు
చైనాలో కొత్త వైరస్ కలకలం - ఆందోళన వద్దంటూ భారత్ హెల్త్ ఏజెన్సీ స్పందన, కీలక సూచనలు
JC Vs BJP: నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Game Changer Trailer Decode | గేమ్ చేంజర్ ట్రైలర్ లో మీరు ఇవి గమనించారా..? | ABP DesamRam Charan Game Changer Mumbai | బాలీవుడ్ ప్రమోషన్స్ మొదలుపెట్టిన రామ్ చరణ్ | ABP DesamRare Black panther Spotted | పిల్ల చిరుతతో కలిసి నల్ల చిరుత సందడి | ABP DesamAus vs Ind sydeny Test Day 1 Highlights | సిడ్నీ టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో చేతులెత్తేసిన భారత్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ఇక జీవోలన్నీ తెలుగులోనే విడుదల!
ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ఇక జీవోలన్నీ తెలుగులోనే విడుదల!
Allu Arjun Bail :  అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
China Virus: చైనాలో కొత్త వైరస్ కలకలం - ఆందోళన వద్దంటూ భారత్ హెల్త్ ఏజెన్సీ స్పందన, కీలక సూచనలు
చైనాలో కొత్త వైరస్ కలకలం - ఆందోళన వద్దంటూ భారత్ హెల్త్ ఏజెన్సీ స్పందన, కీలక సూచనలు
JC Vs BJP: నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
Numaish 2025: భాగ్యనగరంలో నుమాయిష్ సందడి - అందుబాటులోకి 2,400 స్టాల్స్, ప్రత్యేకతలివే!
భాగ్యనగరంలో నుమాయిష్ సందడి - అందుబాటులోకి 2,400 స్టాల్స్, ప్రత్యేకతలివే!
Google Search Don'ts: గూగుల్‌లో వీటిని సెర్చ్ చేస్తే జైలుకే - జాగ్రత్తగా ఉండాల్సిందే!
గూగుల్‌లో వీటిని సెర్చ్ చేస్తే జైలుకే - జాగ్రత్తగా ఉండాల్సిందే!
Holidays in January: స్టూడెంట్స్‌కు గుడ్ న్యూస్ - జనవరిలో 9 రోజులు మూతపడనున్న పాఠశాలలు
స్టూడెంట్స్‌కు గుడ్ న్యూస్ - జనవరిలో 9 రోజులు మూతపడనున్న పాఠశాలలు
Railway Recruitment Board: నిరుద్యోగులకు బిగ్ అలర్ట్ - రైల్వేలో 32 వేల ఉద్యోగాలపై కీలక అప్ డేట్, పూర్తి వివరాలివే!
నిరుద్యోగులకు బిగ్ అలర్ట్ - రైల్వేలో 32 వేల ఉద్యోగాలపై కీలక అప్ డేట్, పూర్తి వివరాలివే!
Embed widget