Nizamabad News: భయపెడుతున్న మహారాష్ట్ర.. అయినా మేల్కోని నిజామాబాద్ అధికారులు..
మహారాష్ట్రలో పడగ విప్పుతున్నకరోనా. భారీగా పెరుగుతున్నాయి కేసులు. ఏ రోజుకారోజు కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కానీ మహారాష్ట్ర, తెలంగాణ బార్డర్ లో అధికారులు ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టలేదు.
మొదటి, రెండు దశల్లో తెలంగాణలో కేసులు పెరగడానికి మహారాష్ట్ర నుంచి భారీ సంఖ్యలో జనం రావడమే ప్రధాన కారణమైంది. ఇప్పుడూ అలాంటి పరిస్థితే కనిపిస్తోంది. మహారాష్ట్రలో రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. వేల సంఖ్యలో కేసులు రిజిస్టర్ అవుతున్నాయి. అయినా సరిహద్దు జిల్లాల్లో అప్రమత్తత కనిపించడం లేదు.
నిజామాబాద్ జిల్లాకు మహారాష్ట్ర సరిహద్దు ఉంది. మహారాష్ట్ర నుంచి తెలంగాణలోకి రావాలంటే నిజామాబాద్ జిల్లాకు మూడు మార్గాలుంటాయ్. బాసర గోదావరి నది వద్ద నుంచి బార్డర్ ప్రారంభమవుతుంది. కందకుర్తి వద్ద మరో బార్డర్. బోధన్ మండలం సాలూరా వద్ద మరో బార్డర్ ఉంటుంది. ఈ మూడు చోట్ల నుంచి మహారాష్ట్ర నుంచి వస్తుంటారు.
మహారాష్ట్రలో భారీగా కరోనా కేసులు నమోదవుతుండటం ఈ బోర్డర్‌లోని ప్రజలు ఆందోళనకు గురి అవుతున్నారు. మహారాష్ట్రలో కొన్ని రోజులుగా పది వేలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. వందల సంఖ్యలో ఒమిక్రాన్ కేసులు ఉంటున్నాయి. ఎక్కువగా మహారాష్ట్ర నుంచి నిజామాబాద్ జిల్లాకు వస్తుంటారు. రెండో వేవ్‌లోనూ మహారాష్ట్ర నుంచి నిజామాబాద్ జిల్లాకు రాకపోకలు జరగటం వల్ల జిల్లాలో భారీగా కరోనా కేసులు నమోదయ్యాయి.
గతంలో నిజామాబాద్ జిల్లా సరిహద్దుల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి మహారాష్ట్ర నుంచి వచ్చే వారికి కరోనా పరీక్షలు చేసేవారు. ప్రస్తుతం థర్డ్ వేవ్ ముంచుకొస్తోంది. మహారాష్ట్ర తెలంగాణ బార్డర్‌లో ఎలాంటి మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయలేదు. మహారాష్ట్ర నుంచి నిజామాబాాద్ జిల్లాకు వచ్చే సరిహద్దుల్లో ఏ ఒక్క చోట కుడా కరోనా టెస్టులు చేసే మెడికల్ క్యాంపులు కనిపించడం లేదు.
థర్డ్ వేవ్ నడుస్తున్నా బార్డర్‌లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయలేదని సరిహద్దు గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్ర నుంచి వస్తున్న ప్రయాణికులు కనీసం మాస్క్ కూడా ధరించటం లేదని చెబుతున్నారు. కేసులు భారీగా పెరగక ముందే తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేయాలని రిక్వస్ట్ చేస్తున్నారు. మహారాష్ట్ర నుంచి వచ్చే వారికి కరోనా పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. పరీక్షలు నిర్వహించిన తర్వాతే జిల్లాలోకి వచ్చేలా ఏర్పాటు చేయాలని సరిహద్దు గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ఇకనైనా అధికారులు మేల్కొని మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దుల్లో కరోనా పరీక్షలు నిర్వహించాలని వేడుకుంటున్నారు.
lso Read: KTR On Nadda : బీజేపీ అంటే బక్వాస్ జుమ్లా పార్టీ.. జేపీ నడ్డా అబద్దాలకు అడ్డా అని కేటీఆర్ విమర్శ !
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి