News
News
X

Nizamabad News: త్వరలోనే ఎన్‌ఐఏ చేతికి పీఎఫ్‌ఐ కేసు- వేగం అందుకున్న విచారణ

పోలీసు కస్టడీలో పీఎఫ్ ఐ సభ్యుడు అబ్దుల్ ఖాదర్. పీఎఫ్ ఐ కార్యకలాపాలపై ఆరా తీస్తున్న పోలీసులు. శిక్షణ పొందిన 200 మంది ఎక్కడున్నారన్న దానిపై ఆరా. జిల్లాలో మరో పది మంది పీఎఫ్ఐ సభ్యులు.?

FOLLOW US: 

నిజామాబాద్ జిల్లాలో ఇటీవల కలకలం రేపిన పీఎఫ్ఐ కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. పీఎఫ్ఐ కార్యకలాపాలపై ఆరా తీసే పనిలో పడ్డారు. పీఎఫ్ఐ సభ్యులను అరెస్టు తర్వాత ఆ సంస్థకు చెందిన సభ్యుడు అబ్దుల్ ఖాదర్‌ను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. అరెస్టై రిమాండ్‌లో ఉన్న ఉగ్రసంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ట్రైనర్ అబ్దుల్ ఖాదర్‌ను పోలీసులు కోర్టు ద్వారా అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఉగ్ర కార్యకలాపాలు ఎక్కడెక్కడ నిర్వహించారు. ఎక్కడెక్కడ శిక్షణ ఇచ్చారనే అంశాలను ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. నిజామాబాద్ పీఎఫ్ఐ శిక్షణ ఇచ్చిన 200 మంది సభ్యులు ఎక్కడి నుంచి వచ్చారు. వారికి ఎక్కడ స్థావరం కల్పించారనే దానిపై పోలీసులు విచారించినట్లు సమాచారం. పీఎఫ్ ఐ సభ్యులు విచారణకు సహకరించకుంటే రిమాండ్‌లో ఉన్న నలుగురిని ఎన్‌ఐఏకు అప్పగించాలని పోలీసులు నిర్ణయానికి వచ్చిన ట్లు సమాచారం.

పీఎఫ్ఐ కార్యకలాపాలపై ఆరా

ఇటీవల నలుగురు పీఎఫ్ఐ సభ్యులను కస్టడీలోకి తీసుకుని విచారించిన పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది. దీంతో ఒక్కొక్కరిని ప్రశ్నించాలని భావించిన పోలీసులు అబ్దుల్ ఖాదర్‌ను మొదట కస్టడీలోకి తీసుకున్నారు. పీఎఫ్ఐ కార్యకలాపాలపై పోలీసులతో రెండ్రోజుల క్రితం ఎన్‌ఐఏ ఉన్నతాధికారి విచారించినట్లు తెలిసింది. పీఎఫ్ఐ సభ్యులపై ఆరో టౌన్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఎవరైనా శిక్షణ కార్యక్రమాల‌్లో పాల్గొన్నారా వంటి విషయాలు అడిగి తెలుసుకున్నారు. పీఎఫ్ఐ సభ్యులను ఎన్‌ఐఏ కస్టడీలోకి తీసుకుంటుందా లేదా అనేది ఎన్‌ఐఏ అధికారి స్పష్టం చేయనట్లు తెలుస్తోంది.

ఈ నివేదిక ఎన్‌ఐఏ అధికారులకు అందజేసిన తర్వాత కస్టడీపై పూర్తి స్థాయి సమాచారం పోలీసులకు అందిస్తారని టాక్. నిజామాబాద్ నగరంలోని ఆటోనగర్‌లో పీఎఫ్ఐ సభ్యుడు అబ్దుల్ ఖాదర్‌ను అదుపులోకి తీసుకున్న తర్వాత అతని వద్ద లభించిన డైరీలోని వివరాల ప్రకారం మరో పది మంది వరకు పీఎఫ్ఐ సభ్యులు జిల్లాలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. క్రియాశీలక సభ్యుల వివరాలు, వారి ఫోన్ నెంబర్ల ఆధారంగా సేకరించినట్లు తెలుస్తోంది. శిక్షణ పొందిన 200 మంది ఎక్కడున్నారనే దానిపై పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. వీరు ఏ ఏ ప్రాంతాల వారు అన్నదానిపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. 

కరాటే, లీగల్ అవేర్‌నెస్ ముసుగులో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు వీళ్లంతా. నిజామాబాద్, ఆదిలాబాద్, కడప, కర్నూలు, కరీంనగర్ నుంచి యువతను పిలిపించి శిక్షణ ఇస్తున్నారని తెలిపారు సిపి నాగరాజు. వరంగల్ వంటి ఇతర ప్రాంతాలకు వెళ్లి శిక్షణ ఇచ్చారు. అగ్రెసివ్‌గా ఉండే యువకులను ఎంపిక చేసి శిక్షణ ఇచ్చారు. 

శిక్షణ పొందిన వారు మారణాయుధాలు సమకూర్చుకుంటారు. కడపలోనూ ఒక బేస్ క్యాంప్ ఏర్పాటు చేసుకున్నారని సమాచారం. 200 మందిలో 30 మందిని ఇప్పటి వరకు శిక్షణ తీసుకున్నారని గుర్తించారు పోలీసులు. ముగ్గురిని అరెస్ట్ చేశారు. బోధన్, జగిత్యాల, ప్రకాశం ప్రాంతాలకు చెందిన వారూ ఇందులో ఉన్నారు.

శిక్షణ పొందిన వారి వివరాలను పోలీసులు సేకరించే పనిలో పడ్డారు. పీఎఫ్ఐ ముఖ్య ఉద్దేశం అమాయక పేద యువకులను చేరదీసి... వారికి మతోన్మాదాన్ని రెచ్చగొట్టడం, వారికి మారణాయుధాలతో శిక్షణ ఇస్తారు. సిమి సంస్థకు బదులుగా ఈ పీఎఫ్‌ఐ అనుబంధంగా ఏర్పాటు చేశారని పోలీసులు వివరించారు. 

యువతను మత విద్వేషాలు రెచ్చగొట్టేలా అల్లర్లకు ఉసిగొల్పేలా శిక్షణ ఇస్తూ మతం పేరుతో భావోద్వేగాలు రెచ్చగొట్టడం కోసం పాపులర్ ఫ్రoట్ ఆఫ్ ఇండియా సంస్థ స్థాపించి కార్యకలాపాలు సాగించారు. నిజామాబాద్‌లోని ఆటోనగర్, ఉస్మానియా మసీద్‌ సమీపంలో ఈ తంతు సాగింది. అబ్దుల్ ఖాదర్‌ను అరెస్టు చేసే టైంలో ఆటో నగర్‌లో ఆయన ఇంట్లోకి వెళ్లగా పాపులర్ ఫ్రoట్ ఆఫ్ ఇండియా పేరుతో 2 బ్యానర్లు, కనిపించాయి. ఒక వైట్ రైటింగ్ బోర్డు, 15 వెదురు బొంగు కర్రలు, మూడు నాంచాకులు, 3 సెట్ల పేపర్‌ బంచ్‌లు, మూడు హాండ్ బుక్‌లు, ఒక  నోట్ బుక్‌, కొన్ని బస్, ట్రైన్ టిక్కెట్స్,స్పీకర్‌లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు స్వాధీనం చేసుకున్న పుస్తకాల్లో  భారత దేశ వ్యతిరేక కార్యక్రమాలు గురించి ఉంది. యువకులను ఎంపిక మానవ విస్పోటంగా మార్చడమే వీళ్ల ప్రధాన ఉద్దేశమని వివరించినట్టు పోలీసులు చెబుతున్నారు. ఎప్పుడంటే అప్పుడు ఎక్కడంటే అక్కడ అసాంఘిక కార్యక్రమాలు, దాడు చేయుట, అవసరమైతే దేశాన్ని అస్థిర పరచటానికి ఉపయోగిస్తారని పేర్కొన్నారు. 

Published at : 29 Jul 2022 06:31 PM (IST) Tags: Nizamabad news Nizamabad Crime PFI member in Police costady Nizamabad News Update.

సంబంధిత కథనాలు

Kamareddy Bus Accident : కామారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆర్టీసీ బస్సు బోల్తా, 25 మందికి గాయాలు

Kamareddy Bus Accident : కామారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆర్టీసీ బస్సు బోల్తా, 25 మందికి గాయాలు

తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్- త్వరలో గురుకుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్- త్వరలో గురుకుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

MLA Tractor Journey: మొన్న తెప్పపై, నిన్న అడవిలో ట్రాక్టర్‌పై మహిళా ఎమ్మెల్యే - ఎందుకో తెలిస్తే మెచ్చుకుంటారు !

MLA Tractor Journey: మొన్న తెప్పపై, నిన్న అడవిలో ట్రాక్టర్‌పై మహిళా ఎమ్మెల్యే - ఎందుకో తెలిస్తే మెచ్చుకుంటారు !

Rains in AP Telangana: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నేడు ఏపీ, తెలంగాణలో పలు జిల్లాలకు IMD ఎల్లో అలర్ట్ జారీ

Rains in AP Telangana: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నేడు ఏపీ, తెలంగాణలో పలు జిల్లాలకు IMD ఎల్లో అలర్ట్ జారీ

Petrol-Diesel Price, 13 August: ఈ నగరంలో బాగా పెరిగిన ఇంధన ధరలు, ఇక్కడ తగ్గుదల - మీ ప్రాంతంలో ఈరోజు ఇలా

Petrol-Diesel Price, 13 August: ఈ నగరంలో బాగా పెరిగిన ఇంధన ధరలు, ఇక్కడ తగ్గుదల - మీ ప్రాంతంలో ఈరోజు ఇలా

టాప్ స్టోరీస్

Karthikeya 2 Movie Review - కార్తికేయ 2 రివ్యూ : ద్వారకా నగరం - శ్రీకృష్ణుడు దాచిన రహస్యం - నిఖిల్ సినిమా ఎలా ఉందంటే?

Karthikeya 2 Movie Review - కార్తికేయ 2 రివ్యూ : ద్వారకా నగరం - శ్రీకృష్ణుడు దాచిన రహస్యం - నిఖిల్ సినిమా ఎలా ఉందంటే?

TDP On Madhav : మాధవ్ వీడియోను అమెరికా ఫోరెన్సిక్ ల్యాబ్‌లో టెస్ట్ చేయించిన టీడీపీ - రిజల్ట్ ఏమిటంటే ?

TDP On Madhav :  మాధవ్ వీడియోను అమెరికా ఫోరెన్సిక్ ల్యాబ్‌లో టెస్ట్ చేయించిన టీడీపీ - రిజల్ట్ ఏమిటంటే ?

Independence Day 2022: ఎర్రకోట వద్ద పదివేల మంది పోలీసులు, 5 కిలోమీటర్ల వరకూ నో ఫ్లైయింగ్ జోన్

Independence Day 2022: ఎర్రకోట వద్ద పదివేల మంది పోలీసులు, 5 కిలోమీటర్ల వరకూ నో ఫ్లైయింగ్ జోన్

Srinivas Goud Firing : కాల్పులు జరిపిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ - పోలీసు దగ్గర ఎస్ఎల్ఆర్ తీసుకుని మరీ ..

Srinivas Goud Firing :  కాల్పులు జరిపిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ - పోలీసు దగ్గర ఎస్ఎల్ఆర్ తీసుకుని మరీ ..