అన్వేషించండి

Nizamabad News: ఆరుద్ర పురుగు వచ్చిందంటే అన్నీ శుభ శకునాలే

నేటి నుండి ఆరుద్ర కార్తె ప్రారంభం. తొలకరి చినుకు.. ఆరుద్ర మెరుపు. దేవతలకు, వరుణ దేవుడికి ప్రతి రూపంగా ఆరుద్ర పురుగులు. ఆరుద్ర పురుగు కనిపించిందంటే రైతుల పంట పండినట్లే.

ఆరుద్ర కార్తె పేరు వినగానే మొదట గుర్తుకొచ్చేవి ఆరుద్ర పురుగులే. వాతావరణం చల్లబడి , తొలకరి జల్లులు కురియగానే నల్లని నేలపై ఇవి ఎర్రని బొట్లుగా మెరుస్తూ కనిపిస్తాయి. వర్షాలు కురుస్తుండటంతో ఈ మృగశిర కార్తెలోనే ఆరుద్ర పురుగులు నేలపై తిరుగుతూ సందడి చేస్తుంటాయి. రైతులకు ఆనందం కలిగిస్తుంటాయి. అన్నదాతలకు మేలు చేసే ఈ పర్యావరణ నేస్తాలు...ఇప్పటి తరానికి ఇవేవో తెలియదు.. కానీ పల్లెటూళ్లో ఉండే పెద్దవారికి ఓ 30 ఏళ్లు పైబడిన వారందరికీ ఆ పురుగులు ఏంటో అవి తీసుకొచ్చే మెసేజ్ ఎంటో స్పష్టంగా తెలుసు.. ఇవి రైతులు దుక్కులు దున్నాక పొలాల్లో సందడి చేస్తాయి. వీటిని ఏ రైతు చంపడు.. ఎవ్వరినీ చంపనీయడు.. దేవతలకు, వరుణ దేవుడికి ప్రతిరూపంగా వీటిని భావిస్తారు.. కొలుస్తారు..

అలాంటి ఆరుద్ర పురుగులు వర్షాలు బాగపడి కాలమవుతుందనుకుంటేనే మనుషులకు కనిపిస్తాయి. ఈ పురుగులు గ్రామాల్లో కనిపించాయంటే రైతులు సంతోషంతో గంతులేస్తారు. ఎందుకంటే ఆరుద్ర పురుగులు కనిపించాయంటే ఆ సంవత్సరం సంవృద్ధిగా వర్షాలు పడతాయని సంకేతం.. చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు నిండుతాయనే ధీమా రైతుల్లో నెలకొంటుంది. ఈ అరుద్ర పురుగులు మనకు కనిపిస్తున్నాయంటే ఈసారి కాలమైనట్టే లెక్క.. ‘అరుద్ర’తో రైతుల కళ్ళల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. బీడువారిన నేతలపై తొలకరి జల్లులు పడగానే బిలబిలామంటూ ఆరుద్ర పురుగులు నేలపైకి వచ్చేస్తాయి. అలా ఆరుద్రపురుగులు నేలపై కనిపిస్తే ఆ సంవత్సరం వర్షాలు ఎక్కువగా కురుస్తాయనీ..రైతన్నలు చక్కగా వ్యవసాయం చేసుకోవచ్చని అంటారు. అలా..ఆరుద్ర పురుగులకు , రైతులకు అవినాభావ సంబంధం ఉంది. ఎర్రగా , బొద్దుగా చూడ ముచ్చటగా ఉండే ఆరుద్ర పురుగు ఆగమనాన్ని రైతులు శుభసూచకంగా భావిస్తారు. ఇక వ్యవసాయం పనులు మొదలు పెట్టుకోవచ్చని ఆనందంగా పొలాలకేసి మళ్లుతారు.  

ఎర్రగా..బొద్దుగా..చక్కటి రంగులో మెరిసిపోయే ఈ అందమైన పురుగులు తొలకరి వర్షాలు కురవగానే కుప్పలు కుప్పలుగా కనిపించి కనువిందు చేస్తాయి. వ్యవసాయ పనులు మొదలు పెట్టేందుకు ఆరుద్ర కార్తె అనుకూలమైంది. ఈ కార్తెలో మాత్రమే కనబడే అరుదైన పురుగు ఆరుద్ర. అందుకే దాన్ని ఆరుద్ర పురుగు అంటారు. ఇవి ప్రకృతి నేస్తాలు. సాధారణంగా ఈ ఆరుద్ర పురుగులు ఆరుద్ర కార్తెలో కనిపిస్తాయి. ఈ పురుగులను రైతులు చూస్తే చాలు ఆనందంతో పరవశించిపోతారు. ఎందుకంటే ఆరుద్ర పురుగులు కనిపించాయంటే ఆ సంవత్సరం వర్షాలు సంవృద్ధిగా కురుస్తాయని రైతుల నమ్మకం. మనిషి స్వార్థం కోసం విచ్చలవిలవిడి ఎరువులు, రసాయనాలు వాడుతూ పుడమి తల్లిని కాలుష్యకాసారంగా మారుస్తున్నాడు. దీంతో వీటి ఉనికికే ప్రమాదం ఏర్పడింది. 

ఈ ఆరుద్ర పురుగును కొన్ని చోట్ల..

పట్టు పురుగు అనీ , చందమామ పురుగు అనీ, లేడీ బర్డ్ అనీ , ఇంద్రగోప పురుగు అని కూడా అంటారు.  ఇలా చాలా పేర్లు ఉన్న ఈ పురుగు చూడటానికి ఎర్రని మఖ్మల్ బట్టతో చేసిన బొమ్మలాంటి పురుగులా ఉంటుంది. ముట్టుకుంటేనే అత్తిపత్తి చెట్టు ఆకుల్లా ముడుచుకు పోయే స్వభావం ఉన్న ఈ పురుగులు నేలమీద కాసింత ఇసుక నేలల్లో , పచ్చగడ్డి కాసింత ఉన్న చోట్లలో విరివిగా కనిపిస్తాయి. ఈ అందమైన , మెత్తనైన పురుగులు వర్షాకాలం తొలకరి వర్షాలు కురవగానే, బిలబిల మంటూ కుప్పలు కుప్పలుగా కనిపించి కనువిందు చేస్తాయి.

టాప్ హెడ్ లైన్స్

Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
Adilabad Crime News: క్యాష్ విత్‌డ్రా చేసిన నిమిషాల్లో కొట్టేస్తున్న దొంగల ముఠా ప్రధాన నిందితుడు అరెస్ట్
క్యాష్ విత్‌డ్రా చేసిన నిమిషాల్లో కొట్టేస్తున్న అంతరాష్ట్ర దొంగల ముఠా ప్రధాన నిందితుడు అరెస్ట్
Breaking News: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి
Nirmal Supari Murder Case: సవతి తల్లితో వివాహేతర బంధం - చివరికి మర్డర్ - చేయించింది కూడా సవతి తల్లే !
సవతి తల్లితో వివాహేతర బంధం - చివరికి మర్డర్ - చేయించింది కూడా సవతి తల్లే !

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
Indiramma Towers Helpline Number: ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
IND vs ZIM 3rd T20 Update:  వైభవ్ సూర్యవంశీ స్ట‌న్నింగ్ ఫిఫ్టీ .. టీమిండియా భారీ స్కోరు, క్లీన్ స్వీప్ దిశగా శ్రేయ‌స్ సేన సూప‌ర్ స్కెచ్!
వైభవ్ సూర్యవంశీ స్ట‌న్నింగ్ ఫిఫ్టీ .. టీమిండియా భారీ స్కోరు, క్లీన్ స్వీప్ దిశగా శ్రేయ‌స్ సేన సూప‌ర్ స్కెచ్!
Chandrababu Meets Balakrishna: హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Dharmendra Pradhan Resignation: విద్యార్థుల ఆందోళన తొలిరోజే రాజీనామాకు సిద్ధపడిన ధర్మేంద్ర ప్రధాన్, కానీ!: విజయ్‌ వర్గీయా
విద్యార్థుల ఆందోళన తొలిరోజే రాజీనామాకు సిద్ధపడిన ధర్మేంద్ర ప్రధాన్, కానీ!: విజయ్‌ వర్గీయా
YS Sharmila Surgery: హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
Second Marriage OTT : ఓటీటీలోకి సరికొత్త రొమాంటిక్ సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి సరికొత్త రొమాంటిక్ సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Cheruvugattu Fire Accident: చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
Embed widget