News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

ఆదిలాబాద్ అడవుల్లో అలజడి- ఏజెన్సీ గ్రామాల్లో ఖాకీల నిఘా!

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అడవుల్లో మావోయిస్టుల కదలికలు గుర్తించిన పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఈ క్రమంలోనే జిల్లావ్యాప్తంగా సరిహద్దు ప్రాంతాలపై నిఘా పెట్టారు.

FOLLOW US: 
Share:

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అడవుల్లో మళ్లీ మావోయిస్టుల అలజడి మొదలైంది. ఇంతకాలం ప్రశాంతంగానే ఉన్న ఏజెన్సీ గ్రామాల్లో మావోయిస్టుల కదలికలతో హైటెన్షన్ కనిపిస్తోంది. తాజాగా కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా మీదుగా ఆదిలాబాద్ జిల్లా అడవుల్లోకి మావోయిస్టులు ప్రవేశించారనే పక్కా సమాచారంతో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. నిఘా వర్గాల హెచ్చరికలతో ఆదిలాబాద్, ఆసిఫాబాద్‌ ఎస్పీలు ఉదయ్ కుమార్ రెడ్డి, కే.సురేష్ కుమార్ నేతృత్వంలో పోలీసు బృందాలు యాక్ష షురూ చేశాయి. జిల్లా అడవుల్లో ప్రత్యేక పోలీస్ బలగాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఇటీవల జరిగిన వారోత్సవాల సందర్భంగా మావోయిస్టులు లేఖలు విడుదల చేయడంతో పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇంతలోనే “మంగి - ఇంద్రవెల్లి” దళం పేరిట హెచ్చరిక లేఖలు సైతం విడుదలయ్యాయి. గతంలో పోలీసులకు దొరికినట్లే దొరికి.. తప్పించుకున్న మైలారపు అడెల్లు ఆలియాస్ భాస్కర్ ఆచూకీ కోసం పోలీసులు జిల్లా అడవులను జల్లెడ పడుతున్నారు. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా అడవులు దట్టంగా మారడంతో మావోయిస్టుల కదలికలకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయనే వాదనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

మాజీ మావోయిస్టులపై కూడా నిఘా..

మావోయిస్టుల కదలికలు ఉన్నాయన్న సమాచారంతో పోలీసులు జిల్లా సరిహద్దు ప్రాంతంపై ప్రత్యేక నిఘా పెట్టారు. ముఖ్యంగా కవ్వాల్ అటవీ ప్రాంతంతోపాటు మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంపై దృష్టి సారించారు. ఏజెన్సీ మండలాలైన, తిర్యాని, లింగాపూర్, జన్నారం, కడెం, పెంబి, దండెపల్లి, కెరమెరి, జైనూర్, సిర్పూర్‌యు, చింతలమానేపల్లి, వాంకిడి, సిరికొండ, నార్నూర్, గాదిగూడ, ఇంద్రవెల్లి, బజారాత్నూర్‌లోని పోలీసు స్టేషన్లను అప్రమత్తం చేశారు.

ఇప్పటికే టీంలుగా విడిపోయిన ప్రత్యేక బలగాలు.. కూంబింగ్ ఆపరేషన్ మొదలు పెట్టాయి. మాజీల కదలికలపై నిఘా సారిస్తూనే... అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకుంటున్నారు. రహస్య సమాచార వ్యవస్థను మరింతగా పటిష్టం చేసుకుంటున్నారు. అనుమానిత వ్యక్తులపై ఓ కన్నేసి ఉంచారు. ఎప్పటికప్పుడు నిఘా వర్గాల సమాచారంతో ముందుకెళ్తున్నారు. మావోయిస్టు కదలికలపై పట్టున్న రిటైర్డ్ అధికారులను కూడా రంగంలోకి దింపి సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

వర్గీస్ పేరిట లేఖలు విడుదలవడంతో కలకలం..

జిల్లాలో మావోయిస్టుల ఉనికి లేదని పలుమార్లు పోలీసులు ప్రకటించినప్పటికీ.. మళ్లీ మవోయిస్టులు తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. కరోనా సమయంలోనే పెద్దఎత్తున రిక్రూట్మెంట్ జరిగినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే నేరడిగొండ మండలానికి చెందిన ఓ గిరిజన యువకుడు పోలీసుల ఎన్ కౌంటర్‌లో మరణించాడు. అప్పటి నుంచి కొంత సైలెంట్ గానే కనిపించినా.. మావోయిస్టుల కదలికలు ఇటీవల జరిగిన వారోత్సవాల సందర్భంగా వర్గీస్ పేరిట లేఖలు విడుదల కావడం కలకలం రేపింది. అనుకున్నట్లుగానే ఇంద్రవెల్లి మండల అడవుల్లో వారోత్సవ సభను నిర్వహించినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం మావోయిస్టుల సంచారానికి జిల్లా అడవులు అనువుగా ఉండడంతో వారి కదలికలు మరింతగా పెరిగే అవకాశం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. 

ప్రజలెవరూ మావోలకు సహకరించవద్దు..

రాజకీయ పార్టీల నేతలు, ఇతర ముఖ్య అధికారులు మారుమూల ప్రాంతాల పర్యటనను వాయిదా వేసుకోవాలని సూచిస్తున్నారు పోలీసులు. మారుమూల గిరిజన ప్రాంతాల ప్రజలు మావోయిస్టులకు సహకరించవద్దంటూ విజ్ఞప్తులు చేస్తున్నారు. అనవసరంగా ఇబ్బందుల్లో పడొద్దని చెబుతున్నారు. ఏజెన్సీ గ్రామాల ప్రజలతో మరింతగా మమేకమవుతూ పరిస్థితులను వివరిస్తున్నారు. అంతే కాకుండా స్థానిక ఏజెన్సీ గ్రామాల్లోని యువత మావోయిస్టుల కార్యకలాపాలకు ఆకర్షితులు కాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల ఏజెన్సీ ప్రాంతాల్లో మెగా మెడికల్ క్యాంపులు నిర్వహించారు. దీనిలో భాగంగా గిరిజనులకు పోలీసుల పట్ల విశ్వాసం కలిగే విధంగా చర్యలు చేపట్టారు. మావోయిస్టుల కదలికలను ముందే పసిగట్టిన పోలీసు యంత్రాంగం... అన్ని రకాల చర్యలు చేపడుతూ ముందుకెళ్తోంది. ముఖ్యంగా సాంకేతిక పరిజ్ఞానంతో మావోయిస్టుల కదలికలను పసిగట్టే ప్రయత్నం ముమ్మరం చేస్తోంది.

సంఘ విద్రోహక శక్తులను జిల్లా ప్రజలు విశ్వసించే పరిస్థితులు లేవని, ప్రభుత్వం అందిస్తున్న ప్రయోజనాలతో సంతోషంగా ఉన్నారని పోలీస్ అధికారులు చెబుతున్నారు. జిల్లా పోలీసు వ్యవస్థ పూర్తిగా అప్రమత్తతతో వ్యవహరిస్తోంది. గత మూడు సంవత్సరాలుగా జిల్లాలో కూంబింగ్ ఆపరేషన్లు నిరంతరంగా కొనసాగుతూనే ఉన్నాయని, సంఘ విద్రోహక శక్తుల వల్ల కలిగే అనర్థాలపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. జిల్లా మారుమూల గ్రామాలలో కూడా పోలీసులకు సమాచార వ్యవస్థ పటిష్టంగా ఉందని, మావోయిస్టులకు జిల్లా ప్రజలు ఎవరూ సహకరించవద్దని చెబుతున్నారు.

Published at : 29 Aug 2022 01:39 PM (IST) Tags: Maoists Latest News Maoists in Adilabad Forest Maoists in Telangana Adilabad Police Alerted For Maoists Maoists Movement in Telangana

ఇవి కూడా చూడండి

KNRUOH: కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో ఎంఎస్సీ నర్సింగ్‌, ఎంపీటీ కోర్సులు - వివరాలు ఇలా

KNRUOH: కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో ఎంఎస్సీ నర్సింగ్‌, ఎంపీటీ కోర్సులు - వివరాలు ఇలా

Nizamabad: ఫ్రిడ్జ్ ఓపెన్ చేయబోతే షాక్ కొట్టి చిన్నారి మృతి, తల్లిదండ్రులూ బీ కేర్‌ఫుల్‌

Nizamabad: ఫ్రిడ్జ్ ఓపెన్ చేయబోతే షాక్ కొట్టి చిన్నారి మృతి, తల్లిదండ్రులూ బీ కేర్‌ఫుల్‌

Breaking News Live Telugu Updates: కొవిడ్‌ వ్యాక్సిన్ కోసం కృషి చేసిన శాస్త్రవేత్తలకు వైద్య శాస్త్రంలో నోబెల్‌

Breaking News Live Telugu Updates: కొవిడ్‌ వ్యాక్సిన్ కోసం కృషి చేసిన శాస్త్రవేత్తలకు వైద్య శాస్త్రంలో నోబెల్‌

Modi Tour: నిజామాబాద్‌లో 2 గంటల పర్యటన - మోదీ టూర్ షెడ్యూల్ ఇదే!

Modi Tour: నిజామాబాద్‌లో 2 గంటల పర్యటన - మోదీ టూర్ షెడ్యూల్ ఇదే!

Telangana Assembly Election 2023: తెలంగాణ ఎన్నికల ప్రక్రియలో మరో అడుగు- రేపటి నుంచి మూడు రోజుల పాటు ఈసీ అధికారుల పర్యటన

Telangana Assembly Election 2023: తెలంగాణ ఎన్నికల  ప్రక్రియలో మరో అడుగు- రేపటి నుంచి మూడు రోజుల పాటు ఈసీ అధికారుల పర్యటన

టాప్ స్టోరీస్

India Vs Nepal: ఏసియన్ గేమ్స్‌లో సెమీస్‌లోకి భారత క్రికెట్ జట్టు - నేపాల్‌పై ఘన విజయం

India Vs Nepal: ఏసియన్ గేమ్స్‌లో సెమీస్‌లోకి భారత క్రికెట్ జట్టు - నేపాల్‌పై ఘన విజయం

Telangana Congress Side Effects : తెలంగాణ కాంగ్రెస్‌కు చేరికల సైడ్ ఎఫెక్టులు - బుజ్జగించలేకపోతున్నారా ?

Telangana Congress Side Effects : తెలంగాణ కాంగ్రెస్‌కు చేరికల సైడ్ ఎఫెక్టులు - బుజ్జగించలేకపోతున్నారా ?

Supreme Court: నేడే సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణ - వీరి బెంచ్ వద్ద లిస్టింగ్

Supreme Court: నేడే సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణ - వీరి బెంచ్ వద్ద లిస్టింగ్

Salman Khan - Somy Ali : నన్ను వాడుకుని సంగీతను సల్మాన్ మోసం చేశాడు - పాకిస్తాన్ నటి సంచనల ఆరోపణలు

Salman Khan - Somy Ali : నన్ను వాడుకుని సంగీతను సల్మాన్ మోసం చేశాడు - పాకిస్తాన్ నటి సంచనల ఆరోపణలు