అన్వేషించండి

12వేల మంది కోసం 21వేల కిలోమీటర్ల పాదయాత్ర- బ్లడ్‌ డొనేషన్‌పై కిరణ్ వర్మ అవేర్‌నెస్‌

ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలంటూ ఢిల్లీ యువకుడి పాదయాత్ర. మొత్తం 21 వేల కి.మీ టార్గెట్. రక్తాదానం చేయాలని అవగాహన కల్పించేందుకే పాదయాత్ర. ఇప్పటికే 7,900 కి,మీ పూర్తి.

రక్తం.. దేశంలో చాలా మందికి అత్యవసరమైంది. లక్షల మంది సరైన సమయానికి బ్లడ్ అందకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. మరికొందరు ప్రాణాలు వదులుతున్నారు. ఒక్కరు రక్తదానం చేస్తే ముగ్గురి ప్రాణాలు కాపాడవచ్చు. దీనిపై సరైన అవగాహన లేకపోవడంతో చాలా మంది రక్తదానానికి ముందుకు రావడం లేదు. 

రక్తదానంపై అవగాహన కల్పించేందుకు ఓ కుర్రాడు పాదయాత్ర చేపట్టాడు. ఢిల్లీకి చెందిన కిరణ్ వర్మ అనే యువకుడు రక్తదానంపై చేపట్టిన పాదయాత్ర 21 వేల కిలో మీటర్ల మేరకు సాగనుంది. ప్రతి ఒక్కరు రక్తదానం చేసి తోటి వారి ప్రాణాలు కాపాడాలని 2021 డిసెంబర్ 28న త్రివేండ్రం నుంచి కిరణ్ వర్మ పాదయాత్ర ప్రారంభించారు. కిరణ్ కుమార్ ఓ ఫౌండేషన్ స్థాపించారి. కేవలం రక్తం, ఒకే భోజనంతో మార్పు అనే రెండు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. 2018లో కిరణ్ వర్మ భారతదేశం అంతటా 16,000 కిలోమీటర్లు ప్రయాణించారు. ఇందులో 6,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ కాలినడకన ప్రయాణం చేశారు. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు కిరణ్ వర్మ. 

ప్రపంచంలోనే మొట్టమొదటి వర్చువల్ రక్తదాన ప్లాట్‌ఫారమ్ ఏర్పాటు చేశారు కిరణ్ వర్మ, రక్త దాతలు, రక్తం అవసరం ఉన్న వాళ్లు కనెక్ట్ అయితే ఎలాంటి ఛార్జీ లేకుండానే రక్తం అందిస్తారు. దీన్ని 29 జనవరి 2017న ప్రారంభించారు కిరణ్ వర్మ. ఇప్పటి వరకు రక్తదానం ద్వారా 35,000 వేల మంది ప్రాణాలు కాపాడామని కిరణ్ కుమార్ తెలిపారు. ఒకపూట బోజనం రూ.10కే ఢిల్లీలో అందించే కార్యక్రమం చేపట్టారు కిరణ్ వర్మ. ఇప్పటి వరకు 4,00,000 మందికి భోజనాలు అందించామని కిరణ్ వర్మ తెలిపారు. సెప్టెంబర్ 15, 2022 న, కిరణ్ వర్మ హైదరాబాద్‌లో పివి నరసింహారావు పేరు మీద వారి కుటుంబ సభ్యులు నిర్మించిన బ్లడ్ బ్యాంక్‌ను ప్రారంభించారు.

వారణాసిలో 3.5 కిలోమీటర్ల మారథాన్ కూడా నిర్వహించారు కిరణ్ వర్మ. ఇందులో 100 మందికిపైగా పాల్గొన్నారు. నిజామాబాద్ తర్వాత అతని తదుపరి గమ్యం ఆదిలాబాద్, ఆసిఫాబాద్. ఇలా తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో పాదయాత్ర చేయనున్నట్లు తెలిపారు కిరణ్ వర్మ. అసలు ఈ ఢిల్లీ యువకుడు ఈ అవైర్ నెస్ కార్యక్రమాన్ని ఎందుకు చేపట్టాడనే దాని వెనుక ఓ విషాధగాథ అతన్ని కలిచివేసింది. 

కిరణ్ వర్మ తన రక్తాన్ని ఢిల్లీలోని ఓ ఫ్యామిలీకి అమ్మారు. తన భర్త చికిత్స వైద్య బిల్లులు చెల్లించడానికి ఆ ఇంటి మహిళ వ్యభిచారం చేసిందని కిరణ్ వర్మకు తెలిసింది. ఆ సంఘటన తెలిసిన కిరణ్ వర్మ చలించిపోయారు. తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. దేశంలో రక్తం కొరత చాలా ఉందని గ్రహించి అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేశారు. 

2025 నాటి దేశంలో రక్తం కొతర ఉండకూడదని ... రక్తం దొరక్క ఎవరూ చావకూడదు అని లక్ష్యంగా పెట్టుకున్నారు కిరణ్ వర్మ. దేశంలో ప్రతిరోజూ 12,000పైగా జనాలకు రక్తం దొరకట్లేదు. 3 మిలియన్లకుపైగా ప్రజలకు రక్తం అవసరం ఉంటోంది. 5 మిలియన్ల యువత రక్తదానం చేయడం ప్రారంభిస్తే.... భారతదేశంలో రక్తం అందుబాటులో ఉండి.... ఒక్క మరణం కూడా జరిగే అవకాశం ఉండదని కిరణ్ వర్మ చెబుతున్నారు. కోవిడ్ వల్ల రెండో వేవ్‌లో... ప్లాస్మా సంక్షోభాన్ని ఎదుర్కొన్నారు. అలాగే రక్త కొరత ఎక్కువగా ఉంది. అందుకే దేశంలో ఉన్న ప్రజలు ముఖ్యంగా యువకులు రక్తం దానం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు కిరణ్ వర్మ. 

రక్తం మనదేశంలో నిత్యం చాలా మందికి అవసరం ఉంటుందని తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా రక్తదానం చేస్తే రక్తం అవసరం ఉన్న రోగుల ప్రాణాలు కాపాడవచ్చని చెబుతున్నాడు కిరణ్ వర్మ చెబుతున్నారు. అందుకే ప్రజల్లో అవగాహన కల్పించటం కోసం 21 వేల కిలోమీటర్ల పాదయాత్రను చేపట్టారు. కిరణ్ వర్మ పాదయాత్ర ఢిల్లీకి చేరాలంటే ఇంకా రెండేళ్లు పడుతుందని తెలిపారు.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Hyderabad News: డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Gavaskar Standing Ovation: నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
Embed widget