Hot Oil on Face: అక్క ముఖంపై సలసల కాగే నూనె పోసేసిన చెల్లి, అర్ధరాత్రి అంతా నిద్రిస్తుండగా - కారణం ఏంటంటే

Kamareddy: అర్ధ రాత్రి అక్క చాందినీ నిద్రపోయి ఉండగా, చెల్లెలు నూనెను వేడి చేసి ఆమె ముఖంపై పోసింది. దీంతో ముఖంపై ఆ నూనె పడిన ప్రదేశం మొత్తం కాలిపోయింది.

FOLLOW US: 

Kamareddy News:

తోడబుట్టిన అక్క పట్ల ఓ చెల్లెలు అత్యంత కిరాతకంగా వ్యవహరించిన ఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది. ఆ యువతి ఇలా విచక్షణ లేకుండా ప్రవర్తించిన తీరు ఆ ప్రాంతంలో తీవ్ర చర్చనీయాంశం అయింది. అక్క ముఖంపై సొంత చెల్లెలు సల సల కాగుతున్న వేడి నూనె పోసింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ కాలనీలో జరిగింది. తాను దగ్గరగా ఉంటున్న అదే వ్యక్తితో తన అక్క కూడా సన్నిహితంగా ఉండడం గమనించి ఆమె ఓర్వలేకపోయింది. ఆ ఉక్రోషం తట్టుకోలేకనే చెల్లెలు తన అక్కపై ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. 

అర్ధ రాత్రి అక్క చాందినీ నిద్రపోయి ఉండగా, చెల్లెలు నూనెను వేడి చేసి ఆమె ముఖంపై పోసింది. దీంతో ముఖంపై ఆ నూనె పడిన ప్రదేశం మొత్తం కాలిపోయింది. వేడి నూనె బాధకు తట్టుకోలేక చాందినీ గట్టిగా కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు ఉలిక్కిపడి నిద్రలేచారు. కంగారు పడ్డ వారు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స ప్రారంభించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందడంతో నిందితురాలిపై కేసు నమోదు చేసినట్లుగా పోలీసులు తెలిపారు. అక్క పట్ల కనీస మానవత్వం లేకుండా ప్రవర్తించిన చెల్లెలి తీరుపై కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.

ముంబయిలోనూ ఇలాంటి ఘటనే..
రెండు రోజుల క్రితం మహరాష్ట్రలోని ముంబయిలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. ఇద్దరు చిరువ్యాపారుల మధ్య గొడవ ఓ బాలిక ప్రాణాల మీదకు తెచ్చింది. ముంబయి సబర్బన్ కుర్లాలో ఇద్దరు పావ్ భాజి వ్యాపారులు ఇంటి విషయంలో ఘర్షణ పడ్డారు. ఒకరిపై మరొకరు తీవ్రంగా తిట్టుకుంటూ వేడి వేడి నూనెను విసురుకున్నారు. అదే సమయంలో ఆ దుకాణానికి వచ్చిన 8 సంవత్సరాల బాలికపై ఆ వేడి నూనె పడటంతో ముఖమంతా కాలిపోయింది. ఛాతీ కూడా పూర్తిగా కాలిపోవడంతో చికిత్స కోసం వెంటనే ఆసుపత్రికి తరలించారు. 

వసీం ఖలీల్ అన్సారీ, ముస్తకీమ్ హమీక్‌ అన్సారీ మధ్య గొడవ మరింత పెద్దది కావడంతో ఖలీల్‌ కడాయితో కొట్టాడు. అందుకు ప్రతిగా హమీక్ అన్సారీ ఖలీల్ అన్సారీపై కళాయిలో ఉన్న వేడి వేడి నూనెను విసిరికొట్టాడు. అదే సమయంలో పావ్ బాజీ కొనుక్కునేందుకు షాపు దగ్గరకు వచ్చిన 8 సంవత్సరాల అఫ్సీన్‌ షేక్‌ అనే బాలిక ముఖంపై నూనె పడింది. అంతే కళాయిలోని కాలిపోతున్న నూనె చిన్నారిపై పడటంతో గట్టిగా ఏడుస్తూ కేకలు పెట్టింది. బాలికతో పాటు ఆమె వెంట వచ్చిన 76 సంవత్సరాల మున్వర్ అలీకి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే బాలికను ఆసుపత్రికి తరలించారు.

Published at : 23 Mar 2022 10:56 AM (IST) Tags: Kamareddy Incident Kamareddy woman woman pours hot oil on sister Ashok Nagar Colony hot oil on face

సంబంధిత కథనాలు

MLC Kavitha: జూన్‌ 4 నుంచి సీహెచ్ కొండూరు లక్ష్మీ నరసింహ స్వామి విగ్రహ ప్రతిష్ఠ, ఆహ్వానం పలుకుతున్న ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha: జూన్‌ 4 నుంచి సీహెచ్ కొండూరు లక్ష్మీ నరసింహ స్వామి విగ్రహ ప్రతిష్ఠ, ఆహ్వానం పలుకుతున్న ఎమ్మెల్సీ కవిత

Honor Killing In Adilabad: ఆదిలాబాద్‌ జిల్లాలో దారుణం- మతాంతర వివాహం చేసుకుందని కుమార్తె గొంతు కోసి హత్య చేసిన తండ్రి

Honor Killing In Adilabad: ఆదిలాబాద్‌ జిల్లాలో దారుణం- మతాంతర వివాహం చేసుకుందని కుమార్తె గొంతు కోసి హత్య చేసిన తండ్రి

Nizamabad News: మంచిప్ప రిజర్వాయర్ రీ డిజైన్‌పై కొనసాగుతున్న రగడ

Nizamabad News: మంచిప్ప రిజర్వాయర్ రీ డిజైన్‌పై కొనసాగుతున్న రగడ

Nikhat Zareen First Coach: చిన్న రేకుల షెడ్డులో నిఖత్ జరీన్‌కు సొంత డబ్బులతో బాక్సింగ్ శిక్షణ ఇచ్చిన సంసముద్దీన్

Nikhat Zareen First Coach: చిన్న రేకుల షెడ్డులో నిఖత్ జరీన్‌కు సొంత డబ్బులతో బాక్సింగ్ శిక్షణ ఇచ్చిన సంసముద్దీన్

Nizamabad రిజిస్ట్రేషన్ శాఖలో సస్పెండ్ అయిన ఉద్యోగుల వాంగ్మూలం తీసుకున్న అధికారులు

Nizamabad రిజిస్ట్రేషన్ శాఖలో సస్పెండ్ అయిన ఉద్యోగుల వాంగ్మూలం తీసుకున్న అధికారులు

టాప్ స్టోరీస్

Stock Market Weekly Review: హ్యాపీ.. హ్యాపీ! 2000 లాభపడ్డ సెన్సెక్స్‌ - ఇన్వెస్టర్లకు రూ.10 లక్షల కోట్ల లాభం

Stock Market Weekly Review: హ్యాపీ.. హ్యాపీ! 2000 లాభపడ్డ సెన్సెక్స్‌ - ఇన్వెస్టర్లకు రూ.10 లక్షల కోట్ల లాభం

Airtel Network Issue: ఎయిర్‌టెల్ వినియోగదారులకు నెట్‌వర్క్ సమస్యలు - మొబైల్ డేటా కూడా పనిచేయడం లేదట!

Airtel Network Issue: ఎయిర్‌టెల్ వినియోగదారులకు నెట్‌వర్క్ సమస్యలు - మొబైల్ డేటా కూడా పనిచేయడం లేదట!

Hyundai Venue: హ్యుండాయ్ వెన్యూ కొత్త రికార్డు - ఎన్ని కార్లు అమ్ముడుపోయాయంటే?

Hyundai Venue: హ్యుండాయ్ వెన్యూ కొత్త రికార్డు - ఎన్ని కార్లు అమ్ముడుపోయాయంటే?

IPL 2022, Jos Buttler: సెంచరీ ముందు జోస్‌ బట్లర్‌ ఫెయిల్యూర్‌! కాపాడిన సంగక్కర, సన్నిహితులు!

IPL 2022, Jos Buttler: సెంచరీ ముందు జోస్‌ బట్లర్‌ ఫెయిల్యూర్‌! కాపాడిన సంగక్కర, సన్నిహితులు!