News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

ఇందిరా, రాజీవ్ దేశం కోసం ప్రాణార్పణ! కానీ రాహుల్ గాంధీపై కేంద్రం ఇంత కక్ష సాధింపా?: సుదర్శన్ రెడ్డి

నీరవ్ మోడీ, లలిత్ మోడీ భారతదేశ సంపదను దోచుకుని విదేశాలకు వెళితే దానిని ప్రశ్నించినందుకు రాహుల్ గాంధీపై కేసు పెట్టడం సరైన చర్య కాదన్నారు మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి. 

FOLLOW US: 
Share:

దేశానికి స్వాతంత్య్రం తీసుకురావడంలో, దేశాన్ని అభివృద్ధి చేయడంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కుటుంబం పాత్ర ఎంతో ఉందని, దేశం కోసం ఆయన కుటుంబంలో నానమ్మ ఇందిరా గాంధీ, తండ్రి రాజీవ్ గాంధీ ప్రాణాలు అర్పించారని మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి అన్నారు. కానీ నీరవ్ మోడీ, లలిత్ మోడీ భారతదేశ సంపదను దోచుకుని విదేశాలకు వెళితే దానిని ప్రశ్నించినందుకు రాహుల్ గాంధీపై కేసు పెట్టడం సరైన చర్య కాదన్నారు. 

నిజామాబాద్ లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ నాయకులు రాహుల్ గాంధీని పప్పు అని, సోనియా గాంధీని దేశ వాసి కాదని మాట్లాడితే తప్పులేదు.. కానీ దేశాన్ని దోచుకున్న వారి గురించి రాహుల్ గాంధీ మాట్లాడితే అక్రమంగా కేసులు పెడతారా అని ప్రశ్నించారు సుదర్శన్ రెడ్డి. కుబేరుడు అదానీకి రూ.12 లక్షల కోట్ల ప్రజాదనాన్ని నరేంద్ర మోడీ కట్టబెట్టారని, ప్రధానికి, అదానీకి ఉన్న సంబంధం గురించి రాహుల్ గాంధీ ప్రశ్నిస్తే దానికి సమాధానం ఇవ్వలేదని, చివరగా పార్లమెంటులో రాహుల్ గాంధీపై అనర్హత వేయడం చాలా బాధాకరం అన్నారు. ఈ చర్యను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. 

ఎన్నికల సమయంలో జీరో అకౌంట్ ఉన్న ప్రతి ఖాతాలో రూ.15 లక్షలు ఇస్తామని సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి గెలిచారని ఇలాంటి తప్పుడు హామీలపై ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తే కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారని, రాహుల్ గాంధీ బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా దేశాన్ని విభజించే ప్రయత్నం చేస్తే దానిని ఆపడానికి రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు భారత్ జోడో పాదయాత్ర చేశారని గుర్తుచేశారు. రాహుల్ చేసిన భారత్ జోడో పాదయాత్రతో ఆయనకు, కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ప్రజల మద్దతును, స్పందనను చూసి ఓర్వలేక ఇలాంటి చర్యలకు బీజేపీ పూనుకుందని విమర్శించారు సుదర్శన్ రెడ్డి. దేశాన్ని దోచుకున్న వారిని దొంగలు అంటే కేసులు పెట్టడం సరైనది కాదన్నారు. 

రాహుల్ గాంధీపై ఎంపీగా అనర్హత వేటు వేయడం అంటే బీజేపీ ప్రభుత్వం  పార్లమెంట్ సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే అని, రాహుల్ గాంధీపై మోడీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, బీజేపీకి వ్యతిరేకంగా ధైర్యంగా నిలబడి పోరాడుతున్నారని, అదానీ కంపెనీల వ్యవహారాలపై జేపీసీ వేయాలని పార్లమెంట్ వేదికగా రాహుల్ గాంధీ పోరాటం చేయడం ప్రధాని మోడీకి కంటి మీద కునుకులేకుండా చేసిందని, అదానీ వ్యవహారాన్ని పార్లమెంటులో ఎండగడుతున్నందుకే బీజేపీ  తమ నేతపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, అదానీ వ్యవహారం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే.. రాహుల్​ గాంధీని బీజేపీ టార్గెట్​ చేసిందని, ఆయనపై లోక్‌సభ సెక్రెటరీ అనర్హత వేటు వేయడం దుర్మార్గమని అన్నారు సుదర్శన్ రెడ్డి. కోర్టు కూడా 30 రోజులు అప్పీల్‌కు టైం ఇచ్చింది.. అయినా హడావుడిగా రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడం రాజకీయ కక్ష సాధింపులో భాగమే అని అన్నారు. ఈ కుట్రను తిప్పి కొట్టేందుకు కాంగ్రెస్ నేతలు న్యాయపోరాటం చేస్తారని సుదర్శన్ రెడ్డి వెల్లడించారు.

Published at : 25 Mar 2023 05:31 PM (IST) Tags: CONGRESS PM Modi Rahul Gandi Telangana Sudarshan Reddy

ఇవి కూడా చూడండి

GDS Results: ఏపీ, తెలంగాణ జీడీఎస్ ఫలితాలు విడుదల- సర్టిఫికేట్ వెరిఫికేషన్ గడువు ఇదే!

GDS Results: ఏపీ, తెలంగాణ జీడీఎస్ ఫలితాలు విడుదల- సర్టిఫికేట్ వెరిఫికేషన్ గడువు ఇదే!

Voter Sahaya Mithra: తెలంగాణ ఓటర్ల కోసం చాట్ బాట్, అందుబాటులోకి తెచ్చిన ఎన్నికల సంఘం

Voter Sahaya Mithra: తెలంగాణ ఓటర్ల కోసం చాట్ బాట్, అందుబాటులోకి తెచ్చిన ఎన్నికల సంఘం

Telangana Elections: 34 అసెంబ్లీ సీట్లు ఇవ్వాల్సిందే, కాంగ్రెస్‌ బీసీ నేతల నుంచి పెరుగుతున్న డిమాండ్

Telangana Elections: 34 అసెంబ్లీ సీట్లు ఇవ్వాల్సిందే, కాంగ్రెస్‌ బీసీ నేతల నుంచి పెరుగుతున్న డిమాండ్

Kishan Reddy on Modi Telangana Tour: ప్రధాని మోదీ తెలంగాణకు వస్తే కేసీఆర్ కు జ్వరం వస్తుంది - కిషన్​రెడ్డి ఎద్దేవా

Kishan Reddy on Modi Telangana Tour: ప్రధాని మోదీ తెలంగాణకు వస్తే కేసీఆర్ కు జ్వరం వస్తుంది - కిషన్​రెడ్డి ఎద్దేవా

Indrakaran Reddy: రూ.75 కోట్లతో నిర్మించనున్న అంతర్రాష్ట్ర వంతెనకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి భూమి పూజ

Indrakaran Reddy: రూ.75 కోట్లతో నిర్మించనున్న అంతర్రాష్ట్ర వంతెనకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి భూమి పూజ

టాప్ స్టోరీస్

Bigg Boss Telugu 7: కోపం కాదు ఆకలి, ప్రిన్స్ యావర్ ఎమోషనల్ - నువ్వు ట్రోపీ కొట్టాలంటూ హగ్ ఇచ్చిన శోభాశెట్టి

Bigg Boss Telugu 7: కోపం కాదు ఆకలి, ప్రిన్స్ యావర్ ఎమోషనల్ - నువ్వు ట్రోపీ కొట్టాలంటూ హగ్ ఇచ్చిన శోభాశెట్టి

IND Vs ENG: ప్రపంచకప్ ప్రస్థానం ప్రారంభించనున్న రోహిత్ సేన - ఇంగ్లండ్‌తో వార్మప్ మ్యాచ్‌కు రెడీ!

IND Vs ENG: ప్రపంచకప్ ప్రస్థానం ప్రారంభించనున్న రోహిత్ సేన - ఇంగ్లండ్‌తో వార్మప్ మ్యాచ్‌కు రెడీ!

Upcoming Mobiles: స్మార్ట్ ఫోన్ల సీజన్ వచ్చేసింది - అక్టోబర్‌లో ఏయే ఫోన్లు రానున్నాయంటే?

Upcoming Mobiles: స్మార్ట్ ఫోన్ల సీజన్ వచ్చేసింది - అక్టోబర్‌లో ఏయే ఫోన్లు రానున్నాయంటే?

Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?

Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?