అన్వేషించండి
Advertisement
Nizamabad News: 5జీ సర్వీస్ పేరుతో సైబర్ మోసాలు- జాగ్రత్తగా ఉండాలంటున్న పోలీసులు
పెరిగిపోతున్న ఆన్‌లైన్ మోసాలు. రెచ్చిపోతున్న సైబర్ కేటుగాళ్లు. నిత్యం ఏదో ఓ చోట మోసానికి గురవుతున్న అమాయకులు.
ఆన్ లైన్ మోసాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయ్. అమాయకులను ఆసరా చేసుకున్న డబ్బులు లూటీ చేస్తున్నారు కొందరు కేటుగాళ్లు. పెరుగుతు టెక్నాలజీకి అనుగుణంగా మోసాలు కూడా పెరిగిపోతున్నాయ్. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలను సైతం టార్గెట్ చేస్తూ... ఆన్ లైన్ మోసాలకు గురి చేస్తున్నారు. ఈజీగా ముగ్గులోకి దింపి ఖాతాల్లోంచి డబ్బులు ఖాళీ చేస్తున్నారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇటీవల సైబర్ నేరాలు పెరిగిపోతూనే ఉన్నాయ్. కొందరు అవమాన భారంతో బయటపడలేకపోతున్నా... మరికొందరు పోలీసులను ఆశ్రయించి తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. సైబర్ మోసాలు రోజు రోజుకీ నయా రూట్లలో పెరిగిపోతున్నాయ్. ప్రస్తుతం 5జీ సర్వీసుల పేరుతో సైబర్ మోసాలు జరుగుతున్నాయ్. 5జీ సర్వీస్‌లు అందుబాటులోకి వచ్చిన వేళ ఇదే అదునుగా భావించే సైబర్ నేరగాళ్లు కొత్త స్కామ్‌లకు తెరలేపి అందినంతా దోచేస్తారు. వీటిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైం పోలీసులు హెచ్చరిస్తున్నారు.
5జీ సేవల పేరుతో మోసాలు
ప్రస్తుతం 5జీ సేవల వినియోగం కోసం కస్టమర్లు ఉత్సాహంగా ఉన్నారు. ఈ క్రమంలో ‘4జీ నుంచి 5జీ మారండి. మీకు కావాల్సిన సేవలు మేం అందిస్తాం’ అంటూ.. కొంతమంది సైబర్ కేటుగాళ్లు మెసేజ్‌లు, లింక్‌లు పంపిస్తున్నారు. అదంతా నిజమని నమ్మిన కస్టమర్లు ఆ లింక్‌లను క్లిక్ చేస్తే ఫోన్‌లోని డేటా అంతా సైబర్ నేరగాళ్ల చేతికి వెళ్లిపోతుంది. దాంతో బ్యాంకు ఖాతాలకు లింక్ అయి ఉన్న ఫోన్‌నంబర్ తెలుసుకుంటారన్నారు. ఆ నంబర్‌ను బ్లాక్ చేయించి, సిమ్ స్వాప్ దందాకు పాల్పడి, అదే నంబర్‌తో మరోసిమ్ తీసుకుని బ్యాంకు ఖాతాలకు లింక్ చేసి డబ్బంతా కొల్లగొడతారు. లేదా 5జీ సర్వీస్‌లు అందిస్తున్నామంటూ వివిధ రకాల ఛార్జీల పేరుతో అందినంతా దండుకొని ఉడాయిస్తారు. ఇటువంటి పలు రకాల సైబర్ మోసాలపై కస్టమర్లు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
మరోవైపు డెబిట్ కార్డు పిన్ పని చేయని సమయంలో బ్యాంక్ వారికి సమాచారం కోసం నిజామాబాద్ నగరంలోని ఓ వ్యక్తి సదరు బ్యాంక్ కు కాల్ చేయగా... గూగుల్ లో కాల్ నెంబర్ ఉంటుందని దానికి కాల్ చేస్తే వారు సమస్య పరిష్కారిస్తారని చెప్పారు. ఆ వ్యక్తి గూగుల్ లోకి వెళ్లి కాల్ సెంటర్ అని టైప్ చేస్తే ఓ నెంబర్ కనిపించింది.
సదరు వ్యక్తి ఆ నెంబర్ కు కాల్ చేసి తన డెబిట్ కార్డు యూపీఐ పిన్ పనిచేయటం లేదని చెప్పటంతో కాల్ సెంబటర్ వ్యక్తి అతని కార్డు వివరాలు, బ్యాంక్ వివరాలు సేకరించారు. అకౌంట్ లో 50 వేల రూపాయలున్నాయ్. సదరు వ్యక్తి పిన్ జనరేట్ చేస్తామని చెప్పి వివరాలు సేకరించాక... కోడ్ వస్తుంది ఆ కోడ్ మనీ ట్రాన్ఫర్ చేసే దాంట్లో ఏంట్రీ చేయన్నారు. అలా ఖాతాలో ఉన్న బ్యాలెన్స్ చూసి మూడు సార్లు పిన్ ఎంటర్ చేయాలంటూ... అమౌంట్ చెప్పి అతని ఖాతాలోంచి రూ.50 వేలు కాజేశారు. ఇలా సైబర్ మోసాలు అనేకం పెరిగిపోయాయ్. తెలియని వ్యక్తులు ఫోన్ చేసి ఖాతా వివరాలు అడిగితే అస్సలు చెప్పవద్దని పోలీసులు చెబుతున్నారు. అన్ లైన్ మోసాలకు బలికాకుండా ఉండాలంటే జాగ్రత్తలు పాటించటమే మేలంటున్నారు పోలీసులు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
పాలిటిక్స్
పాలిటిక్స్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion