News
News
వీడియోలు ఆటలు
X

Kamareddy News: లాయర్‌నే బురిడీ కొట్టించిన సైబర్ కేటుగాళ్లు, పేదలనూ వదలకుండా మరో మోసం

కామారెడ్డిలో రూ.33,500 మోసపోయిన లాయర్త

క్కువ వడ్డీకే రుణాలిస్తామంటూ మరో మోసం

లబోదిబోమంటున్న బాధితులు

FOLLOW US: 
Share:
ఈజీ మనీకి అలవాటు పడిన కేటుగాళ్లు.. టెక్నాలజీని వాడుకుని ఎంతటివారినైనా ఇట్టే మోసం చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో ఓ న్యాయవాదిని సైబర్ నేరగాళ్లు బురిడి కొట్టించారు. క్రెడిట్ కార్డు యాక్టివేషన్ పేరుతో రూ.33,500 అకౌంట్ నుంచి కాజేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో నివాసం ఉండే వెంకటరత్నం అనే న్యాయవాదికి SBI బ్యాంకు నుంచి మాట్లాడుతున్నామంటూ.... క్రెడిట్ కార్డ్ యాక్టివేషన్ చేయాలని సైబర్ నేరగాళ్ళ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. లాయర్ వెంకటరత్నం మొబైల్ నెంబర్ కు ఓటీపీ పంపారు సైబర్ కేటుగాళ్లు. ఇది గుడ్డిగా నమ్మిన లాయర్ తిరిగి ఓటీపీని అవతలి వ్యక్తికి పంపారు బాధితుడు వెంకటరత్నం. దీంతో వెంకటరత్నం బ్యాంక్ అకౌంట్ నుంచి 33,500 వేలు డెబిట్ అయినట్లుగా మొబైల్ కు మెసేజ్ వచ్చింది. దీంతో మోసపోయానని గ్రహించిన వెంకటరత్నం.. స్థానిక కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు కామారెడ్డి పట్టణ పోలీసులు.
 
తక్కువ వడ్డీకే రుణాల పేరిట మరో మోసం
 
కామారెడ్డి జిల్లాలో అమాయక, గ్రామీణ, నిరక్షరాస్యులైన ప్రజలకు తక్కువ వడ్డీకి మూడు నుంచి ఐదు లక్షల రూపాయల వరకు లోన్లు ఇప్పిస్తామంటూ.. దంపతులు బురిడీ కొట్టించారు. బాధితుల కథనం ప్రకారం కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి గ్రామానికి చెందిన శ్రీహరి, రాణి అనే దంపతులు GDFC నిధి లిమిటెడ్ (పేదల పాలిట పెన్నిధి) అనే సంస్థ నుంచి తక్కువ వడ్డీకి లోన్లు ఇప్పిస్తామంటూ గాంధారి, సదాశివనగర్, మాచారెడ్డి, బీబీపేట తదితర మండలాలకు చెందిన  సుమారు 250 మంది అమాయక ప్రజల నుంచి ఒక్కొక్కరి నుంచి రూ. 10 వేల నుంచి రూ.15 వేల వరకు జీఎస్టీ, టాక్సీ, వివిధ పన్నుల రూపంలో సుమారు రూ. 20 లక్షల వరకు వసూలు చేసి బోర్డు తిప్పేశారు.
 
దీంతో బాధితులు గత కొద్ది రోజుల నుంచి శ్రీహరి -రాణి కి ఫోన్లు చేశారు. ఫోన్ లో పొంతన లేని సమాధానం చెబుతూ.. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ సమాధానం చెప్పారు. గత రెండు రోజుల నుంచి ఫోన్ నెంబర్లు స్విచ్ ఆఫ్ కావడంతో అనుమానం వచ్చిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. బాధితులు శ్రీహరి స్వగ్రామమైన చిన్నమల్లారెడ్డి గ్రామంలో ఇంటి ముందు ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం బాధితులు మాట్లాడుతూ... తమకు అతి తక్కువ వడ్డీకి లోన్లు ఇప్పిస్తానంటూ దంపతులు నమ్మబలకడంతో వారి మాటలు నమ్మి ఒక్కొక్కరు రూ. 10 నుంచి రూ. 15 వేల వరకు తమ వద్ద నుంచి వివిధ ట్యాక్సీ రూపంలో వసూలు చేసుకుని సుమారు రూ. 20 లక్షల వరకు వసూలు చేసి తమను మోసం చేశారంటూ వాపోతున్నారు బాధితులు.
 
పోలీసులను ఆశ్రయించి తమ డబ్బులు తమకు ఇప్పించాలని వేడుకుంటున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శ్రీహరి, వాణిల కోసం వెతుకుతున్నారు.  అయితే సైబర్ మోసానికి గురైన వెంటనే సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని పోలీసులు చెబుతున్నారు. 
Published at : 26 May 2023 09:19 PM (IST) Tags: Kamareddy Kamareddy News Kamareddy News Update Kamareddy Latest News

సంబంధిత కథనాలు

TSLPRB: ఎస్‌ఐ, కానిస్టేబుల్ నియామకాలు, ఒక్కో పోస్టుకు ఆరుగురు పోటీ!

TSLPRB: ఎస్‌ఐ, కానిస్టేబుల్ నియామకాలు, ఒక్కో పోస్టుకు ఆరుగురు పోటీ!

Telangana సీఎం కేసీఆర్ కి నిర్మల్ మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి బహిరంగ లేఖ- ప్రస్తావించిన అంశాలివే

Telangana సీఎం కేసీఆర్ కి నిర్మల్ మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి బహిరంగ లేఖ- ప్రస్తావించిన అంశాలివే

Telangana Formation Day: రాదన్న తెలంగాణను సాధించిన ఘనుడు, పాలకుడిగా నిలిచిన కేసీఆర్- ట్విట్టర్‌లో ప్రశంసలు

Telangana Formation Day: రాదన్న తెలంగాణను సాధించిన ఘనుడు, పాలకుడిగా నిలిచిన కేసీఆర్- ట్విట్టర్‌లో ప్రశంసలు

Todays Top 10 headlines: తెలంగాణ దశాబ్ధి వేడుకలకు శ్రీకాారం- టీడీపీ మేనిఫెస్టోకు వైసీపీ ప్రచారం చేస్తుందా?

Todays Top 10 headlines: తెలంగాణ దశాబ్ధి వేడుకలకు శ్రీకాారం- టీడీపీ మేనిఫెస్టోకు వైసీపీ ప్రచారం చేస్తుందా?

TSPSC Group1: 'గ్రూప్-1' పరీక్షపై మళ్లీ హైకోర్టుకెక్కిన అభ్యర్థులు, దర్యాప్తు పూర్తయ్యేదాకా వద్దంటూ విజ్ఞప్తి!

TSPSC Group1: 'గ్రూప్-1' పరీక్షపై మళ్లీ హైకోర్టుకెక్కిన అభ్యర్థులు, దర్యాప్తు పూర్తయ్యేదాకా వద్దంటూ విజ్ఞప్తి!

టాప్ స్టోరీస్

YS Viveka Murder Case: వైఎస్‌ భాస్కర్‌రెడ్డి అభ్యర్థనకు సీబీఐ కోర్టు ఓకే, ప్రత్యేక కేటగిరీ ఖైదీగా ఎంపీ అవినాష్ తండ్రి

YS Viveka Murder Case: వైఎస్‌ భాస్కర్‌రెడ్డి అభ్యర్థనకు సీబీఐ కోర్టు ఓకే, ప్రత్యేక కేటగిరీ ఖైదీగా ఎంపీ అవినాష్ తండ్రి

Chandrababu : టీడీపీ ఉండి ఉంటే పోలవరం, అమరావతి పూర్తయ్యేవి - ఏపీ పునర్నిర్మాణం చేయాల్సి ఉందన్న చంద్రబాబు !

Chandrababu :  టీడీపీ ఉండి ఉంటే పోలవరం, అమరావతి పూర్తయ్యేవి - ఏపీ పునర్నిర్మాణం చేయాల్సి ఉందన్న చంద్రబాబు !

Sharwanand Marriage: శర్వానంద్ పెళ్లి వేడుకలు షురూ - వైరలవుతోన్న వీడియో

Sharwanand Marriage: శర్వానంద్ పెళ్లి వేడుకలు షురూ - వైరలవుతోన్న వీడియో

Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు

Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు