Nizamabad News: మంచిప్ప రిజర్వాయర్ రీ డిజైనింగ్‌పై రగడ- ఉద్యమానికి సిద్ధమవుతున్న నిర్వాసితులు

మంచిప్ప రిజర్వాయర్ రీడిజైన్ పై రగడ.1.5 టీఎంసీల రిజర్వాయర్ ను 3.5 టీఎంసీలకు పెంచటంపై ఆందోళన. సేవ్ మంచిప్ప పేరుతో మంచిప్ప గ్రామస్తుల ఆందోళన. రీడిజైన్ వెనక్కి తీసుకోవాలంటూ ఉద్యమాలు చేస్తున్నారు.

FOLLOW US: 

కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద చేపడుతున్న రిజర్వాయర్ నిర్మాణంపై రగడ మొదలైంది. 21 ప్యాకేజీ కింద మంచిప్స రిజర్వాయర్ 1.5 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించాలని ప్రభుత్వం తొలుత రూపకల్పన చేసింది. కానీ 3.5 టీఎంసీతో రీడిజైన్ చేయడం వివాదాస్పదంగా మారుతోంది. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం మంచిప్ప గ్రామం కొండెం చెరువుపై ఉమ్మడి ఆంధ్రప్రదేశే 2007లో ప్రాణహిత చేవెళ్ల కింద ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 20, 21, 22 ప్యాకేజీలను చేపట్టారు. సొరంగ మార్గం పనులను పూర్తి చేశారు. ఏస్సారెస్ఫేబ్యాక్ వాటర్‌పై ఆధారపడి నిర్మించిన ఈ ప్యాకేజీల ద్వారా ఉమ్మడి జిల్లా పరిధిలో సుమారు 2 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించేందుకు ప్లాన్ వేశారు. మొదట 1.5 టీఎంసీల కెపాసిటీతో మంచిప్ప రిజర్వాయర్ రూపకల్పన చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దీనిని కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద విలీనం చేశారు. కాల్వల ద్వారా కాకుండా 20, 21 ప్యాకేజీల సాగు నీరు అందించేలా పైప్ లైన్ ద్వారా సాగు నీరు నిర్మాణం చేపడుతున్నారు. ఇందులో భాగంగానే మంచిప్పకొండెం చెరువును 3.5 టీఎంసీల నీటిని నిల్వచేసే రిజర్వాయర్‌గా మారుస్తున్నారు. దీని ద్వారా బాల్కొండ ఆర్మూర్, నిజామాబాద్ రూరల్ నియోజక వర్గాలకు ఎస్కారెన్సీ నీటిని అందించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.

రీ డిజైన్ పై మంచి సహా 9 గ్రామాల అభ్యంతరం

మంచిప్ప రీ డిజైన్ ద్వారా 10 గ్రామాలు నీటమునగనున్నాయని నిర్వాసితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొదట 1.5 టీఎంసీల నిల్వ సామర్ధ్యం గల రిజర్వాయర్  నిర్మిస్తామని చెప్పి ప్రస్తుతం 3.5 టీఎంసీల నిల్వ పేరుతో రీడిజైన్ అంటూ అన్యాయం చేస్తున్నారని రిజర్వాయర్ వల్ల ముంపు గ్రామా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలోనే 150 ఎకరాల భూమిని కేవలం రూ. 4 లక్షల నష్టపరిహారానికే ఇచ్చేశామని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మంచిప్పలో ఎకరం. రూ.50 లక్షల నుంచి కోటి వరకు ధర పలుకుతోంది.

ప్రస్తుతం రిజర్వాయర్ 3.5 టీఎంసీలకు పెంచి రీడిజైన్ చేశారు. దీంతో అమ్రాబాద్, భూసేకరణ చేపట్టాల్సిన గ్రామాల్లో 1336 ఎకరాలు ఉంది. మరో 788 ఎకరాల అటవీ భూమి కోసం ఆ శాఖ క్లియరెన్స్ ఇచ్చింది. భూసేకరణకు వెళ్లిన అధికారులను రైతులు పలుమార్లు వెనక్కి పంపారు. 1.5 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో లక్షా 83 వేల ఎకరాలకు సాగు నీరందనుంది. అయితే రీ డిజైన్ ద్వారా 3.5 టీెఎంసీల నీటి నిల్వతో పెద్దగా ఒరిగే ప్రయోజనం లేదంటున్నారు ముంపు గ్రామస్థులు. కేవలం రీ డిజైనింగ్ ద్వారా 1000 ఎకరాలకు మాత్రమే అదనంగా సాగు నీరందనుందని చెబుతున్నారు ముంపు గ్రామస్తులు. ఇది కేవలం కాంట్రాక్టర్లు, ప్రజా ప్రతినిధుల కమీషన్ల కోసమే రీ డిజైనింగ్ తెరమీదకు తెచ్చారని వాపోతున్నారు. ఈ రీడిజైనింగ్ ద్వారా 10 గ్రామాలు నీట మునగనున్నాయ్. గాంధారీ, కామారెడ్డి హైవే వెళ్లే రహదారులు మూసుకుపోతాయ్. అటవీ సంపదన నష్టపోతుంది. గిరిజనులు అటవీపై ఆధారపడి జీవిస్తున్నారు. వారు ఉపాధి అవకాశాలు కోల్పోతారు. దాదాపు 10,000 మందీ రోడ్డున పడతారని ముంపు గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముంపు గ్రామాల ప్రజలు ఇప్పటికే మల్లన్న సాగర్ వరకు పాదయాత్రగా వెళ్లి అక్కడ నిర్వాసితులకు కల్పించిన వసతులను చూసి మరింత ఆందోళనకు గురవుతున్నారు. వారికి చిన్న చిన్న ఇళ్లు ఇచ్చారని మల్లన్న సాగర్ ముంపు గ్రామాల నిర్వాసితులు ఇప్పటికీ కష్టాలు ఎదుర్కోంటున్నారని మంచిప్ప రిజర్వాయర్ ముంపు గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

డీవీఆర్ ప్రజల ముందు పెట్టాలి

1.5 రిజర్వాయర్ డీపీఆర్ ఇంకా రాలేదని 3.5 రీ డిజైన్ డీపీఆర్ సైతం చూపెట్టలేదని ముంపు గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగుతున్నారు. రిజర్వాయర్ డీపీఆర్‌ను ప్రజల ముందు పెట్టాలి. లేదంటే నిర్మాణ పనులను అడ్డుకుంటామని ముంపు గ్రామాల ప్రజలు హెచ్చరిస్తున్నారు. ముంపు గ్రామాల్లో అమ్రాబాద్, బైరాపూర్, మంచిప్ప గ్రామాలతోపాటు మరో 7 గిరిజన తండాలు కనుమరుగుకానున్నాయి. ఏ మేరకు భూములు కోల్పోతారో రైతులకు చెప్పకుండా అధికారులు. పనులు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ముంపు బాధితులు కమిటీగా ఏర్పడి. సేవ్ మంచిప్ప పేరుతో దశల వారీ ఉద్యమాలకు సిద్దమవుతున్నారు. మంచిప్ప రిజర్వాయర్ వల్ల ముంపు గ్రామాల యువకులకు పిల్లలను ఇచ్చేందుకు కూడా ఎవరూ ముందుకు రావటం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు మంచిప్పలో ఈ రిజర్వాయర్ నిర్మాణం చేపట్టడమే కరెక్ట్ కాదంటున్నారు. ఎందుకంటే మంచిప్ప గ్రామంలో భూగర్భ జలాలు పుష్కలంగా ఉన్నాయని. రెండు పంటలు పండుతాయి. అలాంటిది ఇక్కడ రిజర్వాయర్ నిర్మాణం అవసరం లేకున్నా ఎందుకు నిర్మిస్తున్నారని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. కనీసం ఈ ప్రాంతంలో డబుల్ బెడ్ రూంల నిర్మాణం కూడా చేపట్టలేదు. రీ డిజైన్ పేరుతో మమ్మల్ని ఎక్కడికి పంపుతారని ముంపు గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రీ డిజైన్ పేరుతో కొందరి లాభం కోసం 10 వేల మందిని రోడ్డున పడేయాలని చూస్తున్నారని ముంపు గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం రీ డిజైన్ ను వెనక్కి తీసుకునేంత వరకూ సేవ్ మంచిప్ప పేరుతో ముంపు గ్రామాల ప్రజలు ఆందోళనలు కొనసాగిస్తామని చెబుతున్నారు.

Published at : 24 Mar 2022 12:48 PM (IST) Tags: nizamabad Nizamabad news Nizamabad Latest News Nizamabad Updates Manchippa Reservoir

సంబంధిత కథనాలు

Honor Killing In Adilabad: ఆదిలాబాద్‌ జిల్లాలో దారుణం- మతాంతర వివాహం చేసుకుందని కుమార్తె గొంతు కోసి హత్య చేసిన తండ్రి

Honor Killing In Adilabad: ఆదిలాబాద్‌ జిల్లాలో దారుణం- మతాంతర వివాహం చేసుకుందని కుమార్తె గొంతు కోసి హత్య చేసిన తండ్రి

Nizamabad News: మంచిప్ప రిజర్వాయర్ రీ డిజైన్‌పై కొనసాగుతున్న రగడ

Nizamabad News: మంచిప్ప రిజర్వాయర్ రీ డిజైన్‌పై కొనసాగుతున్న రగడ

Nikhat Zareen First Coach: చిన్న రేకుల షెడ్డులో నిఖత్ జరీన్‌కు సొంత డబ్బులతో బాక్సింగ్ శిక్షణ ఇచ్చిన సంసముద్దీన్

Nikhat Zareen First Coach: చిన్న రేకుల షెడ్డులో నిఖత్ జరీన్‌కు సొంత డబ్బులతో బాక్సింగ్ శిక్షణ ఇచ్చిన సంసముద్దీన్

Nizamabad రిజిస్ట్రేషన్ శాఖలో సస్పెండ్ అయిన ఉద్యోగుల వాంగ్మూలం తీసుకున్న అధికారులు

Nizamabad రిజిస్ట్రేషన్ శాఖలో సస్పెండ్ అయిన ఉద్యోగుల వాంగ్మూలం తీసుకున్న అధికారులు

Petrol Diesel Price 21th May 2022 : తెలుగు రాష్ట్రాలో స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు, ఇవాళ్టి రేట్స్ ఇలా

Petrol Diesel Price 21th May 2022 : తెలుగు రాష్ట్రాలో స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు, ఇవాళ్టి రేట్స్ ఇలా

టాప్ స్టోరీస్

Bandi Sanjay : కేంద్రాన్ని బదనాం చేస్తున్న కేసీఆర్ సర్కార్ ను కడిగేయండి, పార్టీ నేతలకు బండి సంజయ్ దిశానిర్దేశం

Bandi Sanjay : కేంద్రాన్ని బదనాం చేస్తున్న కేసీఆర్ సర్కార్ ను కడిగేయండి, పార్టీ నేతలకు బండి సంజయ్ దిశానిర్దేశం

Writer Review - 'రైటర్' రివ్యూ: హెడ్ కానిస్టేబుల్ కేసులో ఇరుక్కుంటే? - ఆహాలో విడుదలైన సముద్రఖని సినిమా ఎలా ఉందంటే?

Writer Review - 'రైటర్' రివ్యూ: హెడ్ కానిస్టేబుల్ కేసులో ఇరుక్కుంటే? - ఆహాలో విడుదలైన సముద్రఖని సినిమా ఎలా ఉందంటే?

TS Police Jobs : తెలంగాణ పోలీస్ ఉద్యోగాలకు భారీ స్పందన, 17 వేల పోస్టులకు 12.91 లక్షల అప్లికేషన్లు

TS Police Jobs : తెలంగాణ పోలీస్ ఉద్యోగాలకు భారీ స్పందన, 17 వేల పోస్టులకు 12.91 లక్షల అప్లికేషన్లు

Nothing Phone 1: మోస్ట్ అవైటెడ్ స్మార్ట్ ఫోన్ ధర లీక్ - లాంచ్ డేట్ కూడా!

Nothing Phone 1: మోస్ట్ అవైటెడ్ స్మార్ట్ ఫోన్ ధర లీక్ - లాంచ్ డేట్ కూడా!