News
News
వీడియోలు ఆటలు
X

నెల గడువిస్తే 24 గంటల్లో రాహుల్ గాంధీపై అనర్హత వేటు అన్యాయమే: కేంద్ర మాజీ మంత్రి

కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ పై అనర్హత వేటు వేయడంపై కేంద్ర ప్రభుత్వం తీరుపై కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ విమర్శలు చేశారు.

FOLLOW US: 
Share:

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడం సరికాదని మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఏఐసీసీ సభ్యుడు మాజీ ఎమ్మెల్సి కొక్కిరాల ప్రేంసాగర్ రావ్ నివాసంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ పై అనర్హత వేటు వేయడంపై కేంద్ర ప్రభుత్వం తీరుపై కేంద్ర మాజీ మంత్రి విమర్శలు చేశారు. సూరత్ న్యాయస్థానం ఇచ్చిన తీర్పుకు 30 రోజుల గడువు ఉన్నప్పటికీ 24 గంటలలో ఆయనపై బీజేపీ ప్రభుత్వం కావాల్సుకొని వేటు వేయడం సరికాదని బలరాం నాయక్ విమర్శించారు. 

రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలని నాయకులు, కాంగ్రెస్ శ్రేణులు కోరినప్పటికీ, సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ ను ప్రధానిగా చేశారని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించకుండా ఎంతో మంది అడ్డుపడ్డ తెలంగాణ కాంగ్రెస్ నేతలతో సమాలోచనలు చేసి తెలంగాణ ఏర్పాటుకు ఆమోదం తెలిపిందని కేంద్రమంత్రి గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలనలో సమాచార హక్కు చట్టం పోడు భూములు రుణాల మాఫీ, జాతీయ రహదారులు ఆసుపత్రులు ఏకలవ్య నవోదయ పాఠశాలలు వంటి అభివృద్ధి పనులు చేసి దేశం కోసమే పాటుపడ్డ కుటుంబమని అన్నారు. అలాంటి కుటుంబానికి బీజేపీ ప్రభుత్వం రాజకీయ స్వార్థాల కోసం రాహుల్ గాంధీ పై వేటు వేయడం సరికాదన్నారు. సోనియా గాంధీ మహిళల కోసం 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరితే లాలూ ప్రసాద్ యాదవ్ ఆమె వ్యాఖ్యలపై ఎద్దేవా చేశారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికలలో ప్రజల మద్దతుతో అధికారంలోకి వస్తుందన్నారు.

ముమ్మాటికీ కక్ష సాధింపు చర్యనే: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి 
దేశ స్వాతంత్రం కోసం ఎందరో మహానుభావులు ప్రాణ త్యాగాలు చేస్తే.... స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశ సమగ్రతను కాపాడడానికి ఈ దేశాన్ని అభివృద్ధి చేయడానికి ప్రాణాలు అర్పించిన కుటుంబం రాహుల్ గాంధీ కుటుంబమని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ డీసీసీ ఆఫీస్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోదీ నాయకత్వంలో మత విద్వేషాలు రెచ్చగొడుతూ నియంతృత్వ ధోరణితో పాలన కొనసాగిస్తున్నారని అన్నారు. దేశాన్ని విచ్ఛిన్నం కాకుండా ఏకం చేయడానికి ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర చేశారని దానికి ప్రజల నుంచి వచ్చిన స్పందనను జీర్ణించుకోలేక నరేంద్ర మోదీ.... రాహుల్ గాంధీ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నాడు. నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తొమ్మిదేళ్లలో నిరుపేద కుటుంబాలు బాగుపడడానికి కావలసిన ఒక్క పని కూడా చేయలేదు. విదేశాలలో ఉన్న నల్లధనాన్ని దేశానికి తీసుకురావడంలో విఫలం అవ్వడమే కాకుండా బడా వ్యాపారవేత్తలైన అదానీ, అంబానీలకు, లలిత్ మోదీ, నీరవ్ మోదీలకు అండగా నిలిచే విధంగా బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని అన్నారు జీవన్ రెడ్డి. మోదీ అధికారంలోకి రాకముందు రూ.50 వేల కోట్ల పెట్టుబడులతో ఉన్న అదానీ ఇప్పుడు రూ.10 లక్షల కోట్లకు పెరగడానికి మోదీయే కారణమన్నారు. 

Published at : 31 Mar 2023 10:43 PM (IST) Tags: CONGRESS PM Modi Rahul Gandhi Balaram Naik

సంబంధిత కథనాలు

TSPSC Group 1 Exam: 'గ్రూప్‌-1' ప్రిలిమ్స్‌ హాల్‌‌టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే! పరీక్ష వివరాలు ఇలా!

TSPSC Group 1 Exam: 'గ్రూప్‌-1' ప్రిలిమ్స్‌ హాల్‌‌టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే! పరీక్ష వివరాలు ఇలా!

Nizamabad News: న్యూజెర్సీలో నిజామాబాద్ యువకుడు సజీవదహనం, రోడ్డు ప్రమాదమే కారణం!

Nizamabad News: న్యూజెర్సీలో నిజామాబాద్ యువకుడు సజీవదహనం, రోడ్డు ప్రమాదమే కారణం!

KCR Nirmal Tour: నేడు నిర్మల్ జిల్లాలో సీఎం కేసీఆర్ టూర్, బహిరంగ సభ కూడా

KCR Nirmal Tour: నేడు నిర్మల్ జిల్లాలో సీఎం కేసీఆర్ టూర్, బహిరంగ సభ కూడా

TSPSC Group 1 Exam: జూన్ 4న 'గ్రూప్‌-1' ప్రిలిమ్స్‌ హాల్‌‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

TSPSC Group 1 Exam: జూన్ 4న 'గ్రూప్‌-1' ప్రిలిమ్స్‌ హాల్‌‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

Dr.BRAOU BEd Exam: అంబేడ్కర్‌ సార్వత్రిక బీఈడీ ప్రవేశపరీక్ష హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

Dr.BRAOU BEd Exam: అంబేడ్కర్‌ సార్వత్రిక బీఈడీ ప్రవేశపరీక్ష హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

టాప్ స్టోరీస్

Gudivada Amarnath: రైలు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి గుడివాడ, మానవ తప్పిదమేనని వెల్లడి

Gudivada Amarnath: రైలు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి గుడివాడ, మానవ తప్పిదమేనని వెల్లడి

TDP Leaders on YCP Govt: ఆనం వెంకట రమణారెడ్డిపై దాడి అనాగరికం, అప్రజాస్వామికం: టీడీపీ నేతలు

TDP Leaders on YCP Govt: ఆనం వెంకట రమణారెడ్డిపై దాడి అనాగరికం, అప్రజాస్వామికం: టీడీపీ నేతలు

Sharwanand Wedding Photos : రాయల్‌గా శర్వా - రక్షిత వెడ్డింగ్, కొత్త జంట ఫోటోలు చూశారా?

Sharwanand Wedding Photos : రాయల్‌గా శర్వా - రక్షిత వెడ్డింగ్, కొత్త జంట ఫోటోలు చూశారా?

Odisha Train Accident: రైల్వే నెట్‌వర్క్‌లో కొన్ని లూప్‌హోల్స్‌ ఉన్నాయ్, అసలు సమస్య అదే - నిపుణులు

Odisha Train Accident: రైల్వే నెట్‌వర్క్‌లో కొన్ని లూప్‌హోల్స్‌ ఉన్నాయ్, అసలు సమస్య అదే - నిపుణులు