అన్వేషించండి

Nizamabad News: ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్‌లో గందరగోళం- మరి జోడో యాత్ర సక్సెస్ అయ్యేనా?

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రాహుల్ భారత్ జోడో యాత్రపై దృష్టి పెట్టాల్సిన నేతలు... కుమ్ములాటల్లో మునిగిపోయారు. యాత్ర దగ్గర పడుతున్న కొద్ది శ్రేణుల్లో టెన్షన్ పెరిగిపోతోంది.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఈనెల 25 తర్వాత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర జరగనుంది. మూడు రోజుల పాటు 64కిలో మీటర్లమేర రాహుల్ గాంధీ పాదయాత్రకు షెడ్యూల్ ఖరారైంది. కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ మండలంలోని నర్సింగరావు పల్లి చౌరస్తా నుంచి రాహుల్ జోడో యాత్ర జిల్లాలోకి ఎంటర్ కానుంది. 

కామారెడ్డి జిల్లా కాంగ్రెస్‌లో నేతల వర్గపోరు తీవ్రస్థాయిలో ఉంది. ఉమ్మడి జిల్లా సీనియర్ నేత మాజీ మంత్రి షబ్బీర్ అలీ, గత ఎన్నికల్లో జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన మదన్ మోహన్ రావు మధ్య గత కొంతకాలంగా పొసగటం లేదు. షబ్బీర్ అలీ కొడుకు ఇలియాస్ అలీ జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్‌గా పోటీ చేసిన సమయంలో మదన్ మోహన్ రావు షబ్బీర్ అలీ కొడుకు కాకుండా ప్రస్తుతం కామారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్‌కు సపోర్ట్ చేశారు. అప్పటి నుంచి షబ్బీర్ అలీ, మదన్ మోహన్ రావుకు పోసగటం లేదన్న ప్రచారం జరుగుతోంది. షబ్బీర్ అలీ

గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసిన మదన్ మోహన్ రావు కేవలం 5 వేల ఓట్లతో టీఅరె్స్ అభ్యర్థి బీబీ పాటిల్ మీద ఓడిపోవటం జరిగింది. అయితే అప్పటి నుంచి మదన్ మోహన్ రావు సీనియర్లను కాదని తన సొంత ఎజెండాతో పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని టాక్ నడుస్తోంది. మదన్ మోహన్ రావు వ్యవహారం సీనియర్లకు మింగుడుపడటం లేదు.

ఇలియాన్ అలీ

ఎల్లారెడ్డి నియోజకవర్గంపై మదన్ మోహన్ రావు దృష్టిసారించారు. వచ్చే ఎన్నికల్లో ఎంపీగా కాకుండా ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి మదన్ మోహన్ రావు పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ వ్యవహారం షబ్బీర్ అలీకి ఏమాత్రం నచ్చటం లేదన్న వాదన వినిపిస్తోంది. షబ్బీర్ అలీ కొడుకు ఇలియాస్ అలీని ఎల్లారెడ్డి నుంచి వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా బరిలో దింపే ఆలోచనలో ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయ్.

ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సుభాష్ రెడ్డి, మదన్ మోహన్ రావు సైతం బరిలో దిగేందుకు ఇంట్రస్ట్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా వీరి మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. ఎల్లారెడ్డిలో పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సభలోనే కాంగ్రెస్ నేతల మధ్య ఆధిపత్య పోరు బహిరంగంగా నడిచింది.

ప్రధానంగా రాహుల్ భారత్ జోడో యాత్ర జుక్కల్ నియోజకవర్గంలోనే సాగనుంది. ఎక్కువ సమయం రాహుల్ పాదయాత్ర జుక్కల్ నియోజకవర్గంలో 64 కిలో మీటర్లు ఉంది. మదన్ మోహన్ రావు, షబ్బీర్ అలీ, సుబాష్ రెడ్డి మధ్య వర్గపోరు ఒకెత్తయితే జుక్కల్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే గంగారాం, పీసీసీ కార్యదర్శి గడుగు గంగాధర్ మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరుతోంది. వీరిద్దరూ జుక్కల్ నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇంట్రస్ట్ చూపుతున్నారు. ఇప్పటికే పార్టీ అధిష్టానం గడుగు గంగాధర్ కు జుక్కల్ నియోజకవర్గంలో కార్యక్రమాలు చేసుకోవాలని ఆదేశించటంతో ఆయన పూర్తిగా జుక్కల్ నియోజకవర్గానికే టైం కేటాయిస్తూ... బీజీగా మారిపోయారు. జుక్కల్ కాంగ్రెస్ లో ఇప్పుడు గంగారాం వర్సెస్ గంగాధర్ గా మారింది. గంగారాం ఇప్పటికే కాంగ్రెస్ నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. సీనియర్ లీడర్. గడుగు గంగాధర్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా రెండు పర్యాయాలు చేశారు. వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఈ పరిస్థితిలో రాహుల్ భారత్ జోడో యాత్ర జుక్కల్ నియోజకవర్గంలోనే ఉండటంతో ... కాంగ్రెస్ సెకండ్ క్యాడర్ లీడర్లు కన్ఫ్యూజన్ లో పడ్డారు. ఎవరి మాట వినాలో తెలియక తికమకపడుతున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన మదన్ మోహన్ రావుకు షబ్బీర్ అలీకి మధ్య పోరుతో కాంగ్రెస్ శ్రేణులు నలిగిపోతున్నాయి. ఈ పరిణామాలు భారత్ జోడో యాత్రపై ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు కాంగ్రెస్ శ్రేణులు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Mechanic Rocky Review - 'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
IND vs AUS 1st Test: ఆస్ట్రేలియాతో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌- ప్లేయింగ్ 11లో నితీశ్‌కు చోటు 
ఆస్ట్రేలియాతో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌- ప్లేయింగ్ 11లో నితీశ్‌కు చోటు 
Sabarimala Temple 18 Steps: శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Embed widget