అన్వేషించండి

Basara Temple Master Plan: రూ.225 కోట్ల‌తో బాస‌ర స‌ర‌స్వ‌తి ఆల‌యం పునర్ నిర్మాణం.. 9 అంత‌స్తుల రాజ‌గోపురం, ఈశాన్యాన కోనేరు

Basara Temple Reconstruction Project | దక్షిణ భారత్‌లో ఏకైక జ్ఞాన సరస్వతి క్షేత్రమైన బాసర ఆలయం త్వరలో నూతన శోభను సంతరించుకోబోతోంది. ఆలయం పునర్నిర్మాణానికి ప్రభుత్వం రూ. 225 కోట్లను కేటాయించింది.

ద‌క్షిణాది రాష్ట్రాల్లోని ఏకైక జ్ఞాన స‌ర‌స్వ‌తి ఆల‌యం.. అక్ష‌రాభాస్యాల‌కు ఆల‌వాల‌మైన బాసర క్షేత్రం పునఃనిర్మాణంతో కొత్త శోభ‌ను సంత‌రించుకోబోతోంది. వేద వ్యాస మ‌హ‌ర్షితో ప్ర‌తిష్ట‌త‌మైన ముగ్గురు అమ్మల ఆల‌యం ఆచారాల‌కు అనుగుణంగా సమున్నత‌మైన రాజ‌గోపురం.. కోనేరు, ఉత్తర ద్వారం అభివృద్ధి, ధ్యాన మందిరాలతో భ‌క్తులను మరింతగా ఆకట్ట‌ుకోనుంది. వేల ఏళ్ల ఘ‌న చ‌రిత్ర ఉన్న బాసర జ్ఞాన స‌ర‌స్వ‌తి ఆల‌యం (Basara Temple) పునః నిర్మాణాల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం రూ.225 కోట్ల‌ను కేటాయించింది. బాసర ఆలయ పునర్ నిర్మాణ ప‌నుల‌కు సీఎం ఎ.రేవంత్ రెడ్డి సోమ‌వారం (ఏప్రిల్ 6న) భూమి పూజ చేయ‌నున్నారు. 

ద‌క్షిణ గంగగా గుర్తింపు పొందిన గోదావ‌రి న‌దీ తీరంలోని బాస‌రలో జ్ఞాన స‌ర‌స్వ‌తి దేవి కొలువై ఉన్నారు. కురుక్షేత్ర యుద్ధానంత‌రం వేద వ్యాస మ‌హ‌ర్షి గోదావ‌రి తీరానికి వ‌చ్చి బాస‌ర‌లో నివ‌సించారని పురాణాలు చెబుతున్నాయి. ఆ స‌మ‌యంలో స్వ‌యంగా ఆయ‌నే గోదావ‌రి ఇసుక‌తో జ్ఞాన స‌ర‌స్వ‌తితో పాటు మ‌హాల‌క్ష్మి, మ‌హా కాళి అమ్మ వార్ల మూర్తుల‌ను ప్ర‌తిష్టించార‌ని స్థ‌ల పురాణం చెబుతోంది.. అలా ముగ్గురమ్మ‌ల కొలువైన క్షేత్రంగా బాస‌ర ప్ర‌సిద్ధి చెందింది.

అక్ష‌రాభ్యాసాల‌తో...

జ్ఞాన స‌ర‌స్వ‌తి కొలువైన క్షేత్రం కావ‌డంతో ప్ర‌తి ఏటా పెద్ద సంఖ్య‌లో పిల్ల‌ల‌కు ఇక్క‌డ అక్ష‌రాభ్యాసాలు జరుగుతుంటాయి. వ‌సంత పంచ‌మి, ఇత‌ర ప‌ర్వ దినాల్లో అక్ష‌రాభ్యాసాల‌కు వ‌చ్చే పిల్ల‌లు, త‌ల్లిదండ్రులు, వారి బంధువులు, భ‌క్తుల‌తో ఆల‌యంలో రద్దీ నెలకొంటుంది. ప్రాచీన ఆల‌యం కావ‌డం.. ఏటా పెరుగుతున్న భ‌క్తుల సంఖ్య‌కు త‌గిన‌ట్లు అభివృద్ధి ప‌నులు చేప‌ట్ట‌పోవ‌డంతో భ‌క్తులు తీవ్ర ఇబ్బందుల‌కు గుర‌వుతున్నారు. ఈ క్రమంలో ఆల‌య అభివృద్ధి చేప‌ట్టాల‌ని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావించింది. సంప్ర‌దాయాలు, ఆచారాల‌కు అనుగుణంగా ఆల‌య అభివృద్ధి ప‌నులు చేప‌ట్టేందుకు మాస్ట‌ర్ ప్లాన్ త‌యారు చేయాల‌ని అధికారుల‌ను సీఎం ఆదేశించారు.

శృంగేరి పీఠాధిప‌తుల నుంచి అనుమ‌తి

బాస‌ర ఆల‌య పునఃనిర్మాణ ప‌నుల‌కు మాస్ట‌ర్ ప్లాన్ రూపొందించే ముందు అధికారులు శృంగేరి పీఠాధిప‌తుల‌ను సంప్ర‌దించారు. రాజ గోపురం, ఇత‌ర గోపురాలు, గ‌ర్భాల‌యం, అర్ధ మండ‌పం, మాడ వీధులు, కోనేరు, ఉత్త‌ర ద్వారాల నిర్మాణాల‌కు సంబంధించి పీఠాధిపతుల నుంచి అనుమ‌తులు తీసుకున్నారు. వారి సూచ‌న‌ల‌కు అనుగుణంగా మాస్ట‌ర్ ప్లాన్‌ను రూపొందించారు. 

భవిష్యత్ అవసరాలకు తగ్గట్లుగా నిర్మాణం..

భ‌క్తుల సంఖ్య‌తో పాటు భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌ను దృష్టిలో పెట్టుకొని ప్ర‌స్తుతం 2 వేల చ‌ద‌ర‌పు అడుగుల్లో ఉన్న గ‌ర్భాల‌యం, అర్ధ మండ‌పాన్ని 5 వేల చ‌ద‌ర‌పు అడుగుల‌కు పెంచుతున్నారు. ఉత్త‌రం వైపున 9 అంత‌స్తుల రాజ‌గోపురం, మిగిలిన 3 దిక్కుల్లో 7 అతంస్తుల గోపురాలు, 33 అడుగుల వెడ‌ల్పుతో 4 దిక్కుల మాడ వీధులు, ఉత్త‌ర ద్వారం నిర్మించ‌నున్నారు. మొత్తంగా ఆల‌య విస్తీర్ణాన్ని 20 వేల చ‌ద‌ర‌పు అడుగుల నుంచి 62 వేల చ‌ద‌ర‌పు అడుగుల‌కు పెంచుతున్నారు.

శిలా నిర్మాణాలు... 

బాసర సరస్వతీ అమ్మవారి ఆల‌యంలో ప్ర‌తి నిర్మాణాన్ని శిల‌ల‌తో చేప‌ట్ట‌నున్నారు. 6 వేల మంది భ‌క్తులకు అన్ని వ‌స‌తుల‌తో (ఫీడింగ్ రూమ్‌, ఫుడ్ స్టాల్స్‌, టాయిలెట్స్ త‌దిత‌రాల‌తో) 70 వేల చ‌ద‌ర‌పు అడుగుల‌తో క్యూ కాంప్లెక్స్‌లు, 200 మంది కూర్చొని ధ్యానం చేసుకునేలా ధ్యాన మందిరం, 20 వేల చ‌ద‌ర‌పు అడుగుల వైశాల్యంతో వంట శాల‌, భోజ‌న శాల‌లు, ప్ర‌సాద పంపిణీ కేంద్రం, ఈశాన్య దిక్కున కోనేరు, తూర్పున ఆధ్యాత్మిక‌త ప‌రిఢ‌విల్లేలా అద్భుత‌మైన తోర‌ణాలు, స‌మాచార కేంద్రం, ఆల‌యానికి ఉత్త‌ర‌, తూర్పు దిక్కుల్లో రోడ్ల అభివృద్ధి, దేవాల‌యం నుంచి ఆవ‌త‌లి వైపు వెళ్లేందుకు అండ‌ర్ పాస్‌, ఆవ‌త‌లి వైపున సోలార్ రూప్‌టాప్‌తో వాహ‌నాల పార్కింగ్‌ ఏర్పాటు చేయనున్నారు. ఆల‌య ప్రాంగణంలో ఆహ్లాద‌క‌ర‌మైన మొక్క‌లతో పుష్ప‌వ‌నం ప‌నులు చేప‌ట్ట‌నున్నారు. ఆల‌య ప్రాంగ‌ణం ఆవ‌ల హెల్త్ సెంట‌ర్ ఏర్పాటు చేస్తారు. 

పుష్క‌రాల‌కు వ‌చ్చే వారికి ఏర్పాట్లు...

గోదావ‌రి న‌ది పుష్క‌రాలు వ‌చ్చే ఏడాది జూన్ లో ప్రారంభంకానున్నాయి. పుష్క‌రాల స‌మ‌యంలో భ‌క్తులు పుణ్య స్నానాల‌కు బాస‌ర గోదావ‌రి తీరానికి చేరుకుంటారు. వారికి అవ‌స‌ర‌మైన అన్ని వ‌స‌తులు ప్ర‌స్తుత మాస్ట‌ర్‌ప్లాన్‌లో భాగంగా చేప‌ట్ట‌నున్నారు. ఏ ఒక్క భ‌క్తుడు ఇబ్బంది ప‌డ‌కుండా అదే స‌మ‌యంలో ఆల‌య సంప్ర‌దాయాలు, భ‌క్తుల విశ్వాసాల‌కు అనుగుణంగా ప‌నులు చేప‌ట్టాల‌ని సీఎం రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
Adilabad Spiny Gourd:ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Pooja Murthy: బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Embed widget