Bullock Cart Race: సంక్రాంతి వేళ ఆసిఫాబాద్ జిల్లాలో సందడిగా ఎడ్లబండి పోటీలు
Kumaram Bheem Asifabad District: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలంలోని బాబాపూర్ గ్రామంలోని నది తీరాన సంక్రాంతి పండగను పురస్కరించుకొని ఏటా ఎడ్ల పందెలు నిర్వహించారు.
Bullock cart races in Asifabad District: ఆసిఫాబాద్: తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండుగల్లో సంక్రాంతి ఒకటి. మూడు రోజులపాటు జరుపుకునే ఈ పండుగ సందర్భంగా పలు ప్రాంతాల్లో కోళ్ల పందేలు, ఎడ్ల బండి ఇతర పోటీలు నిర్వహిస్తుంటారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలంలోని బాబాపూర్ గ్రామంలోని నది తీరాన సంక్రాంతి పండగను పురస్కరించుకొని ఏటా ఎడ్ల పందెలు నిర్వహిస్తుంటారు. ఈ పోటీలకు పక్కన ఉన్నటువంటి వివిధ ప్రాంతాల నుండి ఎడ్ల పందెందారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
నది తీరాన ఎడ్ల పందెలు..
సంక్రాంతి పండుగను పురస్కరించుకొని బాబాపూర్ నది తీరాన ఎడ్ల పందెలను సోమవారం నిర్వహించారు. ఈ పోటీలను ఆసిఫాబాద్ తో పాటు సమీప గ్రామాల ప్రజలు భారీ సంఖ్యలో వీక్షించారు. ఎడ్ల పందెలను గ్రామస్తులు ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ రోజున ఎంతో ఘనంగా నిర్వహిస్తుంటారు. ఈ పోటీలకు మంచిర్యాల జిల్లాతో పాటు చుట్టుపక్కల గ్రామాలైన అంకుసాపూర్, బాబాపూర్, తదితర గ్రామాల నుండి ఎడ్ల పందెందారులు పాల్గొని సంక్రాంతి పండుగ వేళ ఉత్సాహం నింపారు. ఈ ఎడ్ల పందెలను చూడడానికి చుట్టుపక్కల గ్రామాల నుండి భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.
శివారులో కోడిపందాలు.. ఎనిమిది మంది అరెస్ట్
తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా సంక్రాంతి పండుగ వేళ కోడిపందాలను నిర్వహిస్తుంటారు. అయితే కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కోడిపందాలతో పాటు ఎడ్ల పందాలు నిర్వహించారు. గుండి గ్రామ శివారులో కోడిపందాలు నిర్వహిస్తున్న ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేసి కేసులు నమోదు చేశారు. అయితే అందరూ ఎక్కువగా ఈ ఎడ్ల పందాలపైనే ఎక్కువగా ఆసక్తి చూపించారు. స్థానికులు సమీప గ్రామాల ప్రజలు ఎడ్ల పందాలను సంక్రాంతి పండుగ వేళ ఎడ్ల పందెలను వీక్షించారు. ఈ పందాలలో గెలిచిన వాళ్లకు నిర్వాహకులు మొదటి బహుమతి, రెండో బహుమతి ప్రధానం చేశారు. ఇలా సంక్రాంతి పండుగ వేళ వేట ఈ ఉత్సవాలను నిర్వహిస్తూ ఆనంద సంతోషాలతో వేడుకలను నిర్వహించుకున్నారు. కొన్ని చోట్ల కోళ్ల పందెలపై భారీగా బెట్టింగ్ వేయగా.. పోలీసులు బెట్టింగ్ రాయుళ్లపై నిఘా పెట్టారు.