అన్వేషించండి
Advertisement
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వెల్లువెెత్తుతున్న స్వాముల నిరసనలు- నరేష్‌పై ఆగ్రహం!
నిజామాబాద్ జిల్లాలో ఆందోళనలు. బైరి నరేష్ ను అరెస్ట్ చేసి పీడీ యాక్ట్ నమోదు చేయాలంటూ డిమాండ్. అయ్యప్ప భక్తులు, బీజేపీ, భజ్ రంగ్ దళ్, హిందు వాహిని నాయకుల ధర్నాలు. రెంజర్లలో సురేష్ ఇంటి వద్ద ఆందోళన
హిందువుల మనోభావాలు దెబ్బతీస్తూ... అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్ ను అరెస్టు చేసినా నిరసనలు ఆగడం లేదు.
అరెస్ట్ చేసిన అతనిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా నిసరనలు కొనసాగుతున్నాయ్. జిల్లాలోని 5 నియోజకవర్గాల్లో అయ్యప్ప స్వాములు, బీజేపీ, భజ్ రంగ్ ధళ్, హిందు వాహిని నాయకులు ధర్నాలు చేస్తున్నారు. ఎక్కడికక్కడ నిరననలు వెల్లువెత్తుతున్నాయి. నిజామాబాద్ నగరంలోని ధర్నా చౌక్ చౌరస్తా వద్ద అయ్యప్ప భక్తులు, బీజేపీ నాయకులు ధన్ పాల్ సూర్య నారాయణ గుప్త ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. వెంటనే బైరి నరేష్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బైరి నరేషన్ ను అరెస్ట్ చేసి పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బాన్సువాడ, బోధన్, ఆర్మూర్, కామారెడ్డిలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయ్.
బైరి నరేశ్ అనుచిత వ్యాఖ్యలు చేసిన ఓ సభలో పాల్గొని చప్పట్లు కొట్టిన రెంజర్ల రాజేశ్ అనే గాయకుడు నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం రెంజర్ల గ్రామంలో ఉంటారు. అతని ఇంటి ఎదుట శుక్రవారం ఆర్థరాత్రి వరకు అయ్యప్ప భక్తులు ధర్నా చేశారు. గతంలోనూ రాజేశ్ అయ్యప్పను కించపరుస్తూ... పాటలు పాడి యూట్యూబ్ లో పోస్ట్ చేశాడని ఆరోపించారు. అయితే అతను ఇంట్లో లేకపోవడంతో వెంటనే పిలిపించాలని కుటుంబ సభ్యులను డిమాండ్ చేశారు.
ఈ క్రమంలో అతని స్నేహితుడు సుమన్ వచ్చి నిరసన తెలుపుతున్న అయ్యప్ప భక్తులను వీడియో తీస్తూ.... అనుచిత వ్యాఖ్యలు చేయడంతో అయ్యప్ప భక్తులు మరింత ఆగ్రహానికి లోనయ్యారు. రాజేశ్ తో పాటు సుమన్ ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయం తెలుసుకొని అక్కడకు చేరుకున్న పోలీసులు అయ్యప్ప భక్తులను సముదాయించారు. రాత్రి 11 గంటల సమయంలో సుమన్‌తో అయ్యప్ప భక్తులకు బహిరంగ క్షమాపణ చెప్పించి అతన్ని అదుపులోకి తీసుకోవడంతో భక్తులు ఆందోళన విరమించారు. ప్రస్తుతం రాజేష్ నెల్లూరులో ఉన్నట్టు సమాచారం. రాజేష్ ను తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ... శనివారం కూడా అయ్యప్ప స్వాములు ఆందోళనకు... దిగారు. దీంతో రేంజర్లలో పోలీసులను భారీగా మోహరించారు.
హిందూ దేవుళ్ళపై అయ్యప్ప స్వామి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన భైరీ నరేష్‌ను వరంగల్‌లో అరెస్టు చేశారు. ఈ మేరకు పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు. చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని అయ్యప్ప స్వాములు తమ ఆందోళనలు విరమించాలని విజ్ఞప్తి చేశారు. అరెస్టు చేసిన నరేష్‌ను కాసేపట్లో కొడంగల్ తరలించనున్నారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
కర్నూలు
సినిమా
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion