News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Telangana: కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఆత్మహత్య చేసుకుంటా, రాకపోతే నువ్వు సూసైడ్ చేసుకుంటావా? రేవంత్ రెడ్డికి జోగు రామన్న సవాల్

ఓటుకు నోటు కేసులో దొరికిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ప్రభుత్వంపై విమర్శలు చేసే నైతిక హక్కు లేదని, మరోసారి అమర్యాదగా  వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని ఎమ్మెల్యే జోగురామన్న ధ్వజమెత్తారు.

FOLLOW US: 
Share:

పట్టపగలు ఓటుకు నోటు కేసు (Cash For Vote)లో దొరికిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ప్రభుత్వంపై విమర్శలు చేసే నైతిక హక్కు లేదని, మరోసారి అమర్యాదగా  వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న ధ్వజమెత్తారు. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తాను ఆత్మహత్య చేసుకుంటానని, రాకపోతే రేవంత్ రెడ్డి ఆత్మహత్య చేసుకుంటాడా అంటూ సవాల్ విసిరారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన జోగు రామన్న కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రస్థాయిలో ఖండించారు. ఇటీవల రేవంత్ రెడ్డి తనను, తన ఇంటి పేరును ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన ఎమ్మెల్యే... బడుగు బలహీన వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేను కాబట్టే ఓర్వలేక అవమానిస్తున్నారని అన్నారు. మరోసారి ఇటువంటి వ్యాఖ్యలకు పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. 

గతంలో రేవంత్ రెడ్డి, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు నౌకరుగా వ్యవహరించారని వ్యాఖ్యానించారు. ఓటుకు నోట్లు విషయాలను గుర్తు చేస్తూ ప్రస్తుతం ఆయన ఒంటెద్దు పోకడలతో విర్రవీగుతున్నారని అన్నారు. అభివృద్దే పరమావధిగా దూసుకెళ్తున్న కేసీఆర్ ప్రభుత్వం గద్దె దిగుతుందన్న రేవంత్ రెడ్డి మాటలకు స్పందించిన ఆయన... ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తాను ఆత్మహత్య చేసుకుంటానని, రాకపోతే రేవంత్ రెడ్డి ఆత్మహత్య చేసుకుంటాడా అని సవాల్ విసిరారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో లక్షలాది ఉద్యోగాలను కల్పించిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే దక్కిందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్, పురపాలక మంత్రి కేటీఆర్ ల నాయకత్వంలో రాష్ట్రం అభ్యున్నతి పథంలో దూసుకెళ్తొందని అన్నారు. 

కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇక్కడి నేతలు సంబరాలు జరుపుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. టీపీసీసీ అధ్యక్షుడి స్థాయి వ్యక్తికి గ్రహ నిర్మాణశాఖ మంత్రి ఎవరో తెలియకపోవడం హాస్యాస్పదమని జోగు రామన్న అన్నారు. తన హయంలో నియోజకవర్గంలోని మారుమూల గ్రామాలను సైతం అభివృద్ధి బాటలో నడుపుతున్నానని స్పష్టం చేశారు. తన ఇంటిపేరును వక్రీకరిస్తూ చేసిన వ్యాఖ్యలపై బహిరంగ క్షమాపణలు చెప్పాలని రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. ఆయనతో డిసిసిబి చైర్మన్ అడ్డి భోజారెడ్డి , జిల్లా రైతు బంధు సమన్వయ అధ్యక్షులు రోకండ్ల రమేష్, వైస్ ఎంపీపీ జంగు పటేల్, అదిలాబాద్ పట్టణ అధ్యక్షులు అలాల అజయ్, మాజీ మార్కెట్ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్ తదితరులు పాల్గొన్నారు.

Published at : 16 Jun 2023 08:37 PM (IST) Tags: Jogu Ramanna Adilabad Revanth Reddy Telangana KCR

ఇవి కూడా చూడండి

Breaking News Live Telugu Updates: హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్లు వేసిన లోకేష్‌- ఫైబర్ గ్రిడ్, స్కిల్‌డెవలప్‌మెంట్ కేసుల్లో బెయిల్‌కు ప్రయత్నాలు

Breaking News Live Telugu Updates: హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్లు వేసిన లోకేష్‌- ఫైబర్ గ్రిడ్, స్కిల్‌డెవలప్‌మెంట్ కేసుల్లో బెయిల్‌కు ప్రయత్నాలు

TS DEECET: డీఎడ్ కౌన్సెలింగ్‌లో తీవ్ర జాప్యం, ఆందోళనలో అభ్యర్థులు

TS DEECET: డీఎడ్ కౌన్సెలింగ్‌లో తీవ్ర జాప్యం, ఆందోళనలో అభ్యర్థులు

వరంగల్ ‘నిట్’ నియామకాల్లో నిబంధనలకు తిలోదకాలు, ఆర్టీఐ వివరాలతో బయటపడ్డ అవకతవకలు

వరంగల్ ‘నిట్’ నియామకాల్లో నిబంధనలకు తిలోదకాలు, ఆర్టీఐ వివరాలతో బయటపడ్డ అవకతవకలు

పెండింగ్ సీట్లకు అభ్యర్థులను ఫిక్స్ చేసిన కేసీఆర్, త్వరలోనే ప్రకటన

పెండింగ్ సీట్లకు అభ్యర్థులను ఫిక్స్ చేసిన కేసీఆర్, త్వరలోనే ప్రకటన

Ganesh Immersion 2023: ఘనంగా ముగిసిన గణేష్ నవరాత్రి ఉత్సవాలు - గంగమ్మ ఒడికి చేరిన లక్షల విగ్రహాలు

Ganesh Immersion 2023: ఘనంగా ముగిసిన గణేష్ నవరాత్రి ఉత్సవాలు - గంగమ్మ ఒడికి చేరిన లక్షల విగ్రహాలు

టాప్ స్టోరీస్

బెంగళూరులో 44 విమానాలు రద్దు, కర్ణాటక బంద్ ఎఫెక్ట్ - ప్రయాణికుల ఇబ్బందులు

బెంగళూరులో 44 విమానాలు రద్దు, కర్ణాటక బంద్ ఎఫెక్ట్ - ప్రయాణికుల ఇబ్బందులు

World Cup 2023: హైదరాబాద్‌లో పాక్‌xకివీస్‌ వార్మప్‌ మ్యాచ్‌! వర్షం కురిసే ఛాన్స్‌!

World Cup 2023: హైదరాబాద్‌లో పాక్‌xకివీస్‌ వార్మప్‌ మ్యాచ్‌! వర్షం కురిసే ఛాన్స్‌!

Skanda Day 1 Collection: బాక్సాఫీస్ దగ్గర ‘స్కంద‘ ధూంధాం, రామ్ పోతినేని కెరీర్‌లో అత్యధిక ఓపెనింగ్!

Skanda Day 1 Collection: బాక్సాఫీస్ దగ్గర ‘స్కంద‘ ధూంధాం, రామ్ పోతినేని కెరీర్‌లో అత్యధిక ఓపెనింగ్!

ముదురుతున్న కావేరి జల వివాదం, కర్ణాటక బంద్‌ - సరిహద్దుల్లో భారీ భద్రత

ముదురుతున్న కావేరి జల వివాదం, కర్ణాటక బంద్‌ - సరిహద్దుల్లో భారీ భద్రత