News
News
వీడియోలు ఆటలు
X

Prashanth Reddy: దేశాన్ని దోచుకుంటోంది బీజేపీ, ఈడీ కేసులు పెట్టాల్సింది వాళ్ల మీదనే: మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

సీబీఐ, ఈడీ, ఐటీ లాంటి దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం తమ స్వార్థానికి దుర్వినియోగం చేస్తోందని, సీఎంలను పని చేసుకోనివ్వకుండా దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్నారని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు.

FOLLOW US: 
Share:

‘ధరలు పెంచి సామాన్యుల జీవితాలు నాశనం చేసింది బీజేపీ. దేశాన్ని దోచుకుంటోంది బీజేపీ, అసలు ఈడీ కేసులు పెట్టాల్సింది వాళ్ల మీదనే. సీబీఐ, ఈడీ, ఐటీ లాంటి దర్యాప్తు సంస్థలను తమ స్వార్థానికి దుర్వినియోగం చేస్తున్నారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులను పని చేసుకోనివ్వకుండా దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్నారు’ అని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. 

బాల్కొండ నియోజకవర్గం భీంగల్ మండలం... భీంగల్, బడా భీంగల్, చేంగల్, ముచ్కూర్, బాబాపూర్, గొన్గొప్పల గ్రామాల నుండి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన సుమారు 200 మంది యువకులు కేసీఆర్ పాలనకు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి మంత్రి సాదరంగా ఆహ్వానించారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. కర్ణాటకలో ప్రజలు మత రాజకీయాలను తిప్పి కొట్టారు. దేశంలో ప్రధాని మోడీ వల్ల ఏ ఒక్క వర్గానికి మేలు జరగలేదు. ధరలు పెంచి సామాన్యుల జీవనం భారం చేశారు. కేసీఆర్ తోనే సమగ్రాభివృద్ధి సాధ్యం అన్నారు. 

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడారు. కేసీఆర్, కేటీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తూ బీఆర్ఎస్ పార్టీలో చేరిన యువతకు హృదయ పూర్వక స్వాగతం. పార్టీలో చేరిక కోసం వచ్చిన వారంతా ఏదో ప్రచార ఆర్భాటం కోసం రాలేదని స్పష్టంగా కనిపిస్తుంది. పార్టీ నిర్మాణం కోసమే వచ్చారని, ఇట్లాంటి మార్పు యువతలో చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందన్నారు. అబద్దం ఎక్కువ రోజులు నిలబడదనీ, నీళ్లను చూపెట్టి పాలు అని నమ్మించలేమని బీజేపీ తీరును ఎండగట్టారు. యువతను బీజేపీ దేశం కోసం అంటూ తప్పు దోవ పట్టిస్తూ.. అసత్యాలు ప్రచారం చేయిస్తూ ఓ భ్రమలోకి నెట్టారనీ కానీ యువతకు అన్ని విషయాలు మెళ్ళమెల్లగా అర్దం అవుతున్నాయని, యువత ఆలోచనలోనే మార్పు మొదలైందని అన్నారు. 


యువత ఆలోచనలో భవిష్యత్ భారతానికి మంచిదన్నారు. ప్రజల మధ్య వైషమ్యాలు, యువతలో భావోద్వేగాలు రెచ్చగొట్టే నీచ రాజకీయాలు చేస్తున్న బిజెపికి స్వస్తి పలకాలన్నారు. లేకుంటే బీజేపీ వైఖరి వల్ల దేశ సమగ్రతకే పెనుముప్పు వాటిల్లనుందని ఆవేదన వ్యక్తంచేశారు. దేశ సంపదంతా బీజేపీ మోడీ తన కార్పొరేట్ మిత్రులకు దోచిపెడుతున్నడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ దోస్త్, వ్యాపారవేత్త గౌతమ్ అదానికి దేశ ఆస్తులన్నీ చట్టాలను తుంగలో తొక్కిమరీ అప్పనంగా కట్టబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్ఐసి, ఎస్బిఐ అదానీ కంపెనీలో పెట్టుబడులు పెట్టించి ప్రజల సొమ్మును ఆవిరి చేశారని మండిపడ్డారు. ఎయిర్ పోర్ట్స్ ఒక ప్రైవేట్ సంస్థకు 2 చొప్పున మాత్రమే ఇవ్వాలని ఆర్డర్స్ ఉంటే అదానీ కంపెనీకి 6 ఎయిర్ పోర్ట్స్ కట్టబెట్టారని,అక్రమంగా ఓడ రేవులు, రైల్వే స్టేషన్లు,అన్ని ప్రభుత్వ సంస్థలు దారాదత్తం చేస్తున్నారని ధ్వజమెత్తారు. 
2జీ వేలంలో అవినీతి జరిగిందని గుజరాత్ ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు ఆరోపించిన మోడీ 5జి విషయంలో 15 లక్షల కోట్ల మేర అవినీతి జరిగితే ఎందుకు స్పందంచడం లేదని ప్రశ్నించారు. మోడీ దోస్త్ ల కంపెనీలకు 5జి స్పెక్ట్రం అప్పనంగా కట్టబెట్టారని అన్నారు. దేశంలో 150 ఏండ్లకు సరిపడా బొగ్గు నిల్వలు ఉండగా, ఇక్కడి బొగ్గు టన్నుకు 3 నుంచి 5వేలకు వస్తుందని కానీ ఆస్ట్రేలియాలో అదానీ బొగ్గు గని నుండి సుమారు 3లక్షల కోట్ల బొగ్గు భారత దేశానికి దిగుమతి చేస్తున్నారని మండిపడ్డారు. అది 30వేలకు టన్ను కొనాలని విద్యుత్ డిస్కంలకు ఆర్డర్ వేశారని దుయ్యబట్టారు. ఇట్లా ప్రశ్నిస్తున్న వారి మీద అక్రమ కేసులు పెడుతున్నారని, ఈడీ కేసు అంటేనే నేడు ఓ పెద్ద జోక్ అయిపోయిందని అన్నారు.

సీబీఐ, ఈడీ, ఐటీ లాంటి దర్యాప్తు సంస్థలను తమ స్వార్థానికి దుర్వినియోగం చేస్తున్నారనీ, రాష్ట్రాల ముఖ్యమంత్రులను పని చేసుకోనివ్వకుండా దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్నారని మండిపడ్డారు. ఈడీ కేసులు పెడుతున్నారు కానీ ఒక్క కేసులో కూడా నేరం రుజువు చేయలేకపోతున్నారని వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్సీ కవిత మీద కూడా అట్లాంటి ఆరోపణలే చేస్తున్నారని గుర్తు చేశారు. అసలు దేశం మొత్తాన్ని అన్ని రంగాల్లో దోచుకుంటున్న బీజేపీ పై ఈ.డి కేసులు పెట్టాలని, ఈ.డి,సిబిఐ విచారణ జరిపి మోడీ, అమిత్ షా తమ సచ్చీలత నిరూపించుకోవాలని మంత్రి వేముల డిమాండ్ చేశారు. 

కర్ణాటకలో ప్రజలు మత రాజకీయాలను తిప్పి కొట్టారని, దేశంలో ప్రధాని మోడీ వల్ల ఏ ఒక్క వర్గానికి మేలు జరగలేదని, అన్ని రకాల ధరలు పెంచి సామాన్యుల జీవనం భారం చేశాడని అన్నారు. బీజేపీ నీచ రాజకీయాలు, దేశ సంపదను దోచుకుంటున్న తీరుపై గ్రామాల్లో, ప్రతి ఇంట్లో, యువత, స్నేహితులతో విస్తృత చర్చ జరగాలన్నారు. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ నేతలు అకాల వర్షాలు పడి రైతుల నష్ట పోవాలని, నష్ట పోయిన రైతుల వద్దకు పోయి మొసలి కన్నీరు కార్చాలని కోరుకుంటున్నారని అన్నారు. తడిసిన ధాన్యాన్ని కొనే బాధ్యత ప్రధాని మోడీకి లేదా అని నిలదీశారు. కేంద్ర బీజేపీ తమ బాధ్యతను విస్మరించినా.. రాష్ట్రంలో కేసీఆర్ రైతులకు భరోసా కల్పించారని అన్నారు.

కేసీఆర్ తోనే సమగ్రాభివృద్ధి సాధ్యం
రాష్ట్రంలో, దేశంలో కేసీఆర్ తోనే సమగ్రాభివృద్ధి సాధ్యమని మంత్రి వేముల స్పష్టం చేశారు. నేడు తెలంగాణ అభివృద్ది మోడల్ దేశానికి దిక్సూచిగా మారిందన్నారు. అభివృద్ది చెందిన గ్రామాలు ఎక్కడ అంటే తెలంగాణ వైపు చూస్తున్నారని, కేంద్రమే ఆ అవార్డులు ఇస్తుందని గుర్తు చేశారు. తలసరి ఆదాయం, తలసరి విద్యుత్ వినియోగం, సంక్షేమంలో తెలంగాణ నెంబర్ వన్ అని పేర్కొన్నారు. భారతదేశానికి, రాష్ట్రానికి కేసిఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష అని మంత్రి వేముల అన్నారు.

Published at : 16 May 2023 09:59 PM (IST) Tags: Narendra Modi Vemula Prashanth Reddy BRS Balkonda

సంబంధిత కథనాలు

Top 10 Headlines Today: సైకిల్ ఎక్కబోతున్న ఆ ముగ్గురు, సరూర్‌నగర్‌ హత్య కేసులో సాయికృష్ణ హాంగామా

Top 10 Headlines Today: సైకిల్ ఎక్కబోతున్న ఆ ముగ్గురు, సరూర్‌నగర్‌ హత్య కేసులో సాయికృష్ణ హాంగామా

Cyber Security: డిగ్రీలో 'తప్పనిసరి' సైబర్‌ సెక్యూరిటీ కోర్సు - ఉన్నత విద్యామండలి నిర్ణయం!

Cyber Security: డిగ్రీలో 'తప్పనిసరి' సైబర్‌ సెక్యూరిటీ కోర్సు - ఉన్నత విద్యామండలి నిర్ణయం!

TS Group-1: రేపే 'గ్రూప్‌-1' ప్రిలిమినరీ పరీక్ష, 15 నిమిషాల ముందుగానే గేట్లు 'క్లోజ్'! అభ్యర్థులకు ముఖ్య సూచనలు!

TS Group-1: రేపే 'గ్రూప్‌-1' ప్రిలిమినరీ పరీక్ష, 15 నిమిషాల ముందుగానే గేట్లు 'క్లోజ్'! అభ్యర్థులకు ముఖ్య సూచనలు!

Top 10 Headlines Today: లోకేష్‌కు గ్రాండ్ వెల్‌కమ్‌ చెప్పేందుకు నెల్లూరు లీడర్లు రెడీ, తెలంగాణలో నేడు సుపరిపాలన వేడుక

Top 10 Headlines Today: లోకేష్‌కు గ్రాండ్ వెల్‌కమ్‌ చెప్పేందుకు నెల్లూరు లీడర్లు రెడీ, తెలంగాణలో నేడు సుపరిపాలన వేడుక

Top 10 Headlines Today: మంత్రులపై బాబు పంచ్‌లు, జగన్‌పై పేర్ని నాని ప్రశంసలు- సింగరేణిపై కేసీఆర్ కీలక ప్రకటన

Top 10 Headlines Today: మంత్రులపై బాబు పంచ్‌లు, జగన్‌పై పేర్ని నాని ప్రశంసలు- సింగరేణిపై కేసీఆర్ కీలక ప్రకటన

టాప్ స్టోరీస్

Telangana Poltics : తెలంగాణ చీఫ్‌ను మారుస్తారని మళ్లీ ప్రచారం - బీజేపీ హైకమాండ్ పరిస్థితుల్ని ఎలా చక్కదిద్దుతుంది ?

Telangana Poltics :  తెలంగాణ చీఫ్‌ను మారుస్తారని మళ్లీ ప్రచారం - బీజేపీ హైకమాండ్ పరిస్థితుల్ని ఎలా  చక్కదిద్దుతుంది ?

Devineni Uma : అహంకారం వల్లే ఓడిపోయాం - దేవినేని ఉమ సంచలన వ్యాఖ్యలు !

Devineni Uma : అహంకారం వల్లే ఓడిపోయాం -  దేవినేని ఉమ సంచలన వ్యాఖ్యలు !

NBK 109 Movie : మారణాయుధాలతో పాటు మందు బాటిల్ - బాలకృష్ణతో బాబీ ప్లాన్ ఏంటి?

NBK 109 Movie : మారణాయుధాలతో పాటు మందు బాటిల్ - బాలకృష్ణతో బాబీ ప్లాన్ ఏంటి?

Thalaivar 170 : తమిళ సినిమాలో అమితాబ్ బచ్చన్ - 32 ఏళ్ళ తర్వాత రజనీతో!

Thalaivar 170 : తమిళ సినిమాలో అమితాబ్ బచ్చన్ - 32 ఏళ్ళ తర్వాత రజనీతో!