Viral News: ఘనంగా 100 ఏళ్ల బామ్మ, తాతల పుట్టిన రోజు వేడుకలు... ఎక్కడ చేశారంటే...!
100 Year Birthday celebration | జంటగా ఏడాది కూడా ఉండని రోజులివి. అలాంటిది తమ 100వ పుట్టినరోజును ఆ తాత, బామ్మలు ఘనంగా జరుపుకున్నాం. వంశం మొత్తం వేడుకల్లో పాల్గొని పాటలు, డ్యాన్సులతో దుమ్మురేపింది.

మనం ఎన్ని ఆరోగ్య నియమాలు పాటించినా ఈ కాలంలో అరవై, డెబ్బై ఏళ్లు కూడా బతుకుతామని చెప్పడానికి గ్యారంటీ లేదు. కానీ ఆ దంపతులు ఏకంగా వందవ జన్మదిన వేడుకలను నిర్వహించుకున్నారంటే అందరూ ఆశ్చర్యపోవాల్సిందే. అవును ఇదీ నిజమే... ఆ బామ్మ తాతల వందవ జన్మదిన వేడుకలను కుటుంబ సభ్యులు చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు.
నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని వాగ్దారికి చెందిన బదావత్ భీమినిబాయి(100), కిర్యానాయక్(100) ఈ దంపతులు 1925 సంవత్సరం మే 25న జన్మించారు. అయితే అందరి జన్మదిన వేడుకలను జరుపుకున్న ఆ కుటుంబ సభ్యులు ఈ వందేళ్ళ వృద్ద దంపతుల జన్మదిన వేడుకలను గ్రాండ్ గా చేయాలనీ నిర్ణయించుకున్నారు. ఆదివారం ఆ కుటుంబ సభ్యులందరూ గ్రామానికి చేరుకుని వందేళ్ళ ఇద్దరు వృద్ధ దంపతులు వారి బామ్మ, తాతల జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సంధర్బంగా వారితో కేక్ కట్ చేయించారు.

బంజారా ధూమ్ ధాం పాటలు, డ్యాన్సులు
చిన్న పిల్లల బర్త్ డే వేడుకల వలె ఈ ఇద్దరు బామ్మ తాతల జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ జన్మదిన వేడుకల్లో వారి ఐదు తరాల కుటుంబ సభ్యులు అందరు పాల్గొని సందడి చేశారు. సాంప్రదాయ బంజారా ధూమ్ ధాం పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా వేడుకలు నిర్వహించారు. 100వ జన్మదినోత్సవ వేడుకలను జరుపుకోవడం ఆ వృద్ధ దంపతులు ఆనందభాష్పాలతో ఎంతో సంతోషంగా కన్నీటి పర్యవంతమయ్యారు.
వారసులంతా కలిసి 100వ జన్మదిన వేడుకలను నిర్వహించడం ఈ జన్మకు దక్కిన అరుదైన అవకాశమని, ఈ కాలంలో అంతా వంద కన్నా తక్కువ ఏళ్లే గడవడం కష్టమని, అలాంటిది ఈ ఇద్దరు వృద్ధ దంపతులకు ఒకేసారి జన్మదిన వేడుకలు కూడా నిర్వహించడం అందరికీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

వీరి జన్మదిన వేడుకలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చూసిన వారంతా ఈ ఇద్దరి అదృష్టమని, గుర్తుంచుకొని ఆ కుటుంబ సభ్యులు వేడుకలు నిర్వహించడం సంతోషంగా ఉందంటున్నారు. సోషల్ మీడియాలోను ఈ ఇద్దరు వృద్ధ దంపతులు, బామ్మ, తాతలకు 100వ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ అందరూ ఎంతో సంబరపడిపోతున్నారు.





















