News
News
X

Bandi Sanjay : భైంసా పేరు మహిషాగా మారుస్తాం, పీడీయాక్ట్ లు ఎత్తేసి ఉద్యోగాలిస్తాం - బండి సంజయ్

Bandi Sanjay : భైంసా బహిరంగ సభలో బండి సంజయ్ ఫైర్ అయ్యారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

FOLLOW US: 
Share:

Bandi Sanjay : నిర్మల్ జిల్లా భైంసాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర బహిరంగ ఏర్పాటు చేశారు. హైకోర్టు షరతులతో భైంసాకు మూడు కిలోమీటర్ల అవతల బహిరంగ సభ ఏర్పాటు చేశారు. భైంసా శివారులోని ఓ ప్రైవేటు జిన్నింగ్ మిల్లులో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు నిర్మల్ జిల్లా నుండి పెద్దఎత్తున బీజేపీ నాయకులు తరలివచ్చారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి,  బండి సంజయ్, మర్రి శశిధర్ రెడ్డి, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావ్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తో పాటు పలువురు బీజేపీ రాష్ట్ర, జిల్లా నాయకులు, ప్రజా ప్రతినిధులు సభకు హాజరయ్యారు. 

కేసుల ఎత్తివేస్తాం 
 
బహిరంగ సభలో బండి సంజయ్ టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఇవాళ మీ ప్రభుత్వం ఉండొచ్చు, రేపు మా ప్రభుత్వం వస్తుందన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే భైంసాను అభివృద్ధి చేస్తామన్నారు. బీజేపీ కార్యకర్తలపై అన్యాయంగా పెట్టిన కేసులను ఎత్తివేస్తామన్నారు. భైంసాను దత్తత తీసుకుంటానని బండి సంజయ్ తెలిపారు. భైంసాకు రావాలంటే పర్మిషన్ తీసుకోవాలా అని బండి నిలదీశారు. మనం ఏ రాష్ట్రం, ఏ దేశంలో ఉన్నామని ఆయన ప్రశ్నించారు. భైంసాకు భరోసా కల్పించాడానికే తాను ప్రజాసంగ్రామ యాత్ర చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాషాయ పార్టీనే అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.  హిందూవాహిని కార్యకర్తలపై పెట్టిన పీడీయాక్ట్‌లు తొలగిస్తామన్నారు. వారికి ఉద్యోగాలిచ్చి గౌరవిస్తామన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే ఎంఐఎం నాయకులు ఎక్కడికైనా వెళ్లొచ్చు, ధర్మం కోసం పాటుపడే బీజేపీ నేతలపై మాత్రం ఆంక్షలు విధిస్తారా అని బండి సంజయ్ మండిపడ్డారు.  

భైంసా పేరు మహిషాగా మారుస్తాం 

"భైంసా పేరును మార్చుదాం. బీజేపీ అధికారంలోకి రాగానే భైంసాను మహిషాగా మార్చుదాం. బహిరంగ సభకు కోర్టు మూడు వేల‌మందికి అనుమతి ఇచ్చింది. భైంసాలో 144 సెక్షన్ పెట్టారు పోలీసులు. ఇంకో రెండు కేసులు సెక్షన్లు పెట్టినా ఏంకాదు.  జోష్ కోసమే భైంసాకు వచ్చాం. భైంసాకు భరోసా కల్పించడానికి ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభిస్తున్నాం.  సంక్రాంతి పండుగ చేసుకోకుండా వేధించారు. ఎంఐఎం గడ్డపై కమలం జెండాను ఎగురవేసే పార్టీ కమలం పార్టీ.  మహిషా పాకిస్తాన్ లో ఉందా? బంగ్లాదేశ్ లో ఉందా?  అఫ్ఘానిస్థాన్ లో ఉందా?  
సమాధానం చెప్పాలి.  దేశం కోసం, ధర్మంకోసం పోరాటం చేస్తున్న బీజేపీని బిజెపిని నిషేధిస్తారా? " - బండి సంజయ్ 
 
తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే

"కేసీఆర్ తన చెప్పు చేతల్లో ఉండే పోలీసులతో 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర బహిరంగ సభను అడ్డుకోవాలని చూశారు. బహిరంగ సభకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఇంతపెద్ద పార్టీ బహిరంగ సభ 2 గంటలే ఉంటుందా? కోర్టు ఎప్పుడూ కూడా ప్రజల పక్షానే ఉంటుంది. కేసీఆర్ పాలనలో చదువులమ్మ ఒడి అయిన బాసర ట్రిపుల్ ఐటీ లో విద్యార్థులు తమ హక్కుల కోసం ఉద్యమాన్ని చేశారు. విద్యార్థుల ఉద్యమంతో కేసీఆర్ కొడుకు కేటీఆర్ దిగి వచ్చారు. బాసర విద్యార్థులకు హ్యాట్సాఫ్. రెసిడెన్షియల్ స్కూల్స్ లో మంచి భోజనం పెట్టకపోవడంతో బల్లులు పడ్డ అన్నం తిని, విద్యార్థులు అనారోగ్యం పాలై, హాస్పిటల్ కు వెళ్తున్న పరిస్థితి. ప్రజలు నివురు గప్పిన నిప్పులా ఉన్నారు. కేసీఆర్ ను ఓడగొట్టడమే మా ఎజెండా అని ప్రజలు అనుకుంటున్నారు. కేసీఆర్ మాటలు కోటలు దాటుతాయి చేతలు మాత్రం గుమ్మం కూడా దాటవు. కేసీఆర్ డైరెక్షన్ లో పోలీసులు ఎంతమంది బీజేపీ కార్యకర్తలపై కేసులు పెడతారు?. తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే. రాబోయే కాలంలో పులి బిడ్డల్లా ఆదిలాబాద్ ప్రజలు బీజేపీ గెలుపు కోసం ప్రయత్నం చేయాలని కోరుతున్నా." - ఈటల రాజేందర్, బీజేపీ ఎమ్మెల్యే

Published at : 29 Nov 2022 05:51 PM (IST) Tags: BJP Bandi Sanjay CM KCR Bhainsa Praja Sangrama Yatra Nirmal district

సంబంధిత కథనాలు

Mulugu Accident: అతివేగంతో పల్టీ కొట్టిన కూలీల ఆటో - మహిళ మృతి, నలుగురి పరిస్థితి విషమం

Mulugu Accident: అతివేగంతో పల్టీ కొట్టిన కూలీల ఆటో - మహిళ మృతి, నలుగురి పరిస్థితి విషమం

తెలంగాణలోని ఆ ఏడు జిల్లాలకు మాత్రం ఆరెంజ్‌ అలెర్ట్‌!

తెలంగాణలోని ఆ ఏడు జిల్లాలకు మాత్రం ఆరెంజ్‌ అలెర్ట్‌!

KCR Vs Tamilsai : గవర్నర్‌తో రాజీ - బడ్జెట్‌పై కేసీఆర్ సైలెన్స్ ! తెలంగాణ రాజకీయాలు మారిపోయాయా ?

KCR Vs Tamilsai : గవర్నర్‌తో రాజీ - బడ్జెట్‌పై కేసీఆర్ సైలెన్స్ ! తెలంగాణ రాజకీయాలు మారిపోయాయా ?

BRS Meeting: మహారాష్ట్రలోని నాందేడ్ లో బీఆర్ఎస్ సభకు నేతలు ఏర్పాట్లు, భారీగా చేరికలపై ఫోకస్

BRS Meeting: మహారాష్ట్రలోని నాందేడ్ లో బీఆర్ఎస్ సభకు నేతలు ఏర్పాట్లు, భారీగా చేరికలపై ఫోకస్

TSPSC Group 4: 'గ్రూప్‌-4' ఉద్యోగాలకు 9.5 లక్షల దరఖాస్తులు, జులై 1న రాతపరీక్ష!

TSPSC Group 4: 'గ్రూప్‌-4' ఉద్యోగాలకు 9.5 లక్షల దరఖాస్తులు, జులై 1న రాతపరీక్ష!

టాప్ స్టోరీస్

Government Websites Hacked: ప్రభుత్వ వెబ్‌సైట్‌లను టార్గెట్ చేస్తున్న హ్యాకర్లు,అలెర్ట్ అవుతున్న అధికారులు

Government Websites Hacked: ప్రభుత్వ వెబ్‌సైట్‌లను టార్గెట్ చేస్తున్న హ్యాకర్లు,అలెర్ట్ అవుతున్న అధికారులు

Amigos Pre Release - NTR Jr : అన్నయ్య కోసం వస్తున్న ఎన్టీఆర్ - రేపే కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ప్రీ రిలీజ్

Amigos Pre Release - NTR Jr : అన్నయ్య కోసం వస్తున్న ఎన్టీఆర్ - రేపే కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ప్రీ రిలీజ్

Pawan Kalyan Latest Stills : 'హరి హర వీర మల్లు' సెట్స్‌లో పవన్ కళ్యాణ్ నవ్వులు చూశారా?

Pawan Kalyan Latest Stills : 'హరి హర వీర మల్లు' సెట్స్‌లో పవన్ కళ్యాణ్ నవ్వులు చూశారా?

Adani Group - RSS: ఏడేళ్ల క్రితమే అదానీపై కుట్ర, ఇప్పుడు అమలు - స్టోరీలోకి వచ్చిన ఆర్‌ఎస్ఎస్‌

Adani Group - RSS: ఏడేళ్ల క్రితమే అదానీపై కుట్ర, ఇప్పుడు అమలు - స్టోరీలోకి వచ్చిన ఆర్‌ఎస్ఎస్‌