అన్వేషించండి

New Telangana PCC Chief : ఏ క్షణమైనా కొత్త తెలంగాణ పీసీసీ చీఫ్‌ను ప్రకటించే చాన్స్ - రేసులో ఉన్న వారెవరంటే ?

Telangana Congress : పీసీసీ చీఫ్ ఎన్నికలపై కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు పూర్తి చేసింది. ఏ క్షణమైనా అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. ముఖ్య నేతలంతా ఢిల్లీలోనే ఉన్నారు.

New Telangana PCC chief will announce :  తెలంగాణ పీసీసీ చీఫ్ ఎన్నికపై అధిష్టానం కసరత్తు పూర్తి చేసింది.  ముఖ్య నాయకులను అందుబాటులో ఉండాలని ఏఐసీసీ ఆదేశించింది. రాత్రి 8 గంటలకు ముఖ్య నాయకులతో సీఎం రేవంత్.. ఇంఛార్జి దీపా దాస్ మూన్షి సమావేశం అవుతారు. ఆ తర్వాత ప్రకటన ఉంటుంది. ఇప్పటికే ఆశావహులు తమ  ప్రయత్నాలు తాము చేసుకుంటున్నారు.  పార్లమెంట్ హాల్ లో సోనియాగాంధీ ని   వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్, ప్రచార కమిటీ చైర్మన్ యాష్కీ కలిసి చర్చించారు. తమ పేర్లను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. 

పీసీసీ చీఫ్ ముగిసిన రేవంత్ రెడ్డి పదవీ కాలం               

పీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ పార్టీని గెలిపించారు. ఆయనకు సీఎం పదవి వచ్చింది. ఇక పార్టీ బాధ్యతల నుంచి ఆయనను తప్పించి వేరే వారికి ఇస్తారని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. కానీ అది ప్రచారంగానే ఉంది. లోక్ సభ ఎన్నికలు అయిపోయాయి.    ఈ నెల 27వ తేదీతో  అంటే గురువారంతోనే రేవంత్ రెడ్డి పీసీసీ అధ్య‌క్షుడై 3 సంవ‌త్స‌రాలు అవుతోంది. కాంగ్రెస్ పార్టీ నియ‌మ నిబంధ‌న‌ల ప్ర‌కారం పీసీసీ చీఫ్ ప‌ద‌వికాలం 3 సంవ‌త్స‌రాలు. ఆ త‌ర్వాత కొత్త వారిని నియ‌మించాల్సి ఉంటుంది. లేదా పొడిగించ‌వ‌చ్చు. అయితే, సీఎంగా, పీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్ రెడ్డి… పీసీసీ చీఫ్ పోస్టును మ‌రొక నేత‌కు కేటాయించాల‌ని అధిష్టానాన్ని కోరారు.

లోక్ సభ ఎన్నికల కారణంగా  ఇప్పటి వరకూ మార్చని హైకమాండ్               

నిజానికి అసెంబ్లీ ఎన్నిక‌లు పూర్తవ్వ‌గానే తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త బాస్ వ‌స్తార‌ని అంతా ఊహించారు. కానీ లోక్ స‌భ ఎన్నిక‌లు వెంట‌నే ఉండ‌టంతో రేవంత్ రెడ్డినే అధిష్టానం కంటిన్యూ చేసింది. దీంతో ఇప్పుడు మార్పు అనివార్యం కాగా… రేవంత్ రెడ్డి కూడా సామాజిక న్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని, కొత్త పీసీసీ చీఫ్ నిర్ణ‌యంపై నిర్ణ‌యం తీసుకోవాల‌ని రేవంత్ కోరారు.  బీసీ లేదా ఎస్సీ సామాజిక‌వ‌ర్గ నేత‌కు పీసీసీ ద‌క్కే అవ‌కాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అదే విధంగా మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, సంపత్‌ కుమార్‌ తదితరులు పీసీసీ చీఫ్‌ ఆశావహుల్లో ఉన్నారు. 

సామాజిక సమీకరణాల్లో భాగంగా  ఎంపిక చేసే అవకాశం                       

ఎస్సీ సామాజిక వర్గం నుంచి సంపత్ కుమార్, ఎస్టీ సామాజిక వర్గం నుంచి సీతక్క, బలరాం నాయక్ పేర్లు వినిపిస్తున్నాయి.  రేవంత్ ఛాయిస్ గా మంత్రి సీతక్క పేరు తెర మీదకు వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. గిరిజన మహిళకు పీసీసీ పగ్గాలు అప్పగించటం ద్వారా సానుకూలత పెరిగే అవకాశం ఉందని ఆయన అంచనా వేస్తున్నారు. మరోవైపు పార్టీ జాతీయ స్థాయి పోస్టులుసైతం తెలంగాణ నేతలకు దక్కే అవకాశం ఉంది. సిడబ్ల్యూసీ, జనరల్ సెక్రటరీ, సెక్రటరీ పోస్టులకోసం నేతలు  ప్రయత్నాలు చేసుకుంటున్నారు.  

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy Letter To Kishan Reddy: హైదరాబాద్ మెట్రో పై ఢిల్లీ వేదికగా తేల్చుకుందాం - కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి లేఖ
హైదరాబాద్ మెట్రో పై ఢిల్లీ వేదికగా తేల్చుకుందాం - కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి లేఖ
Breaking News: మహారాష్ట్రలో విషాదం.. హనుమాన్ ఆలయ మండపం కూలి ఏడుగురు భక్తులు మృతి
మహారాష్ట్రలో విషాదం.. హనుమాన్ ఆలయ మండపం కూలి ఏడుగురు భక్తులు మృతి
Sunkari Narahari Rao ACB Case: బ్యాంక్ లాకర్లలోనూ నోట్ల కట్టలే - మరో కోటిన్నర స్వాధీనం - నరహరి లెక్క తేలట్లేదు!
బ్యాంక్ లాకర్లలోనూ నోట్ల కట్టలే - మరో కోటిన్నర స్వాధీనం - నరహరి లెక్క తేలట్లేదు!
KTR Latest News:
"కాంగ్రెస్ నేతల కాలర్ పట్టుకోండి - ఆత్మహత్యలు చేసుకోవద్దు" రైతులకు కేటీఆర్ సూచన! 

వీడియోలు

India vs Afghanistan 3rd ODI | చెన్నై వన్డేలో భారత్ క్లీన్ స్వీప్ ఖాయమా?
Shreyanka Patil Ruled Out World Cup | వరల్డ్ కప్ నుండి శ్రేయాంక పాటిల్ అవుట్
Yuvraj Singh as Delhi Capitals Coach IPL 2027 | ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్‌గా యువరాజ్ సింగ్
Chandrababu With Baba Ramdev | ఉండవల్లిలో బాబా రామ్‌దేవ్‌తో సీఎం చంద్రబాబు
Godavari Heroine Anumita Dutta Life Story | గోదావరి సీరియల్ హీరోయిన్ జాను బ్యాక్‌గ్రౌండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Happy Fathers Day : హ్యాపీ ఫాదర్స్ డే 2026.. నాన్న ప్రేమను గుర్తిస్తూ, గౌరవిస్తూ ఇలా బెస్ట్ విషెస్ చెప్పేయండి
హ్యాపీ ఫాదర్స్ డే 2026.. నాన్న ప్రేమను గుర్తిస్తూ, గౌరవిస్తూ ఇలా బెస్ట్ విషెస్ చెప్పేయండి
Deputy CM Pawan Kalyan: నేను హోం మినిస్టర్ కాకపోవడం క్రిమినల్స్ అదృష్టం: కాకినాడలో పవన్ కళ్యాణ్ టాప్ 10 పాయింట్స్
నేను హోం మినిస్టర్ కాకపోవడం క్రిమినల్స్ అదృష్టం: కాకినాడలో పవన్ కళ్యాణ్ టాప్ 10 పాయింట్స్
Best Yoga Poses Men : 40 ఏళ్లు దాటిన మగవారు కచ్చితంగా చేయాల్సిన యోగాసనాలు ఇవే.. ఆరోగ్యం, ఫిట్నెస్ కోసం
40 ఏళ్లు దాటిన మగవారు కచ్చితంగా చేయాల్సిన యోగాసనాలు ఇవే.. ఆరోగ్యం, ఫిట్నెస్ కోసం
Annadata Sukhibhava Status Check Online: ఏపీ రైతుల ఖాతాల్లో 7000 జమ.. అన్నదాత సుఖీభవ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి
ఏపీ రైతుల ఖాతాల్లో 7000 జమ.. అన్నదాత సుఖీభవ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి
Yoga Benefits : రోజూ యోగా చేస్తే శారీరక, మానసిక ఆరోగ్యానికి కలిగే లాభాలు ఇవే.. మగవారికి, ఆడవారికి ఈ ప్రయోజనాలు అందుతాయి
రోజూ యోగా చేస్తే శారీరక, మానసిక ఆరోగ్యానికి కలిగే లాభాలు ఇవే.. మగవారికి, ఆడవారికి ఈ ప్రయోజనాలు అందుతాయి
Hanuman Temple Tragedy: మహారాష్ట్రలోని విషాదం.. ఆలయ మండపం కూలి ఏడుగురు భక్తులు మృతి, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
మహారాష్ట్రలోని విషాదం.. ఆలయ మండపం కూలి ఏడుగురు భక్తులు మృతి, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
PM Modi Wearing Baagh Watch: ట్రెండింగ్‌లో మోదీ వాచ్ - ఇది రోలెక్స్ కాదు .. మేడిన్ ఇండియా బ్రాండ్ !
ట్రెండింగ్‌లో మోదీ వాచ్ - ఇది రోలెక్స్ కాదు .. మేడిన్ ఇండియా బ్రాండ్ !
NEET Re-Exam: నాగ్‌పూర్ విద్యార్థికి అబుదాబి సెంటర్ వేయడానికి కారణాలు ఇవే.. ప్రాబ్లం క్లియర్ చేసిన NTA
నాగ్‌పూర్ విద్యార్థికి అబుదాబి సెంటర్ వేయడానికి కారణాలు ఇవే.. ప్రాబ్లం క్లియర్ చేసిన NTA
Embed widget