అన్వేషించండి

Nandamuri Suhasini : రేవంత్ , దీపాదాస్ మున్షిని కలిసిన నందమూరి సుహాసిని - పార్టీ మారుతున్నారా ?

Telangana News : నందమూరి సుహాసిని రేవంత్ రెడ్డితో సమావేశం అయ్యారు. మర్యాదపూర్వక భేటీనా.. రాజకీయ ఎజెండా ఉందా అన్నదానిపై ఎలాంటి ప్రకటన చేయలేదు.


Nandamuri Suhasini had a meeting with Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దివంగత నందమూరి హరికృష్ణ కూతురు, టీడీపీ నాయకురాలు నందమూరి సుహాసిని కలిశారు.  రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జీ దీపాదాస్ మున్షీ, మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి సమక్షంలో ఆమె రేవంత్ ను కలిశారు. లోక్ సభ ఎన్నికల సమయంలో రేవంత్ ను సుహాసిని కలవడం ఆసక్తికరంగా మారింది. 2018 ఎన్నికల్లో మహాకూటమిలో భాగంగా టీడీపీ తరపున కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి సుహాసిని పోటీ చేశారు. సుహాసిని ప్రస్తుతం తెలంగాణ టీడీపీ ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. 

ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చేరికల జోరు సాగుతోంది. వివిధ పార్టీల నేతల్ని.. కాంగ్రెస్ నేతలు ఆకర్షిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బారీ విజయమే లక్ష్యంగా నేతల్ని ఆకర్షిస్తున్నారు. ఈ క్రమంలో నందమూరి సుహాసినితోనూ చర్చలు జరిపినట్లుగా భావిస్తున్నారు. మర్యాదపూర్వక భేటీ అయితే.. దీపాదాస్ మున్షితో పాటు మల్కాజిగిరి సీటుకు పోటీ చేస్తున్న అభ్యర్థులు కూడా ఈ సమావేశానిగి హాజరవ్వాల్సిన అవసరం ఉండదని భావిస్తున్నారు. ఖచ్చితంగా రాజకీయ ఎజెండాతోనే సమావేశం జరిగి ఉంటుందని భావిస్తున్నారు.                                

తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో చేరింది.కానీ పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేయలేదు. దీంతో టీడీపీ నేతలంతా నిరాశకు గురయ్యారు. ఈ క్రమంలో నందమూరి  సుహానికి కాంగ్రెస్ పార్టీ లో చేరి రాజకీయంగా అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నారన్న చర్చ జరుగుతోంది. అదే సమయంలో సుహాసిని కాంగ్రెస్ పార్టీలో చేరినా  చేరకపోయినా.. ఈ సమావేశం ద్వారా  టీడీపీ సానుభూతి పరుల మద్దతు కాంగ్రెస్ కు లభించేలా చేసుకోచ్చని భావిస్తున్నారు. టీడీపీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు కాబ్టటి.. టీడీపీ సానుభూతిపరుల ఓట్లు కీలకం అయ్యే అవకాశం ఉంది. పోటీ హోరాహోరీగా సాగుతుందని భావిస్తున్న సమయంలో సుహాసిని...  కాంగ్రెస్ ముఖ్య నేతలతో భేటీ ఆసక్తికరంగా  మారింది.                                           

ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ సమీప భవిష్యత్‌లో ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కనిపించడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ నుంచి విరమించుకున్న తర్వాత పూర్తి స్తబ్దుగా అయిపోయారు.  తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ బీఆర్ఎస్ లో చేరిపోయారు. చేవెళ్ల పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఇతర నేతలంతా సైలెంట్ అయిపోయారు. పార్లమెంట్ ఎన్నికల్లో నూ పోటీ చేసేందుకు సిద్ధంగా లేరు. పార్టీ అధ్యక్షుడ్ని కూడా ఇంకా నియమించలేదు.  ఈ క్రమంలో  టీడీపీ నేతలు రాజకీయ భవిష్యత్ కోసం కాంగ్రెస్ పార్టీ వైపు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి.                           
 

 

టాప్ హెడ్ లైన్స్

Patancheru Real Estate: ఇంద్రేశంపై కన్నేసిన ఐటీ ఉద్యోగులు.. పటాన్ చెరు రియల్ ఎస్టేట్ ధరల్లో ఊహించని మార్పులు
ఇంద్రేశంపై కన్నేసిన ఐటీ ఉద్యోగులు.. పటాన్ చెరు రియల్ ఎస్టేట్ ధరల్లో ఊహించని మార్పులు
Breaking News: కర్ణాటక ప్రజలకు కొడంగల్ నియోజకవర్గంలో ఓట్లున్నాయి: కవిత సంచలన ఆరోపణలు
కర్ణాటక ప్రజలకు కొడంగల్ నియోజకవర్గంలో ఓట్లున్నాయి: కవిత సంచలన ఆరోపణలు
Kodangal Duplicate Votes: కొడంగల్‌లో 11 వేల కర్ణాటక వాసుల ఓట్లు - కవిత సంచలన ఆరోపణలు
కొడంగల్‌లో 11 వేల కర్ణాటక వాసుల ఓట్లు - కవిత సంచలన ఆరోపణలు
Dharavath Nikhil Death Case: ధరావత్ నిఖిల్ పరువుహత్య.. కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించిన హైకోర్టు
ధరావత్ నిఖిల్ పరువుహత్య.. కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించిన హైకోర్టు

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు గుడ్‌న్యూస్.. ఖాతాల్లోకి పరిహారం నిధులు జమ
వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు గుడ్‌న్యూస్.. ఖాతాల్లోకి పరిహారం నిధులు జమ
Delhi Dehradun Expressway Accident: ఢిల్లీ- డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వేపై రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి- సేఫ్ జర్నీకి ఇవి పాటించండి
ఢిల్లీ- డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వేపై రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి- సేఫ్ జర్నీకి ఇవి పాటించండి
CBI Investigation Credibility: సాయికృష్ణ కేసు సీబీఐకి ఇస్తే న్యాయం జరుగుతుందా? మరుగునపడిపోతుందా?
సాయికృష్ణ కేసు సీబీఐకి ఇస్తే న్యాయం జరుగుతుందా? మరుగునపడిపోతుందా?
Viral News: దుప్పటి అడిగినందుకు విద్యార్థినిని హాస్టల్ ఖాళీ చేపించిన వార్డెన్! చింతలపూడిలో ఘటన
దుప్పటి అడిగినందుకు విద్యార్థినిని హాస్టల్ ఖాళీ చేపించిన వార్డెన్! చింతలపూడిలో ఘటన
Union Cabinet Reshuffle: త్వరలో కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ.. మంత్రివర్గంలో మిత్రపక్షాలకు పెద్దపీట.. ఓ శాఖపై ఉత్కంఠ!
త్వరలో కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ.. మంత్రివర్గంలో మిత్రపక్షాలకు పెద్దపీట.. ఓ శాఖపై ఉత్కంఠ!
CM Revanth Reddy: ఎవడు అడ్డొచ్చినా, ఎవడు ఆత్మహత్య చేసుకున్నా.. మూసీ లేసి తొక్కుతా, ప్రక్షాళన చేసితీరుతా: నల్గొండలో రేవంత్ రెడ్డి
ఎవడు అడ్డొచ్చినా, ఎవడు ఆత్మహత్య చేసుకున్నా.. మూసీ లేసి తొక్కుతా, ప్రక్షాళన చేసితీరుతా: నల్గొండలో రేవంత్ రెడ్డి
Power Vs Opposition Mindset: మళ్లీ గెలిస్తే అన్నీ కార్యకర్తల చేతుల మీదుగానే - జగనే కాదు కేటీఆర్ కూడా సేమ్ హామీలు - అలా చేయగలరా?
మళ్లీ గెలిస్తే అన్నీ కార్యకర్తల చేతుల మీదుగానే - జగనే కాదు కేటీఆర్ కూడా సేమ్ హామీలు - అలా చేయగలరా?
White Rice vs Brown Rice : వైట్ రైస్ Vs బ్రౌన్ రైస్.. షుగర్ ఉన్నవారికి ఏది బెస్ట్? నిపుణులు చెప్తోన్న నిజాలు ఇవే
వైట్ రైస్ Vs బ్రౌన్ రైస్.. షుగర్ ఉన్నవారికి ఏది బెస్ట్? నిపుణులు చెప్తోన్న నిజాలు ఇవే
Embed widget