అన్వేషించండి

శ్రీనివాస రావు హత్యతో ఆందోళనలో ఫారెస్ట్ స్టాఫ్‌- ఆయుధాల కోసం జిల్లా కేంద్రాల్లో నిరసనలు

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోఅటవీ సిబ్బంది నిరసనలు మిన్నంటాయి. నల్ల బ్యాడ్జీలు ధరించి ఖమ్మంలో విధులకు హాజరయ్యారు ఫారెస్ట్ సిబ్బంది.

తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫారెస్ట్ అధికారి శ్రీనివాసరావు హత్య అటవీసిబ్బందిలో ఆందోళన కలిగిస్తోంది. అందుకే తమకు ఆయుధాలు సమకూర్చాలన్న డిమాండ్‌ను సిబ్బంది గట్టిగా వినిపిస్తున్నారు. లేకుంటే తాము విధులు నిర్వర్తించలేమంటున్నారు. ఈ డిమాండ్ ఎప్పటి నుంచో ఉన్నదే అయినప్పటికీ ఇన్ని రోజులు గట్టిగా నినదించలేకపోయారు. తమ సహచరుడు ప్రాణాలు కోల్పోయినందున  ఇప్పుడు ఆ డిమాండ్‌పై గట్టిగా పట్టుబడుతున్నారు అటవీ సిబ్బంది 
 
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోఅటవీ సిబ్బంది నిరసనలు మిన్నంటాయి. నల్ల బ్యాడ్జీలు ధరించి ఖమ్మంలో విధులకు హాజరయ్యారు ఫారెస్ట్ సిబ్బంది. శ్రీనివాసరావు హత్యను నిరసిస్తూ శాంతి ర్యాలీ చేశారు. ఫారెస్ట్ అధికారులకు ఆయుధాలు సమకూర్చి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. జిల్లా ఫారెస్ట్ అధికారికి వినతి పత్రం అందజేశారు. 

ములుగు జిల్లా కేంద్రంలో అటవీశాఖ సిబ్బంది ఆందోళనకు దిగారు. ఆత్మరక్షణలో భాగంగా తమకు ఆయుధాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గుత్తి కోయ గూడాలను పూర్తిగా ఎత్తివేయాలని డిమాండ్ చేశారు ఫారెస్ట్ సిబ్బంది. గుత్తికోయల దాడిలో మృతి చెందిన FRO శ్రీనివాసరావుకు నివాళులు అర్పిస్తూ శాంతి ర్యాలీ చేశారు. 

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఫారెస్ట్ అధికారులు ఆందోళనకు దిగారు. పోడు సర్వే, గ్రామసభల విధులను బహిష్కరించారు.  తమకు ఆయుధాలు ఇస్తేనే విధులకు హాజరవుతామని తేల్చిచెప్పారు. ఖమ్మం ఘటనతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నట్లు చెప్పారు అటవీశాఖ అధికారులు.  

గుత్తి కోయలు అటవీ ప్రాంతంలో చెట్లు నరుకుతుండగా అడ్డుకునేందుకు వెళ్లిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్‌ శ్రీనివాసరావును గుత్తి కోయలు గొడ్డలితో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అధికారిని చికిత్స నిమిత్తం ఖమ్మం జిల్లా ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. ఇక ఈ ఘటనపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. విచారం వ్యక్తం చేశారు. శ్రీనివాసరావుకు రిటైర్‌మెంట్ వరకు జీతభత్యాలు ప్రభుత్వం ఎలా అందిస్తుందో అదే విధంగా ఆయన కుటుంబానికి వేతనాన్ని అందించాలని అధికారుల్ని ఆదేశించారు సీఎం కేసీఆర్. దాడిలో ప్రాణాలు కోల్పోయిన అధికారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు రూ. 50లక్షల ఎక్స్‌గ్రేషియా వెంటనే అందజేయాలని ఆదేశించారు కేసీఆర్. డ్యూటీలో ఉన్న ప్రభుత్వ అధికారులపై దాడులు చేయడాన్ని ప్రభుత్వం సీరియస్‌గా పరిగణిస్తుందన్న సీఎం... అలాంటి వారిని సహించబోమని స్పష్టం చేశారు. తప్పు చేసిన వాళ్లను కఠినంగా శిక్షిస్తామన్నారు.  

మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్‌ను స్వయంగా శ్రీనివాసరావు స్వగ్రామం ఈర్లపూడి పంపపించి అంతిమ సంస్కారాలు పూర్తి చేయించారు సీఎం కేసీఆర్. శ్రీనివాసరావు మృతదేహానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చిన మంత్రులు... స్వయంగా పాడె మోశారు. జోహార్ శ్రీనివాసరావు అంటూ అటవీశాఖ అధికారులు, సిబ్బంది నినాదాలు చేశారు. ఇదే సమయంలో మహిళ ఉద్యోగులు కన్నీటి పర్యంతమయ్యారు. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: రేవంత్ రాసిచ్చిన ప్రశ్నల్నేతిప్పితిప్పి అడిగారు- కార్‌ రేసు విచారణ తర్వాత కేటీఆర్‌ కామెంట్స్
రేవంత్ రాసిచ్చిన ప్రశ్నల్నేతిప్పితిప్పి అడిగారు- కార్‌ రేసు విచారణ తర్వాత కేటీఆర్‌ కామెంట్స్
Tirupati Stampede : ప్రాణాలు పోతున్నాయి వేంకటేశా.. పాపం ఎవరిది తిరుమలేశా..!
ప్రాణాలు పోతున్నాయి వేంకటేశా.. పాపం ఎవరిది తిరుమలేశా..!
Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట ఘటన - మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
తిరుపతి తొక్కిసలాట ఘటన - మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
Divorce Proceedings in India : డివోర్స్ ఎన్ని రకాలో తెలుసా? విడాకుల డ్యాకుమెంటేషన్, లీగల్ ప్రాసెస్​ ఇదే.. భరణాన్ని ఎలా డిసైడ్ చేస్తారంటే
డివోర్స్ ఎన్ని రకాలో తెలుసా? విడాకుల డ్యాకుమెంటేషన్, లీగల్ ప్రాసెస్​ ఇదే.. భరణాన్ని ఎలా డిసైడ్ చేస్తారంటే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Tirupati Pilgrim Stampede CPR | తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు భక్తుల మృతి | ABP DesamTirupati Pilgrim Stampede | తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు భక్తుల మృతి | ABP DesamTTD Chairman BR Naidu on Stampede | తొక్కిసలాట ఘటనపై టీటీడీ ఛైర్మన్ దిగ్భ్రాంతి | ABP DesamTirupati Pilgrims Stampede 6died | వైకుంఠ ద్వార దర్శనాల టోకెన్ల పంపిణీలో విషాదం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: రేవంత్ రాసిచ్చిన ప్రశ్నల్నేతిప్పితిప్పి అడిగారు- కార్‌ రేసు విచారణ తర్వాత కేటీఆర్‌ కామెంట్స్
రేవంత్ రాసిచ్చిన ప్రశ్నల్నేతిప్పితిప్పి అడిగారు- కార్‌ రేసు విచారణ తర్వాత కేటీఆర్‌ కామెంట్స్
Tirupati Stampede : ప్రాణాలు పోతున్నాయి వేంకటేశా.. పాపం ఎవరిది తిరుమలేశా..!
ప్రాణాలు పోతున్నాయి వేంకటేశా.. పాపం ఎవరిది తిరుమలేశా..!
Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట ఘటన - మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
తిరుపతి తొక్కిసలాట ఘటన - మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
Divorce Proceedings in India : డివోర్స్ ఎన్ని రకాలో తెలుసా? విడాకుల డ్యాకుమెంటేషన్, లీగల్ ప్రాసెస్​ ఇదే.. భరణాన్ని ఎలా డిసైడ్ చేస్తారంటే
డివోర్స్ ఎన్ని రకాలో తెలుసా? విడాకుల డ్యాకుమెంటేషన్, లీగల్ ప్రాసెస్​ ఇదే.. భరణాన్ని ఎలా డిసైడ్ చేస్తారంటే
Telangana Tourism: సీఎం రేవంత్‌ చెప్పారు- నాగార్జున చేశారు- తెలంగాణలో కింగ్‌కు నచ్చిన ఫుడ్‌ ఇదేనట!
సీఎం రేవంత్‌ చెప్పారు- నాగార్జున చేశారు- తెలంగాణలో కింగ్‌కు నచ్చిన ఫుడ్‌ ఇదేనట!
OG Sriya Reddy: పవన్ కళ్యాణ్  OG బ్యూటీ శ్రియా రెడ్డి షాకింగ్ లుక్!
పవన్ కళ్యాణ్ OG బ్యూటీ శ్రియా రెడ్డి షాకింగ్ లుక్!
Tirupati Stampede : తిరుపతి తొక్కిసలాటలో వైసీపీ కుట్ర- టీటీడీ బోర్డు మెంబర్ సంచలన ఆరోపణలు 
తిరుపతి తొక్కిసలాటలో వైసీపీ కుట్ర- టీటీడీ బోర్డు మెంబర్ సంచలన ఆరోపణలు 
Actor Mohan Babu: నటుడు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట - తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ చర్యలొద్దని ఆదేశం
నటుడు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట - తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ చర్యలొద్దని ఆదేశం
Embed widget