Jagadish Reddy on congress sceems: బీఆర్‌ఎస్ పథకాలనే కాంగ్రెస్ కాపీ కొట్టింది, గ్యారంటీలన్నీ బోగసే- మంత్రి జగదీష్‌రెడ్డి
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన గ్యారెంటీ స్కీమ్స్ అన్నీ బోగసే అన్నారు మంత్రి జగదీస్‌రెడ్డి. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలనే కాపీ కొట్టారని విమర్శించారు.
హైదరాబాద్ తుక్కుగూడలో జరిగిన విజయభేరీ సభ వేదిగా... తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన పథకాలపై పొలిటిక్ వార్ కొనసాగుతోంది. బీఆర్‌ఎస్ నేతలు కాంగ్రెస్ స్కీమ్స్‌పై సెటైర్లు వేస్తున్నారు. మంత్రి జగదీష్‌రెడ్డి కూడా... కాంగ్రెస్ పథకాలపై ఘాటు విమర్శలు చేశారు. ప్రజలను మోసగించడం కాంగ్రెస్ పార్టీకి అలవాటేనని అన్నారు తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి. గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ బోగస్ అని అన్నారు. ప్రజలను మోసగించడం కాంగ్రెస్ పార్టీకి అలవాటని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ చరిత్ర చూస్తే... ఆ పార్టీ ఎప్పుడూ ప్రజల వైపు లేదన్నారు జగదీష్‌రెడ్డి. దేశంలో పేదరికానికి కారణం కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారాయన.
కాంగ్రెస్ అధికారంలో రావడం కల్లో మాటలన్నారు మంత్రి జగదీష్ అన్నారు. ఎలాగూ అధికారంలోకి వచ్చేది లేదు.. చచ్చేది లేదు అని ఆ పార్టీ కూడా అర్థమైపోయిందన్నారు. అందుకే ఇష్టం వచ్చినట్టు హామీలు ఇస్తున్నారని మండిపడ్డారు. సూర్యాపేటలో మీడియా సమావేశం నిర్వహించిన జగదీష్‌రెడ్డి... కాంగ్రెస్ హామీలకు కౌంటర్ ఇచ్చారు. ఇచ్చిన హామీలు నెరవేర్చిన చరిత్ర కాంగ్రెస్‌కు ఏనాడూ లేదన్నారు. అధికారం కోసం రాష్ట్ర నేతలు ఇచ్చిన స్క్రిప్ట్‌ను కాంగ్రెస్ అగ్రనేతలు చదివారని అన్నారు జగదీష్‌రెడ్డి. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలనే కాపీ కొట్టారన్న ఆరోపించారు. తెలంగాణలో ఇచ్చిన హామీలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు లేవని ప్రశ్నించారు జగదీష్‌రెడ్డి. ఎందుకంటే... అందులో ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు చేయగలిగిన హామీ లేదన్నారాయన. రాష్ట్రానికో మెనిఫెస్టో పెట్టి ప్రజలను మోసం చేయాలని చూస్తోందని ఫైరయ్యారు. వారంటీలు లేని గ్యారెంటీలు ఇచ్చి కర్ణాటకను ఆగం చేశారని మండిపడ్డారు మంత్రి జగదీష్‌రెడ్డి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటులో కాంగ్రెస్ పార్టీ చేసిన జాప్యం వల్లే ఇక్కడ ఆత్మబలిదానాలు జరిగాయన్నారు. కాంగ్రెస్ వల్లే తెలంగాణ రెండు తరాల భవిష్యత్‌ను కోల్పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి జగదీష్‌రెడ్డి. అబద్ధపు హామీలతో... కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను మోసగించాలని చూస్తోందన్నారు. కానీ, తెలంగాణ ప్రజలకు అన్నీ తెలుసని.... కాంగ్రెస్ పాచికలు ఇక్కడ పారవన్నారాయన.
సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకున్నారని చెప్పారు మంత్రి జగదీష్‌రెడ్డి. అబద్ధపు హామీలు ఇచ్చే అలవాటు ఆయనకు లేదన్నారు. కేసీఆర్ నాయకత్వంలో... తెలంగాణ ప్రగతి పథంలో దూసుకుపోతుందని... ఇచ్చినవే.. ఇవ్వని హామీలనే చేసి చూపించిన నాయకుడు కేసీఆర్ అని చెప్పారు. సీఎం కేసీఆర్ నాకత్వంలోనే తెలంగాణ రాష్ట్రం భద్రంగా ఉంటుందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తుండటంతో... ఓట్లు రాబట్టుకునేందుకు ప్రధాన పార్టీలన్నీ పడరాని పాట్లు పడుతున్నాయి. ప్రజటను ఆకట్టుకునేందుకు... రకరకాల పథకాలతో ముందుకొస్తున్నాయి. కాంగ్రెస్ కూడా విజయభేరీ సభలో ఆరు గ్యారంటీ స్కీమ్స్‌ను ప్రకటించింది. గ్యారంటీ పథకాలు గ్యారంటీగా అమలవుతాయని స్పష్టం చేసింది. ఆరు గ్యారెంటీల్లో మొదటిది.. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా తెలంగాణలో సొంతిల్లు లేని పేదలకు ఇంటి స్థలంతో పాటు, ఇంటి నిర్మాణం కోసం రూ. 5 లక్షలు ఆర్థిక సాయం. రెండోది.. తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం ఇవ్వస్తామని ప్రకటించింది. మూడోది.. చేయూత పథకం ద్వారా వృద్ధృలు, వితంతువులు, వికలాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ప్రతి నెలా రూ.4వేల పింఛన్. నాలుగోది.. పేదలకు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ.10 లక్షల వరకు ఆరోగ్య బీమా. ఐదవది... రైతు భరోసా పథకం ద్వారా రైతులకు పంట పెట్టుబడి సాయం కోసం ఎకరానికి రూ.15వేలు, కౌలు రౌతులకూ వర్తింపు. అలాగే, వ్యవసాయ కూలీలకు ఏటా రూ.12వేల సాయం, వరి పండించే వారికి మద్దతు ధరతోపాటు క్వింటాల్‌కు రూ.500 బోనస్. ఆరోది.. గృహ జ్యోతి పథకం ద్వారా ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ప్రతి నెలా రూ.2,500 ఆర్థిక సాయం, రూ.500కే గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం. యువ వికాసం పథకం ద్వారా విద్యార్థులకు రూ.5 లక్షల ఆర్థిక సాయం, ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు.