రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫైర్: కాంగ్రెస్ లో కలకలం.. ఇక ఏం జరుగబోతోందో?
Telangana News:తెలంగాణ కాంగ్రెస్‌లో మరో ముసలం పుట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి ప్రతి వేదికపై చేస్తున్న ఓ ప్రకటనను కోమటిరెడ్డి తప్పుపట్టారు. కార్యకర్తలు సహించబోరని వార్నింగ్ ఇచ్చారు.

Revanth Reddy Vs Komatireddy Rajagopal Reddy: తెలంగాణ కాంగ్రెస్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కలకలం సృష్టించారు. మరో పదేళ్ల పాటు తానే ముఖ్యమంత్రిని అని రేవంత్ రెడ్డి చెప్పుకోవడాన్ని రాజగోపాల్ రెడ్డి తప్పుపట్టారు. ఇదేమీ సొంత వ్యక్తిగత సామ్రాజ్యం కాదని కామెంట్ చేశారు. ఇదే ఇప్పుడు కాంగ్రెస్లో చర్చకు దారి తీస్తోంది. ఆయన తనకు తానుగా ఈ కామెంట్స్ చేశారా లేకుంటే ఆయన వెనకాలే ఇంకా ఎవరైనా ఉన్నారా అనే చర్చ తెలంగాణ రాజకీయాల్లో జరుగుతోంది.
నాగర్కర్నూలు జిల్లాలో కొల్లాపూర్లో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన కామెంట్స్ను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తప్పుపడుతున్నారు. పాలమూరు బిడ్డ అయిన తాను పదేళ్ల పాటు సీఎంగా ఉంటాననిచెప్పుకొచ్చారు. రేవంత్ రెడ్డి. కేసీఆర్కు, బీఆర్ఎస్కు ఇష్టం ఉన్నా లేకపోయినా మరో పదేళ్లు ప్రతిపక్షంలో కూర్చోవాల్సిందేనంటూ చెప్పారు.
రాబోయే పదేళ్లు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి గారు ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం.
— Komatireddy Raj Gopal Reddy (@rajgopalreddy_K) July 19, 2025
జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లో అధిష్ఠానం ఆదేశాల మేరకు, ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుంది. తెలంగాణ కాంగ్రెస్ ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను… pic.twitter.com/nGtGpQzgGk
పదేళ్ల పాటు సీఎం కుర్చీలో ఉంటానంటూ రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ పేపర్లో హెడ్లైన్స్గా వచ్చాయి.దీన్ని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఖండించారు. పేపర్ కటింగ్స్ను షేర్ చేస్తూ రేవంత్ కామెంట్స్ను ఖండించారు. కాంగ్రెస్లో ఇలాంటి విధానాలు ఉండబోవని అన్నారు. తనకు తానుగా రేవంత్ రెడ్డి పదేళ్ల పాటు సీఎంగా ఉంటానంటూ ప్రకటించుకోవడాన్ని తప్పుపట్టారు. ఆయన ఎక్స్లలో ఏమన్నారంటే"రాబోయే పదేళ్లు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లో అధిష్ఠానం ఆదేశాల మేరకు, ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుంది. తెలంగాణ కాంగ్రెస్ ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నిఖార్సయిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సహించరు." అని హెచ్చరించారు.





















