అన్వేషించండి

CM Revanth Reddy: ఎవడు అడ్డొచ్చినా, ఎవడు ఆత్మహత్య చేసుకున్నా.. మూసీ లేసి తొక్కుతా, ప్రక్షాళన చేసితీరుతా: నల్గొండలో రేవంత్ రెడ్డి

పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనపై, 12 ఏళ్ల బీజేపీ పాలన, రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనపై అసెంబ్లీ వేదికగా చర్చకు సిద్ధమా అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలకు నల్గొండ బహిరంగ సభలో సవాల్ విసిరారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • నల్లగొండలో సీఎం రేవంత్ రెడ్డి మూసీ ప్రక్షాళన, ప్రాజెక్టుల పూర్తికి హామీ ఇచ్చారు.
  • బీఆర్ఎస్ అప్పులు, అమరవీరుల త్యాగాలపై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు.
  • కాంగ్రెస్ ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత విద్యుత్, సన్న బియ్యం పథకాలిచ్చింది.
  • సీఎం పాలనపై అసెంబ్లీ చర్చకు ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు.

నల్లగొండ: తెలంగాణ సాధనలో మంత్రి పదవులను తృణప్రాయంగా వదిలిన కొండ లక్ష్మణ్ బాపూజీ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వంటి వారి త్యాగాల ముందు బీఆర్‌ఎస్ నేతల త్యాగాలు ఎందుకూ పనికిరావని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు. ఎవడు అడ్డు వచ్చినా, ఎవడు ఆత్మహత్య చేసుకున్నా.. మూసీ లేసి తొక్కుతా, మూసీ నది ప్రక్షాళన చేసితీరుతా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో 12 ఏళ్ల బీజేపీ పాలన, తెలంగాణలో 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, కాంగ్రెస్ పాలనపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమా అని ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు.వచ్చే ఎన్నికల్లోగా ఎస్ఎల్బీసీ, డిండి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని, మూసి నది ప్రక్షాళనకు ఎవరు అడ్డొచ్చినా వదిలేది లేదని హెచ్చరించారు.

నల్లగొండలోని నాగార్జున కాలేజీ స్టేడియంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో బీఆర్‌ఎస్ (BRS) పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అంతకుముందు ఆయన నల్లగొండ జిల్లాలో పలు కీలక అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. రాష్ట్రంలో 2028 నుండి 2034 వరకు సైతం కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేసిన సీఎం.. తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ వన్‌గా తీర్చిదిద్దుతానని ప్రతిజ్ఞ చేశారు.


CM Revanth Reddy: ఎవడు అడ్డొచ్చినా, ఎవడు ఆత్మహత్య చేసుకున్నా.. మూసీ లేసి తొక్కుతా, ప్రక్షాళన చేసితీరుతా: నల్గొండలో రేవంత్ రెడ్డి

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..  శ్రీకాంతాచారి, కానిస్టేబుల్ కృష్ణయ్య వంటి అమరవీరుల త్యాగాలను అడ్డం పెట్టుకుని, ఉద్యమం ముసుగులో గత బీఆర్ఎస్ పాలకులు ఫాం హౌజ్ పాలిటిక్స్ చేశారని దుయ్యబట్టారు. 2014లో 60 వేల కోట్లుగా ఉన్న రాష్ట్ర అప్పులను 6 లక్షల కోట్ల అప్పులపాలు చేసింది బీఆర్‌ఎస్సేనని విమర్శించారు. ఆ దోపిడీ దొంగతనాల్లో భాగస్వామ్యులైన వారే మళ్లీ పదవుల కోసం ఆశపడుతున్నారని, కానీ బీఆర్‌ఎస్ అనేది ఇక గతం అని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్ నాయకులను తాము రాజకీయంగా ఉప్పు పాతర వేశామని, వారిని మళ్లీ మొలవనివ్వబోమని స్పష్టం చేశారు. సూర్యాపేటలోని మూడు అడుగుల నాయకుడిని మళ్లీ అసెంబ్లీలోకి రానివ్వబోమని అక్కడి యువతే అంటున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Also Read: PV Narasimha Rao Birth Anniversary Tributes 2026: మహనీయులకు ప్రాంతాలు ఉండవు - విశాఖలోనూ పీవీకి ఘనగా నివాళులు - టీఆర్ఎస్ కవిత వర్సెస్ బీజేపీ విష్ణు

సంక్షేమం, అభివృద్ధిపై సవాల్
తెలంగాణలో తమ రెండున్నరేళ్ల పాలనతో పాటు గత 10 ఏళ్ల బీఆర్‌ఎస్ పాలన, 12 ఏళ్ల బీజేపీ కేంద్ర పాలనపై, వారి మేనిఫెస్టోలపై ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి చర్చిద్దామని, దీనికి సిద్ధమా? అంటూ విపక్షాలకు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. గత ప్రభుత్వంలో 5 ఏళ్లపాటు మహిళలకు క్యాబినెట్‌లో చోటే ఇవ్వలేదని, కొత్త రేషన్ కార్డులు కూడా ఇవ్వలేదని విమర్శించారు. తాము అధికారంలోకి రాగానే కొత్త కార్డులు ఇవ్వడమే కాకుండా.. గతంలో బర్లకు పోసిన దొడ్డు బియ్యం స్థానంలో, ఏటా 16 వేల కోట్లు ఖర్చు చేస్తూ 3 కోట్ల మందికి సన్న బియ్యం అందిస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. 

ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇండ్లు, రూ.500కే సిలిండర్
పేదవారి ఆత్మగౌరవమైన ఇందిరమ్మ ఇళ్లు ఇస్తుంటే ప్రతిపక్షాల కడుపు మండుతోందని, వాళ్లు మాత్రం వందల ఎకరాల్లో వందల కోట్లతో ఫాం హౌజ్‌లు కట్టుకోవచ్చా? అని ప్రశ్నించారు. పేదల ఇళ్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500లకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామని, రైతు భరోసాతో అన్నదాతల కళ్లల్లో ఆనందం చూస్తున్నామని పేర్కొన్నారు. దేశంలోనే అత్యధిక వరి ధాన్యం పండిస్తున్న తెలంగాణలో నల్లగొండ జిల్లా మొదటి స్థానంలో ఉందని, ఇప్పటివరకు 80 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం సేకరించామని వెల్లడించారు. ఎస్సీ (SC) కులాల వర్గీకరణను సాకారం చేసింది కాంగ్రెస్ పార్టీయేనని గుర్తుచేశారు.

నల్గొండ ప్రాజెక్టులు, మూసి ప్రక్షాళనపై కీలక ప్రకటనలు 
గత బీఆర్ఎస్ పాలకుల పాపాల వల్లే ఎస్ఎల్బీసీ (SLBC) ప్రాజెక్టు వెనుకబడిందని, నల్లగొండ ప్రజలకు తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. వచ్చే ఎన్నికల లోపే ఎస్ఎల్బీసీ టన్నెల్ (SLBC Tunnel), డిండి ప్రాజెక్టులను పూర్తి చేసి తీరుతామని మాటిచ్చారు. మూసి నదిని పూర్తిగా ప్రక్షాళన చేసి, ఆ కంపు నుండి నల్లగొండ బిడ్డలను కాపాడుకుంటానని స్పష్టం చేశారు. ఈ ప్రక్షాళనకు ఎవడు అడ్డు వచ్చినా మూసిలోనే తొక్కుతామంటూ హెచ్చరించారు. సింగరేణిలో టెండర్లు కాలేదని, ప్రతిపక్షాలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. 

Frequently Asked Questions

మూసీ నది ప్రక్షాళనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమన్నారు?

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ నదిని పూర్తిగా ప్రక్షాళన చేస్తానని, అడ్డువచ్చిన వారిని వదలనని అన్నారు. నల్లగొండ ప్రజలను ఆ కంపు నుండి కాపాడుతానని హామీ ఇచ్చారు.

ఎస్ఎల్బీసీ, డిండి ప్రాజెక్టుల పూర్తిపై ప్రభుత్వం ఏ హామీ ఇచ్చింది?

వచ్చే ఎన్నికలలోపు ఎస్ఎల్బీసీ టన్నెల్, డిండి ప్రాజెక్టులను పూర్తి చేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. గత బీఆర్ఎస్ పాలకులు చేసిన పాపాల వల్లే SLBC ప్రాజెక్టు ఆలస్యమైందని ఆయన పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలకు ఏ సవాల్ విసిరారు?

కేంద్రంలో 12 ఏళ్ల బీజేపీ, తెలంగాణలో 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, ప్రస్తుత కాంగ్రెస్ పాలనపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమా అని ప్రతిపక్షాలకు ఆయన సవాల్ విసిరారు. సంక్షేమం, అభివృద్ధిపై చర్చకు రమ్మన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన సంక్షేమ పథకాలు ఏమిటి?

పేదల ఇళ్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500లకే గ్యాస్ సిలిండర్, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నట్లు సీఎం తెలిపారు. 3 కోట్ల మందికి సన్న బియ్యం అందిస్తున్నామని చెప్పారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Konda Surekha: కొండా సురేఖకు ప్రత్యామ్నాయం ఎవరు? సూటబుల్‌ నేతలను వెతికే పనిలో కాంగ్రెస్‌ అధిష్ఠానం!
కొండా సురేఖకు ప్రత్యామ్నాయం ఎవరు? సూటబుల్‌ నేతలను వెతికే పనిలో కాంగ్రెస్‌ అధిష్ఠానం!
Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
CM Revanth Reddy US Visit: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Advertisement

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
Parvathipuram Manyam District Latest News: పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల వీరంగం! పంటలు తొక్కేసి వ్యవసాయ మోటారులు ధ్వంసం!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల వీరంగం! పంటలు తొక్కేసి వ్యవసాయ మోటారులు ధ్వంసం!
Mega 158 Title : మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ - 'కాకా' వచ్చేశారు... కూల్ లుక్ To మాస్ అన్నయ్య
మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ - 'కాకా' వచ్చేశారు... కూల్ లుక్ To మాస్ అన్నయ్య
YS Avinash Reddy: అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
Embed widget