అన్వేషించండి

Bhatti Vikramarka: బీఆర్ఎస్ వల్లనే యాదాద్రి ప్లాంట్ ఆలస్యం, ఖర్చు కూడా ఎగబాకింది - భట్టి

Nalgonda News: భట్టి విక్రమార్క యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ను సందర్శించారు. నిర్మాణ పనుల్లో వేగం పెంచి యూనిట్ 2 ఆయిల్ సింక్రనైజేషన్ పనులు ప్రారంభించిన అధికారులకు అభినందనలు తెలిపారు.

Yadadri Thermal Power Station: యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పనులను పూర్తి చేసే విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, అందుకే దాని ప్రాజెక్టు వ్యయం కూడా విపరీతంగా పెరిగిపోయిందని భట్టి విక్రమార్క విమర్శించారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పనుల్లో వేగం పెంచి యూనిట్ 2 ఆయిల్ సింక్రనైజేషన్ పనులు ప్రారంభించిన అధికారులు, సిబ్బంది, కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అభినందనలు తెలిపారు.

‘‘8.2.2015 న పవర్ ప్లాంట్ పనులకు పునాది పడింది. 17.10.2015 న పనులు మొదలుపెట్టారు. 2020 అక్టోబర్లో రెండు యూనిట్లు 2021లో మిగిలిన మూడు యూనిట్లు పూర్తి చేయాలని గత ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే అనుకున్న సమయానికి అందించకపోవడం మూలంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం పడింది. ప్రాజెక్టును అనుకున్న కాలంలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా కూడా నాటి ప్రభుత్వం చిత్తశుద్ధి లోపం, నిత్యం సమీక్షలు లేకపోవడం మూలంగా ఆర్థిక భారం పెరిగింది.

ఇందిరమ్మ రాజ్యం అధికారంలోకి వచ్చేనాటికి పవర్ ప్రాజెక్టు అనుమతులు నిరాకరణకు గురయ్యాయి. 50 శాతం విదేశీ బొగ్గు మరో 50 శాతం స్వదేశీ బొగ్గుతో విద్యుత్ ఉత్పత్తి చేస్తామని ఎన్‌జీటీకి చెప్పారు. కాలక్రమంలో నాటి ప్రభుత్వం నిర్ణయం మార్చుకోవడంతో పర్యావరణవేత్తలు కోర్టుకు వెళ్లారు. ఫలితంగా అనుమతులు సస్పెండ్ అయ్యాయి. అప్పుడే ఎన్జీటీకి నాటి ప్రభుత్వం సమాచారం ఇచ్చి ఉంటే ప్రాజెక్టు పనుల్లో ఆలస్యం జరిగి ఉండేది కాదు. ఇందిరమ్మ రాజ్యం రాగానే ఎన్జీటీకి కావలసిన పబ్లిక్ హియరింగ్ ను గత ఫిబ్రవరిలో చేపట్టాం. జూలైలో ఈసీ క్లియరెన్స్ తెచ్చాం.

మేము అధికారంలోకి వచ్చాక నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. వారానికి ఒకసారి సమీక్ష చేపట్టాం. ప్రాజెక్టు పనులు పూర్తి చేయడానికి వారం వారం.. క్యాలెండర్ ఖరారు చేసాం. 31 మార్చి 2025 నాటికి 4 వేల మెగావాట్ల ఉత్పత్తి సాధించే దిశగా ముందుకు వెళ్తున్నాం. అందుకు అనుగుణంగా టార్గెట్లు పెట్టుకున్నాం. రోడ్లు, రైల్వే, సివిల్ పనులు సైతం పూర్తిచేయాలని నిర్ణయించాం. మొత్తం ఐదు యూనిట్లలో మూడు యూనిట్ల ద్వారా 2,400 మెగావాట్లను ఈ ఏడాది చివరకు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మిగిలిన రెండు యూనిట్లు 2025 మార్చికి పూర్తిచేసి 4000 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేస్తాం. 

ప్రాజెక్టు పూర్తయ్యాక ఖర్చు మొత్తం లెక్క కట్టి యూనిట్ ధర ఎంత అవుతుంది అనేది ఈఆర్సీ నిర్ణయిస్తుంది. మా లెక్కల ప్రకారం ఈ ప్రాజెక్టు పూర్తయ్యేసరికి యూనిట్ ధర రూ.6.35 రూపాయలుగా ఉంటుందన్న ఆలోచనతో ముందుకు పోతున్నాం. ఇది రాష్ట్ర ప్రజల సంపద, రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెంచడానికి విద్యుత్ అవసరాలు తీర్చడానికి ఓ ఉన్నత కార్యక్రమం ఇది. భూ నిర్వాసితులు గొప్ప త్యాగధనులు. భూ సేకరణ పరిహారం చెల్లించడంతోపాటు వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. భూ నిర్వాసితుల విషయంలో అందరి ఆలోచనలు పరిగణలోకి తీసుకుంటాం’’ అని భట్టి విక్రమార్క అన్నారు.

టాప్ హెడ్ లైన్స్

Konda Surekha: కొండా సురేఖకు ప్రత్యామ్నాయం ఎవరు? సూటబుల్‌ నేతలను వెతికే పనిలో కాంగ్రెస్‌ అధిష్ఠానం!
కొండా సురేఖకు ప్రత్యామ్నాయం ఎవరు? సూటబుల్‌ నేతలను వెతికే పనిలో కాంగ్రెస్‌ అధిష్ఠానం!
Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
CM Revanth Reddy US Visit: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mega 158 Title : మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ - 'కాకా' వచ్చేశారు... మెగా ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ కన్ఫర్మ్
మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ - 'కాకా' వచ్చేశారు... మెగా ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ కన్ఫర్మ్
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
YS Avinash Reddy: అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
Romantic Drama OTT : రెండు ఓటీటీల్లోకి రొమాంటిక్ డ్రామా సడన్ స్ట్రీమింగ్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో చూడొచ్చంటే?
రెండు ఓటీటీల్లోకి రొమాంటిక్ డ్రామా సడన్ స్ట్రీమింగ్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో చూడొచ్చంటే?
యమహా RayZR 125 వేరియంట్లలో ఏది బెస్ట్‌? ధరలు, ఫీచర్ల వివరాలు మీ కోసం!
లక్ష రూపాయల్లోనే యమహా స్పోర్టీ స్కూటర్‌.. 4 వేరియంట్లలో ఉన్న ఫీచర్లేంటి?
Embed widget