అన్వేషించండి

Bandi Sanjay: కేసీఆర్ ఏడవబోతున్నారు, అలా చేసి సింపథీ - నేటి సభే సమాధి: బండి సంజయ్

నల్గొండ జిల్లా మర్రిగూడ మండలంలోని బీజేపీ క్యాంప్ ఆఫీసులో బండి సంజయ్‌ ఆదివారం (అక్టోబరు 30) ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.

Bandi Sanjay on CM KCR: ముఖ్యమంత్రి కేసీఆర్ నటించేవాడు కాదు జీవించేవాడు అని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. నేడు (అక్టోబరు 30) జరిగే బహిరంగ సభ సీఎం కేసీఆర్‌ రాజకీయ జీవితానికి సమాధి అని బండి సంజయ్‌ అన్నారు. ఇవాళ ఈ బహిరంగ సభ వేదికపై సీఎం కేసీఆర్ ఏడవబోతున్నారని.. అలా చేయడం ద్వారా సానుభూతిని (సింపథీ) పొందాలని‌ చూస్తున్నాడని అన్నారు. నల్గొండ జిల్లా మర్రిగూడ మండలంలోని బీజేపీ క్యాంప్ ఆఫీసులో బండి సంజయ్‌ ఆదివారం (అక్టోబరు 30) ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.

మునుగోడు ఉప ఎన్నికలో విజయం సాధించేందుకు టీఆర్ఎస్ పార్టీ ఎన్ని డ్రామాలకైనా తెరతీస్తుందని బండి సంజయ్‌ విమర్శించారు. ఓటర్లను కొనుగోలు చేసేందుకు సీఎం కాన్వాయ్‌లోనే డబ్బు తరలిస్తున్నారని ఆరోపించారు. గత 8 ఏళ్లలో మునుగోడు నియోజకవర్గంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏంటో బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలైన నిధుల వివరాలను కూడా వెల్లడించాలని డిమాండ్‌ చేశారు.

‘‘నియోజకవర్గ అభివృద్ధిపై నిర్లక్ష్యం వహిస్తున్నారనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా‌ చేశారు. అభివృద్ధిపై ఆయన అడిగిన ప్రశ్నలకు‌ సమాధానం చెప్పాలి. కేంద్రం ఇచ్చిన సంక్షేమ పథకాలను ఏం ఏం అమలు చేశారో చెప్పాలి. మీ టీఆర్ఎస్ అభ్యర్థిని పార్టీ ప్రచారానికి‌ తీసుకెళ్లాలంటేనే అవమానంగా ఎందుకు భావిస్తున్నారో చెప్పాలి’’ అని బండి సంజయ్ అన్నారు. 

మునుగోడు అభివృద్ధిపై రాజగోపాల్‌ రెడ్డి చేసిన సవాలుపై సీఎం కేసీఆర్‌ స్పందించాలని బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. కేసీఆర్ దుకాణం నేటి సభతో మూతపడుతుందని, అందుకే కేసీఆర్ బయపడుతున్నారని అన్నారు. బహిరంగ సభను చూసి జనాలు నవ్వుకోవడానికి రెడీగా ఉన్నారని అన్నారు.

సీబీఐ అంశంపైనా..

సీబీఐ అంటే కేసీఆర్‌కు భయం పట్టుకుందని కేసీఆర్ అన్నారు. తప్పు చేయకపోతే అంత భయం ఎందుకని అన్నారు. తప్పు చేయకుంటే విచారణను ఎందుకు అడ్డుకుంటున్నారని బండి సంజయ్ ప్రశ్నించారు. సీబీఐ విషయంలో ఆగస్టు 30న జీవో - 51 ఇచ్చారని చెబుతున్నారని, బీజేపీ పిటిషన్ వేసే వరకూ జీవో అంశం బయటికి రాలేదని అన్నారు. లిక్కర్ కేసు బయటికి రాగానే జీవో 51 ఇచ్చారంటూ బండి సంజయ్ విమర్శించారు. కేసీఆర్ కు ఏ సంస్థపైనా నమ్మకం లేదని అన్నారు.

ఎమ్మెల్యేల వ్యవహారంలో సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేశాం. విచారణ జరపకపోతే ఎలా నిజాలు బయటకు వస్తాయి. నలుగురు ఎమ్మెల్యేలను బయటకు రాకుండా ఎందుకు బంధిస్తున్నావు? ప్రగతి భవన్ లోనే ఉంచుకున్నావు. ఈ రోజు ఆయన పక్కన కూర్చోబెట్టుకొని తీసుకెళ్తాడట. పైలెట్ రోహిత్ రెడ్డిని పార్టీలోకి ఎన్ని డబ్బులు ఇచ్చి చేర్చుకున్నావో మహేందర్ రెడ్డిని అడిగితే చెప్పారా? ఇప్పటి వరకు 33 మందిని ఇతర పార్టీ నేతలను టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుంటే మాకేం లాభం. ప్రజలు నీ డ్రామాలను పట్టించుకోవట్లేదు. ఇదంతా డ్రామా కాదని ఈ రోజు సభలో మీరు ప్రమాణం చేయండి’’ అని బండి సంజయ్‌ డిమాండ్ చేశారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Jagan: జనవరి నుంచి జగన్ జిల్లాల పర్యటన - కష్టపడేవారికే భవిష్యత్ - పార్టీ నేతలకు జగన్ సందేశం
జనవరి నుంచి జగన్ జిల్లాల పర్యటన - కష్టపడేవారికే భవిష్యత్ - పార్టీ నేతలకు జగన్ సందేశం
Team India: పాకిస్తాన్‌కు బిగ్ షాక్ - భారత జట్టు అక్కడికి వెళ్లేది లేదని విదేశాంగ శాఖ క్లారిటీ
పాకిస్తాన్‌కు బిగ్ షాక్ - భారత జట్టు అక్కడికి వెళ్లేది లేదని విదేశాంగ శాఖ క్లారిటీ
Realme V60 Pro: రూ.18 వేలలోనే 12 జీబీ ర్యామ్ + 256 జీబీ ఫోన్ - రియల్‌మీ వీ60ప్రో వచ్చేసింది!
రూ.18 వేలలోనే 12 జీబీ ర్యామ్ + 256 జీబీ ఫోన్ - రియల్‌మీ వీ60ప్రో వచ్చేసింది!
Samantha Father Death: సమంత ఇంట్లో విషాదం... తండ్రిని కోల్పోయిన స్టార్ హీరోయిన్
సమంత ఇంట్లో విషాదం... తండ్రిని కోల్పోయిన స్టార్ హీరోయిన్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మురళి కృష్ణుడి అలంకారంలో  శ్రీప‌ద్మావ‌తి అమ్మవారునర్సుపై కొడవలితో దాడి, లవర్ పనే..! సీసీటీవీ వీడియోఊరి మీద విరుచుకుపడి ప్రాణాలు తీసేసిన పెద్దపులిISKCON Monk Chinmoy Krishna Das Arrest In Bangladesh | బంగ్లాదేశ్ లో మైనార్టీలపై హింసకు ఇదే నిదర్శనం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan: జనవరి నుంచి జగన్ జిల్లాల పర్యటన - కష్టపడేవారికే భవిష్యత్ - పార్టీ నేతలకు జగన్ సందేశం
జనవరి నుంచి జగన్ జిల్లాల పర్యటన - కష్టపడేవారికే భవిష్యత్ - పార్టీ నేతలకు జగన్ సందేశం
Team India: పాకిస్తాన్‌కు బిగ్ షాక్ - భారత జట్టు అక్కడికి వెళ్లేది లేదని విదేశాంగ శాఖ క్లారిటీ
పాకిస్తాన్‌కు బిగ్ షాక్ - భారత జట్టు అక్కడికి వెళ్లేది లేదని విదేశాంగ శాఖ క్లారిటీ
Realme V60 Pro: రూ.18 వేలలోనే 12 జీబీ ర్యామ్ + 256 జీబీ ఫోన్ - రియల్‌మీ వీ60ప్రో వచ్చేసింది!
రూ.18 వేలలోనే 12 జీబీ ర్యామ్ + 256 జీబీ ఫోన్ - రియల్‌మీ వీ60ప్రో వచ్చేసింది!
Samantha Father Death: సమంత ఇంట్లో విషాదం... తండ్రిని కోల్పోయిన స్టార్ హీరోయిన్
సమంత ఇంట్లో విషాదం... తండ్రిని కోల్పోయిన స్టార్ హీరోయిన్
Telangana News: ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త, వారికి సైతం సమానంగా చెల్లింపు
ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త, వారికి సైతం సమానంగా చెల్లింపు
Pawan Kalyan: తూర్పు తీరంలో దేశ భద్రతకు ముప్పు, ఉగ్రవాది కసబ్ ఎలా వచ్చాడు- పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
తూర్పు తీరంలో దేశ భద్రతకు ముప్పు, ఉగ్రవాది కసబ్ ఎలా వచ్చాడు- పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
Audi Q7 Facelift: ఆడీ క్యూ7 ఫేస్‌లిఫ్ట్ వచ్చేసింది - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
ఆడీ క్యూ7 ఫేస్‌లిఫ్ట్ వచ్చేసింది - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Kakinada Pawan Kalyan: కాంప్రమైజ్ అయిపోయారా - రైస్ స్మగ్లింగ్‌లో టీడీపీ ఎమ్మెల్యేపై పవన్ ఆగ్రహం - కాకినాడ పోర్టులో తనిఖీలు
కాంప్రమైజ్ అయిపోయారా - రైస్ స్మగ్లింగ్‌లో టీడీపీ ఎమ్మెల్యేపై పవన్ ఆగ్రహం - కాకినాడ పోర్టులో తనిఖీలు
Embed widget