Medaram Mini Jatara : వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 నుంచి 4 వరకు మేడారం మినీ జాతర
Medaram Mini Jatara : మేడారం మినీ జాతర తేదీలను పూజారుల సంఘం ఖరారు చేసింది. వచ్చే ఫిబ్రవరి 1 నుంచి 4 వరకు మినీ జాతర నిర్వహిస్తు్న్నట్లు ప్రకటించారు.
Medaram Mini Jatara : ములుగు జిల్లాలో మేడారం మినీ జాతర తేదీలను మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర పూజారుల సంఘం ఖరారు చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 4 వరకు మినీ జాతర నిర్వహిస్తున్నట్లు పూజారులు ప్రకటించారు. ఫిబ్రవరి 1న మండమెలిగే పండగ నిర్వహిస్తామని తెలిపారు. 2వ తేదీన సారలమ్మ అమ్మవారి గద్దె, 3వ తేదీన సమ్మక్క గద్దె శుద్ధి చేసి సమ్మక్క – సారలమ్మలకు భక్తులు మొక్కులు సమర్పించుకునేందుకు అనుమతిస్తామని చెప్పారు. మినీ మేడారం జాతరలో అమ్మవార్లను గద్దెలపైకి తీసుకురారు. గద్దెల వద్ద పూజారులు ప్రత్యేక పూజలు చేస్తారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేయనున్నారు. ప్రతి రెండేళ్లకోసారి మేడారం మహా జాతర నిర్వహిస్తారు.
ఏడాదిలో మేడారం మినీ జాతర
ములుగు జిల్లాలో జరిగే మేడారం జాతర ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందింది. అయితే తాడ్వాయి మండలంలోని మేడారం గ్రామంలో ఈ జాతర రెండేళ్లకొకసారి జరుగుతుంది. జాతర సమయంలో వనదేవతలు సమ్మక్క-సారలమ్మను పూజించేందుకు లక్షలాది భక్తులు ఇక్కడకు తరలివస్తారు. రెండేళ్లకొకసారి మేడారం మహా జాతరను జరుగుతుంది. అయితే మధ్యలో మేడారం మినీ జాతరను నిర్వహిస్తుంటారు. వచ్చే ఏడాది జరిగే మేడారం మినీ జాతర తేదీలను మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర పూజారుల సంఘం తాజాగా ప్రకటించింది.
సమ్మక్క సారలమ్మ గద్దెల శుద్ధి కార్యక్రమం
2023 ఫిబ్రవరి 1 నుంచి 4 వరకు మేడారం మినీ జాతర నిర్వహించనున్నట్టుగా పూజారుల సంఘం ప్రకటించింది. ఫిబ్రవరి 1న మండమెలిగే పండగ నిర్వహించనున్నామన్నారు. ఫిబ్రవరి 2న సారలమ్మ అమ్మవారి గద్దెను శుద్ధి చేస్తామన్నారు. ఫిబ్రవరి 3న సమ్మక్క అమ్మవారి గద్దె శుద్ధి చేస్తామన్నారు. అమ్మవార్ల గద్దెలను శుద్ధి చేసిన తర్వాత సమ్మక్క- సారలమ్మలకు భక్తులు మొక్కులు సమర్పించుకునేందుకు అనుమతిస్తామని పూజారులు తెలిపారు. మేడారం మహా జాతర సమయంలో అయితే సమ్మక్క-సారలమ్మ అమ్మవార్లను గద్దెలపైకి తీసుకొస్తారు. మేడారం మినీ జాతర సమయంలో అమ్మవార్లను గద్దెలపైకి తీసుకురారు. కానీ గద్దెల వద్ద పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
రెండేళ్లకొకసారి మహా జాతర
రెండేళ్లకోసారి మాఘశుద్ధ పూర్ణిమ రోజు ఆరంభమైన మేడారం జాతర నాలుగురోజుల పాటు జరుగుతుంది. గిరిజనేతరులకు మూడురోజుల వేడుకే అయినా అడవిబిడ్డలకు మాత్రం ఇది నెల రోజుల పండుగ. ఇక ఏ జాతర అయినా ఏటా జరుగుతుంటుంది. మరి మేడారం మాత్రం రెండేళ్లకోసారి ఎందకంటారా..దానికీ ఓ కారణం ఉంది. కొన్ని గిరిజన తెగలు 60 రోజులను నెలగా పరిగణిస్తారు. ఈ కారణంగానే జాతర రెండేళ్లకోసారి జరుగుతుందంటారు. దాదాపు ఎనిమిది శతాబ్దాలుగా గిరిజనులు, గిరిజనేతరులతో పూజలందుకుంటున్న సమ్మక్క, సారలమ్మలు కేవలం ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం అయినవారు కాదు. తెలుగు రాష్ట్రాలతో పాటూ ఒడిశా, చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన కోట్ల మంది భక్తులకు సమ్మక్క, సారలమ్మలు ఇలవేల్పులు.