అన్వేషించండి

Komatireddy-Modi Meeting: నిన్న ఖర్గేతో, రేపు మోదీతో కోమటిరెడ్డి భేటీ - వెంకట్ రెడ్డి ఏం చేయబోతున్నారు?

అగ్రనేతలను వరుసగా కలుస్తున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వారితో ఏం మంతనాలు జరుపుతున్నారని ఆసక్తికరంగా మారింది.

భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. అందుకోసం ఆయనకు ప్రధాని అపాయింట్‌మెంట్ నేడు ఖరారైంది. రేపు (డిసెంబరు 16) ఉదయం మోదీతో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమావేశం కానున్నారు. రేపు ఉదయం 11 గంటలకు ప్రధాన మంత్రి కార్యాలయానికి రావాలని పీఎంవో నుంచి కోమటిరెడ్డికి సమాచారం అందినట్లుగా తెలుస్తోంది. తన నియోజకవర్గం భువనగిరిలో అభివృద్ది పనులపై చర్చించడానికి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మోదీ అపాయింట్మెంట్ కోరారు. మోదీ కలిసే సందర్భంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరిన్ని కీలక అంశాలను ప్రధాని దృష్టికి తీసుకురానున్నట్లు తెలుస్తోంది.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాలుష్యం కారణంగా మూసీ నదీ పరివాహక ప్రాంతాలకు ఇబ్బంది కలుగుతోందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రధాని దృష్టికి తేనున్నట్లు సమాచారం. నమామి గంగ తరహాలో నమామి మూసీ కార్యక్రమాన్ని చేపట్టాలని ఆయన ప్రధానిని కోరతారని అంటున్నారు. మెట్రో, ఎంఎంటీఎస్‭కు సంబంధించి కూడా పలు అంశాలపై ప్రధానితో మాట్లాడే అవకాశం ఉంది. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై కూడా వీరి మధ్య చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే హైదరాబాద్, విజయవాడ హైవే గురించి కూడా వివిధ అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్నారు. 

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొద్ది నెలల క్రితమే బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఆ పరిణామంతో వచ్చిన మునుగోడు ఉప ఎన్నికలో రాజగోపాల్ రెడ్డి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో కోమటిరెడ్డి ప్రధానితో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఖర్గేతోనూ భేటీ
ఇటీవలే పీసీసీకి చెందిన కమిటీలను ఏఐసీసీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ కమిటీల్లో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఎలాంటి పదవి దక్కలేదు. కొన్నాళ్లుగా ముఖ్యంగా తమ్ముడు బీజేపీలో చేరిన నాటి నుంచి కోమటిరెడ్డి అంటీముట్టనట్లుగా ఉంటున్న సంగతి తెలిసిందే. మునుగోడు ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సహకారం అందించలేదు. పైగా పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరించారని కాంగ్రెస్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దానిపై ఆయన వివరణ కూడా ఇచ్చుకున్నారు. తర్వాత ఇటీవల పీసీసీ కమిటీల్లో ఆయనకు చోటు దక్కలేదు. ఈ క్రమంలో ఎంపీ కోమటిరెడ్డి నిన్న (డిసెంబరు 14) ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేను కలిశారు.

తెలంగాణలో రాజకీయ పరిస్థితులు, సీనియర్లు పార్టీని వీడుతుండడంపై తాను ఖర్గేతో చర్చించానని, ఖర్గే అంతా విన్నారని ఆయన్ని కలిశాక వెంకట్ రెడ్డి ట్వీట్ చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ లో త్వరలోనే అన్నీ సర్దుకుంటాయని చెప్పారని అన్నారు. కీలక విషయాల్లో కూడా రేవంత్ రెడ్డి పార్టీ సీనియర్ల అభిప్రాయాలు తీసుకోవడం లేదని ఖర్గేకు కోమటిరెడ్డి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అయితే, ఆ విషయాలు విన్న అనంతరం తాను త్వరలోనే తెలంగాణ నేతలతో సమావేశం అవుతానని హామీ ఇచ్చినట్లుగా తెలిసింది.

మొత్తానికి అగ్రనేతలను వరుసగా కలుస్తున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వారితో ఏం మంతనాలు జరుపుతున్నారని ఆసక్తికరంగా మారింది.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: విద్యార్థిని శివాని ఆత్మహత్య చాలా బాధాకరం: ఏపీ సీఎం చంద్రబాబు
విద్యార్థిని శివాని ఆత్మహత్య చాలా బాధాకరం: ఏపీ సీఎం చంద్రబాబు
Hyderabad Drugs Case: అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు
అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు
KTR Legal Notice Strategy on Revanth Reddy: కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
Gen Z Protest: భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tenth Class Student Death: సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
Anti Paper Leak Bill: లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి.. సభ 2 గంటలకు వాయిదా
లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి.. సభ 2 గంటలకు వాయిదా
Hyderabad Drugs Case: అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు
అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు
KTR Legal Notice Strategy on Revanth Reddy: కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
Polimera 3 : పొలిమేర 3లో యాక్షన్ కింగ్ ఎంట్రీ - హారర్ థ్రిల్లర్‌లో ఆయన రోల్ ఏంటి?
పొలిమేర 3లో యాక్షన్ కింగ్ ఎంట్రీ - హారర్ థ్రిల్లర్‌లో ఆయన రోల్ ఏంటి?
Gen Z Protest: భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
Monsoon Laundry Hacks : వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు
వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు
హైవే మీద, నగరంలోనూ అదరహో! MG Windsor EV 15,000 15,000km లాంగ్ టర్మ్ రివ్యూ
లాంగ్‌టర్మ్‌లో MG Windsor EV ఎలా ఉంది? 15,000km సుదీర్ఘ ప్రయాణంలో బయటపడిన నిజాలు
Embed widget