Secunderabad Railway Station: రూ.719 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి - ఆధునీకరణ పనులతో 2 రోజులు ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు
Hyderabad News: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ, మెయింటెనెన్స్ పనుల కారణంగా ఈ నెల 25, 26 తేదీల్లో పలు ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.
MMTS Trains Cancelled Due To Station Development: రైల్వే ప్రయాణికులకు అలర్ట్. హైదరాబాద్ (Hyderabad) నగరంలో పలు రూట్లలో నడిచే ఎంఎంటీఎస్ (MMTS) రైళ్లను ఈ నెల 25 (శనివారం), 26 (ఆదివారం) తేదీల్లో రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) ప్రకటించింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు సంబంధించి ఆధునీకరణ, ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం వంటి పనులతో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో సికింద్రాబాద్ - ఫలక్‌నుమా, మేడ్చల్ - సికింద్రాబాద్, లింగంపల్లి - మేడ్చల్, హైదరాబాద్ - మేడ్చల్ మధ్య సేవలందించే 22 ఎంఎంటీఎస్ సర్వీసులతో పాటు సిద్ధిపేట - సికింద్రాబాద్ మధ్య సర్వీసులందించే 4 డెమో రైళ్లను కూడా రద్దు చేస్తున్నట్లు చీఫ్ పీఆర్వో సీహెచ్.రాకేశ్ తెలిపారు. కొన్ని సర్వీసులు ఒక్క రోజు రద్దు చేయగా.. మరికొన్ని రెండు రోజులు రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. మొత్తంగా 26 సర్వీసులు రద్దయ్యాయి. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని అన్నారు.
Cancellation of few MMTS & DEMU Trains due to Secunderabad Station Re-development Works on 25th and 26th May, 2024. pic.twitter.com/P2P33ekGwA
— South Central Railway (@SCRailwayIndia) May 24, 2024
రూ.719 కోట్లతో అభివృద్ధి పనులు
కాగా, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులకు గతేడాదిలోనే శంకుస్థాపన జరగ్గా.. మొత్తం రూ.719 కోట్లతో పనులు చేపట్టారు. విమానాశ్రయ తరహాలోనే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ భావిస్తోన్న రైల్వే శాఖ అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో పునఃనిర్మాణ పనులు చేపట్టనున్నారు. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోనే అత్యుత్తమ రైల్వే స్టేషన్‌గా దీన్ని అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రచిస్తున్నారు. స్టేషన్‌లో అన్ని సౌకర్యాలు ఉండేలా చూడడం సహా.. మల్టీ మోడల్ కనెక్టివిటీతో పాటు ప్రయాణికులు సులభంగా రాకపోకలు జరిపేలా నిర్మాణాలు చేపడుతున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు మూడేళ్లలో పూర్తి చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఉండగా.. మరో రెండేళ్ల పనులన్నీ పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మెట్రో టైమింగ్స్ లో మార్పు
అటు, ప్రయాణికుల సౌలభ్యం దృష్ట్యా హైదరాబాద్ మెట్రో రైలు టైమింగ్స్‌లో స్వల్ప మార్పులు చేశారు. రైలు నడిచే వేళలు పొడిగించాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉన్నందున ఆ దిశగా హెచ్ఎంఆర్ఎల్ (హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్) చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రతి శుక్రవారం రాత్రి 11.45 గంటల వరకు సర్వీసులు పొడిగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు ఫేస్ బుక్, ఎక్స్ హ్యాండిల్స్‌లో ప్రకటన చేశారు. ప్రతి శుక్రవారం రాత్రి 11.45 గంటల వరకు, ప్రతి సోమవారం ఉదయం 5.30 గంటల నుంచే రైళ్లు మొదలవుతాయని ఇటీవల ప్రచారం సాగింది. అయితే, ఆ ప్రచారం నిజం కాదని ఆ దిశగా ట్రయల్ చేస్తున్నట్లు అధికారులు వివరణ ఇచ్చారు. మెట్రో రైళ్లకు ఆ సమయాల్లో ఉన్న ఆదరణ, ప్రయాణికుల రద్దీ, ట్రాక్ నిర్వహణ, కోచ్‌ల మెయింటెనెన్స్ వంటి ఇతర విషయాలను కూడా పరిగణనలో ఉంచుకొని నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఈ క్రమంలో తాజాగా, శుక్రవారం రాత్రి సర్వీస్ టైం పొడిగించారు.
Never miss out on weekend plans again! With Hyderabad Metro's extended service hours till 11:45 PM on Fridays, late meetings and traffic jams won't stand in your way. Pack your bags and hop on board! #landtmetro #mycitymymetromypride #metroride #publictransport #extendedservices pic.twitter.com/ZdbMXoPOiS
— L&T Hyderabad Metro Rail (@ltmhyd) May 24, 2024
Also Read: Hyderabad News: జూన్ 27 నుంచి ఎంసెట్ కౌన్సెలింగ్- హైదరాబాద్‌లోని టాప్ కాలేజీలు, కోర్సులు ఇవే