అన్వేషించండి

KTR On Vizag Steel: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపండి - కేంద్రానికి TS మంత్రి కేటీఆర్ లేఖ

వర్కింగ్ కాపిటల్ నెపంతో కార్పొరేట్ల చేతికి స్టీల్ ప్లాంట్ తాళాలుకేంద్రం కొత్త కుట్ర చేస్తుందంటూ కేటీఆర్ సుదీర్ఘ, సవివరణ లేఖ

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కుట్రలు ఆపాలంటూ మంత్రి కేటీఆర్‌ కేంద్రానికి లేఖాస్త్రం సంధించారు. కార్పొరేట్ మిత్రులకు కట్టబెట్టే పన్నాగాలు మానుకోవాలంటూ కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. వర్కింగ్ కాపిటల్, ముడిసరుకు కోసం నిధుల సమీకరణ పేరిట స్టీల్ ప్లాంట్ తాళాలను ప్రైవేట్ కంపెనీలకు  అప్పజెప్పేందుకు కేంద్రం కొత్త కుట్ర చేస్తుందన్న కేటీఆర్ లేఖలో ఆరోపించారు. తన కార్పొరేట్ మిత్రులకు 12.5 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసిన ప్రధానమంత్రి మోదీకి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ పట్ల ఇదే ఔదార్యం ఎందుకు లేదని కేటీఆర్ ప్రశ్నించారు. కేంద్రమే వర్కింగ్ కాపిటల్ కోసం ఆర్థిక సహాయం అందించి వైజాగ్ స్టీల్ నుంచి స్టీల్ ఉత్పత్తులు కొనాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా విస్తరణ ప్రణాళికల్లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ వీలీనాన్ని పరిశీలించాలని లేఖలో కోరారు. కేంద్ర ప్రభుత్వమే తక్షణం వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి అవసరమైన రూ. 5వేల కోట్ల రూపాయలను వేంటనే కేటాయించాలని డిమాండ్‌ చేశారు.

వైజాగ్ ఉక్కు తెలుగు వారి హక్కు

గతంలో పీవీ నరసింహారావు, అటల్ బిహారీ వాజ్ పేయ్  ప్రధానులుగా ఉన్నప్పుడు ఇచ్చిన నిధులను వైజాగ్ స్టీల్ ప్లాంట్ వడ్డీతో సహా తిరిగి ఇచ్చిందని మంత్రి కేటీఆర్ లేఖలో గుర్తుచేశారు. లక్షన్నర కోట్ల రూపాయల విలువ కలిగిన స్టీల్ ప్లాంట్ ను అప్పణంగా ప్రవేట్ పరం చేసే కుట్రలను కేంద్రం ఆపాలని డిమాండ్ చేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం విడుదల చేసిన ఎక్స్‌ ప్రెషన్‌ ఆఫ్ ఇంట్రస్ట్ లో చేసుకోబోయే ఒప్పందం విషయంలో ఎలాంటి నిర్దిష్ట నిబంధనలు లేవన్నారు కేటీఆర్. ముడి సరుకులకు మూలధనం పేరిట స్టీల్ ప్లాంట్ ని తమ అనుకూల ప్రైవేట్ కంపెనీలకు అప్పజెప్పే కుట్రే అని మండిపడ్డారు. వైజాగ్ ఉక్కు తెలుగు వారి హక్కు… దీని కాపాడుకోవడం తెలుగువారి బాధ్యత అని లేఖలో పేర్కొన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రయత్నాలను బీఆర్‌ఎస్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది కేటీఆర్ స్పష్టం చేశారు.  కార్మిక సంఘాలకు సంఘీభావం తెలపాలని ఆంధ్రప్రదేశ్ బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు  తోట చంద్రశేఖర్ కి కేటీఆర్ సూచించారు. కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా చేస్తున్న ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాలను ఆపేందుకు లక్షలాది PSUల కార్మికులు BRSతో కలిసి రావాలని కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు.  

ప్లాంటుని నష్టాల్లోకి నెట్టాలన్నదే కేంద్ర ప్రభుత్వ కుట్ర

మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పేరిట గతిశక్తి వంటి కార్యక్రమాలతో ముడిపెట్టి కేంద్రం గొప్పలు చెప్పుకుంటోందని కానీ మౌలిక వసతుల ప్రాజెక్టులకు అత్యంత కీలకమైన స్టీల్ ఉత్పత్తిని పూర్తిగా ప్రైవేటుపరం చేయాలని చూడడం కేంద్ర ప్రభుత్వ నిబద్ధత లోపాన్ని తేటతెల్లం చేస్తుందని కేటీఆర్‌ లేఖలో స్పష్టంచేశారు. స్టీల్ ఉత్పత్తి రంగాన్ని నాన్ స్ట్రాటజిక్ రంగంలోకి మార్చడంలోనే కేంద్ర ప్రభుత్వం కుట్ర దాగి ఉన్నదన్నారు. అందులో భాగంగానే స్టీల్ ప్లాంట్ కు అవసరమైన ప్రత్యేక ఐరన్ వోర్ గనులను కేటాయించకుండా కేంద్రం మోకాలడ్డిందని తెలిపారు. దీంతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ తన ఉత్పత్తి ఖర్చులో 60% వరకు పూర్తిగా ముడి సరుకు పైనే ఖర్చు చేయాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ మార్కెట్లో ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలతో  ఉత్పత్తి విషయంలో పోటీపడటంలో కొత్త సవాళ్లను ఎదుర్కొంటోందని, మార్కెట్లో వాటితో సమాన ధరకు అమ్మాల్సి రావడంతో నష్టాలను ఎదుర్కొంటుందన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను అంతిమంగా నష్టాల్లోకి నెట్టాలన్న కేంద్ర ప్రభుత్వ కుట్ర ఇందులో స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు.

దేశ మౌళిక రంగానికి అవసరమైన స్టీల్ సరఫరా ప్రయివేట్ చేతుల్లోనా?

ఇప్పటికైనా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు వర్కింగ్ కాపిటల్ పేరుతో ప్రైవేట్ కంపెనీలతో కలిపే ప్రయత్నాన్ని పూర్తిగా విరమించుకోవాలని కేటీఆర్‌ లేఖలో సూచించారు. దీని బదులు కేంద్ర ప్రభుత్వమే అందుబాటులో ఉన్న ఇతర మార్గాల ద్వారా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను బలోపేతం చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా దాదాపు లక్ష కోట్ల రూపాయలతో తన విస్తరణ ప్రణాళికలను ప్రకటించిందని చెప్పారు. లక్ష కోట్ల రూపాయలతో గ్రీన్ ఫీల్డ్ లో భారీ విస్తృత ప్రణాళిక ప్రకటించిన ఈ సంస్థను  వైజాగ్ స్టీల్ ప్లాంట్ తో కలపవచ్చని సూచించారు. దీంతో తక్కువ ధరకి ప్రైవేట్ సంస్ధలకు అమ్మడం కంటే కేంద్ర ప్రభుత్వమే ఇంకో ప్రభుత్వ రంగ సంస్థతో కలపడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయన్నారు. సేయిల్ సంస్థ విస్తరణ లక్ష్యానికి కూడా ఇది ఎంతగానో దోహదం చేస్తుందన్నారు. సేయిల్ సంస్థ ఈ దిశగా ముందుకు వస్తే తెలంగాణ ప్రభుత్వం ఎన్నాళ్లుగానో డిమాండ్ చేస్తున్న బయ్యారం స్టీల్ ప్లాంట్ తో పాటు కడపలోను మరో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన ఇకో సిస్టం ఏర్పడుతుందన్నారు. పైగా దేశ మౌళిక రంగానికి అవసరమైన స్టీల్ సరఫరా భద్రత ప్రయివేట్ కంపెనీల దాయాదాక్షిణ్యాల మీద అధారపడాల్సిన అవసరం ఉండదని సూచించారు.

దేశానికి ఎలాంటి సందేశం ఇస్తున్నారో బీజేపీ చెప్పాలి

మోదీ ప్రభుత్వం ఏర్పడిన తొలిరోజు నుంచే భారతీయ జనతా పార్టీ, ప్రభుత్వ రంగ సంస్థలను అప్పనంగా అమ్మివేయడమే ఏకైక ఎజెండాగా పనిచేస్తుందని కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. ఇప్పటికే పదుల సంఖ్యలో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేసి జాతికి తీరని నష్టాన్ని కలిగించిందన్నారు. ఒకప్పుడు దేశ అభివృద్ధిలో అత్యంత కీలకంగా వ్యవహరించిన ప్రభుత్వ రంగ సంస్థలను, కేవలం నష్టాలను సాకుగా చూపించి ప్రైవేట్ పరం చేస్తున్న ప్రధానమంత్రి మోడీ, ప్రస్తుతం లాభాలతో నడుస్తున్న నవరత్నాలాంటి కంపెనీలను కూడా అమ్మేసే కుట్రలకు తెగబడుతున్నారన్నారు. లాభాలను ప్రవేట్ పరం చేస్తూ, నష్టాలను జాతీయం చేస్తున్నారని ప్రధానమంత్రి మోడీ వ్యవహరిస్తున్నారన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను బలహీనం చేస్తూ దేశానికి ఎలాంటి సందేశం ఇస్తున్నారో కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ స్పష్టం చేయాలన్నారు. 

వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులతో కలిసి నడిచేందుకు BRS సిద్ధం

భారత్ రాష్ట్ర సమితి ఒక పార్టీగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను కాపాడాలన్న చిత్తశుద్ది తమకు ఉన్నదని మంత్రి స్పష్టంచేశారు. కేంద్ర ప్రభుత్వం కచ్చితంగా తమ అనుకూల ప్రైవేట్ కంపెనీకి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని అప్పజెప్పాలన్న కుట్రను చేస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు. దీన్ని ఎదుర్కొని వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులు, ఉద్యోగాల భవిష్యత్తును కాపాడాలన్న ఏకైక లక్ష్యంతో వారితో కలిసి పని చేసేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఇందుకోసం కలిసి వచ్చే శక్తులు, ప్రజాసంఘాలు, పార్టీలతో కలసి  ప్రజలను మరింత చైతన్యవంతం చేస్తామన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ తెలుగు ప్రజల హక్కు అని, దాన్ని కాపాడుకోవడం కోసం తెలుగువారందరు కలిసి రావడం అవసరమని భావిస్తున్నామన్నారు.  ఎన్నో త్యాగాలు, పోరాటాలతో ఏర్పాటైన వైజాగ్ స్టీల్ ప్లాంట్ కేవలం కొన్ని స్వార్థపూరిత శక్తులు, వారి ఎజెండాలకు బలి కావొద్దని, ఎట్టిపరిస్థితుల్లో దాన్ని అంగీకరించబోమని మంత్రి స్పష్టం చేశారు. ఇదొక్కటే కాదు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, BSNL, సింగరేణి వంటి ఇతర పబ్లిక్ సెక్టార్ రంగ సంస్థలు కూడా అంతిమంగా ప్రవేట్ కంపెనీల చేతులలోకి పోయేలా కేంద్రం ప్రయత్నాలు చేస్తుందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు, లక్షలాదిమంది కార్మికుల శ్రేయస్సు కోసం వారితో కలిసి నడిచేందుకు భారత రాష్ట్ర సమితి సిద్ధంగా ఉంటుందని, ఈ దిశగా తమతో కలిసి రావాలని ప్రభుత్వ రంగ సంస్థల కార్మికులకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం లేపిన ఈ సరికొత్త కుట్రను ఎదుర్కొనేందుకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులు, కార్మిక సంఘాలను కలిసి వారికి సంఘీభావం తెలియజేయాలని ఆంధ్రప్రదేశ్ భారత రాష్ట్ర సమితి శాఖ అధ్యక్షులు తోట చంద్రశేఖర్ కు కేటీఆర్ సూచించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

South Costal Politics: వైసీపీ కోటలో టీడీపీ పాగా వేసేనా..? రెడ్డిరాజ్యంలో పట్టు నిలుపుకునేదెవరో..?
వైసీపీ కోటలో టీడీపీ పాగా వేసేనా..? రెడ్డిరాజ్యంలో పట్టు నిలుపుకునేదెవరో..?
RS Praveen Kumar: బీఆర్ఎస్‌లోకి RS ప్రవీణ్, కండువా కప్పిన కేసీఆర్, 80 మంది బీఎస్పీ నేతలు కూడా
బీఆర్ఎస్‌లోకి RS ప్రవీణ్, కండువా కప్పిన కేసీఆర్, 80 మంది బీఎస్పీ నేతలు కూడా
Rajamouli Emotional Post: RRR రీ రిలీజ్, జపాన్‌లో రాజమౌళికి ఘన స్వాగతం - ఈ 83 ఏళ్ల బామ్మ చేసిన పనికి జక్కన్న ఫిదా
RRR రీ రిలీజ్, జపాన్‌లో రాజమౌళికి ఘన స్వాగతం - ఈ 83 ఏళ్ల బామ్మ చేసిన పనికి జక్కన్న ఫిదా
Mohan Babu Birthday: 'కలెక్షన్‌ కింగ్‌' మోహన్‌ బాబు బర్త్‌డే - ఇప్పటి వరకు ఆయన నటించిన సినిమాలెన్నో తెలుసా?
'కలెక్షన్‌ కింగ్‌' మోహన్‌ బాబు బర్త్‌డే - ఇప్పటి వరకు ఆయన నటించిన సినిమాలెన్నో తెలుసా?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

SS Rajamouli RRR Japan Visit | జపాన్ RRR స్పెషల్ షో లో రాజమౌళి సందడి | ABP DesamMohan Babu Birthday Celebrations | తండ్రి పుట్టినరోజు వేడుకల్లో భార్యతో కలిసి మంచు మనోజ్ | ABP DesamAP Volunteers YSRCP Campaign in Visakha | విశాఖపట్నంలో వాలంటీర్లతో వైసీపీ ఎన్నికల ప్రచారం |ABP DesamAR Rahman The Goat Life Interview | మళ్లీ Oscar తెచ్చేపనిలో AR Rahman | Prithviraj Sukumaran | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
South Costal Politics: వైసీపీ కోటలో టీడీపీ పాగా వేసేనా..? రెడ్డిరాజ్యంలో పట్టు నిలుపుకునేదెవరో..?
వైసీపీ కోటలో టీడీపీ పాగా వేసేనా..? రెడ్డిరాజ్యంలో పట్టు నిలుపుకునేదెవరో..?
RS Praveen Kumar: బీఆర్ఎస్‌లోకి RS ప్రవీణ్, కండువా కప్పిన కేసీఆర్, 80 మంది బీఎస్పీ నేతలు కూడా
బీఆర్ఎస్‌లోకి RS ప్రవీణ్, కండువా కప్పిన కేసీఆర్, 80 మంది బీఎస్పీ నేతలు కూడా
Rajamouli Emotional Post: RRR రీ రిలీజ్, జపాన్‌లో రాజమౌళికి ఘన స్వాగతం - ఈ 83 ఏళ్ల బామ్మ చేసిన పనికి జక్కన్న ఫిదా
RRR రీ రిలీజ్, జపాన్‌లో రాజమౌళికి ఘన స్వాగతం - ఈ 83 ఏళ్ల బామ్మ చేసిన పనికి జక్కన్న ఫిదా
Mohan Babu Birthday: 'కలెక్షన్‌ కింగ్‌' మోహన్‌ బాబు బర్త్‌డే - ఇప్పటి వరకు ఆయన నటించిన సినిమాలెన్నో తెలుసా?
'కలెక్షన్‌ కింగ్‌' మోహన్‌ బాబు బర్త్‌డే - ఇప్పటి వరకు ఆయన నటించిన సినిమాలెన్నో తెలుసా?
Weather Latest Update: నేడు ఇక్కడ భారీ వర్ష సూచన! వడగండ్లతో ఆరెంజ్ అలర్ట్ - ఐఎండీ హెచ్చరిక
నేడు ఇక్కడ భారీ వర్ష సూచన! వడగండ్లతో ఆరెంజ్ అలర్ట్ - ఐఎండీ హెచ్చరిక
Mynampally Vs Malla Reddy: మైనంపల్లి రోహిత్ మాస్ వార్నింగ్ - కౌంటర్ ఇచ్చిన మల్లారెడ్డి కుమారుడు
మైనంపల్లి రోహిత్ మాస్ వార్నింగ్ - కౌంటర్ ఇచ్చిన మల్లారెడ్డి కుమారుడు
Infosys Narayana Murthy: మనవడికి ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి ఖరీదైన గిఫ్ట్, విలువ ఎంతో తెలుసా!
మనవడికి ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి ఖరీదైన గిఫ్ట్, విలువ ఎన్ని వందల కోట్లో తెలుసా!
Volkswagen ID.3 GTx Launch: కొత్త ఎలక్ట్రిక్ కారు లాంచ్ చేసిన ఫోక్స్‌వాగన్ - మరి మనదేశంలో?
కొత్త ఎలక్ట్రిక్ కారు లాంచ్ చేసిన ఫోక్స్‌వాగన్ - మరి మనదేశంలో?
Embed widget