Konda Surekha: నిన్నటి నుంచి భోజనం చేయలేదు, కేటీఆర్ నీ చెల్లికి అయితే ఊరుకుంటావా! మంత్రి కొండా సురేఖ కన్నీళ్లు
Konda Surekha Fires On KTR : కొండా సురేఖ మీడియా సాక్షిగా కన్నీళ్లు పెట్టుకున్నారు. అంతే కాకుండా.. తాను. అన్నం తినలేదని, నిద్రపోలేదన్నారు. అదే విధంగా ట్రోలింగ్ లపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
Konda Surekha : కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, రాష్ట్ర మంత్రి మంత్రి కొండా సురేఖ మీడియా సమావేశంలోనే కన్నీళ్లు పెట్టుకున్నారు. సోషల్ మీడియాలో ట్రోలింగ్‌పై ఆమె స్పందించారు. సోమవారం గాంధీ భవన్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఒక మహిళా మంత్రి ఫోటోలను అసభ్యకర రీతిలో పోస్ట్ చేయడాన్ని ఆమె ఖండించారు. ఒక మహిళను అవమానిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం సమంజసం కాదని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్(BRS) సోషల్ మీడియా శ్రేణులు దారుణమైన పోస్టులు పెట్టారని ఆరోపించారు. అధికారం పోయిందన్న బాధలో బీఆర్ఎస్ నేతలు ఏం చేస్తున్నారో వారికే తెలియడం లేదని విమర్శించారు. ఆ పార్టీ మహిళా నాయకురాలు ఎమ్మెల్సీ కవిత పట్ల ఇలాంటి ట్రోలింగ్, కామెంట్లు చేస్తే ఊరుకుంటారా? అని ప్రశ్నించారు. డబ్బులు ఇచ్చి మరీ ట్రోలింగ్ చేయిస్తున్నారని భావోద్వేగానికి లోనయ్యారు.
అసలేమైంది అంటే
ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో బీజేపీ నేత, మెదక్ ఎంపీ దుబ్బాక రఘునందన్ రావు.. మంత్రి కొండా సురేఖ మెడలో నూలు దండ వేశారు. రఘునందన్ రావు.. కొండా సురేఖ మెడలో నూలు దండ వేయడంపై బీఆర్ఎస్ నేతలు కొందరు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేశారు. ఈ ఘటన పై ఇవాళ ఆమె గాంధీభవన్(Gandhi Bhavan)లో మీడియాతో మాట్లాడుతూ.. మెడలో నూలు దండ వేస్తే చిల్లర కామెంట్లు చేస్తారా అన్నారు.. సోషల్ మీడియా కామెంట్లతో నిన్నటి నుండి ఆవేదనతో ఉన్నా.. అన్నం కూడా తినలేదన్నారు. మహిళనని చూడకుండా పశువుల కంటే హీనంగా బీఆర్ఎస్ నేతలు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని ఆవేదన చెందారు
ఎంతో బాధించింది
ఈ ఘటన పట్ల తన మనస్సును ఎంతో కలిచి వేసిందని .. కొండా సురేఖ మీడియా సాక్షిగా కన్నీళ్లు పెట్టుకున్నారు. అంతే కాకుండా.. తాను. అన్నం తినలేదని, నిద్రపోలేదన్నారు. అదే విధంగా ట్రోలింగ్ లపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ‘‘నీకు ఓ చెల్లి ఉంది కదా.. ఆమె జైలుకు వెళ్లినప్పుడు మేం ఇలాగే ట్రోల్ చేశామా’’ అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మండిపడ్డారు. మహిళలంటే కేటీఆర్(KTR)కు మొదటి నుంచి చులకని అని.. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు తనను ఇలాగే అగౌరపరిస్తే ఆ పార్టీ నుండి బయటకు వచ్చానని చెప్పుకొచ్చారు. కేటీఆర్ ఖబర్దార్ ఇకపై సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఊరుకునేది లేదంటూ వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియాలో ట్రోలింగ్‌పై సైబర్ క్రైమ్(Cyber Crime) అధికారులకు ఫిర్యాదు చేశామని.. ఇకపై ట్రోలింగ్ చేస్తే సహించేది లేదన్నారు. అన్ని పార్టీల వాళ్లు నన్ను అక్కా అని, నా భర్తను బావ అని పిలుస్తారన్నారు. ఏదో ఒక రోజు ప్రజలు తిరగబడుతారని, చేనేత కార్మికుల ఓట్లతో గెలిచి పద్మశాలి బిడ్డను ఇంత అవమనపరుస్తారా? అని బీఆర్ఎస్(BRS) పై మండిపడ్డారు.
Read Also : కేసీఆర్ ఫ్యామిలీ కూడా బాధితులే, ఆ బాధలు మాకంటే ఎవరికి బాగా తెలుసు: కేటీఆర్
అందుకే మంత్రి పదవి ఇవ్వలేదు
తనకు.. మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తుందనే కేసీఆర్ మహిళకు మంత్రి పదవి ఇవ్వలేదన్నాడు. రెండో సారి అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ లో భారీ మార్పులు వచ్చాయని, బీఆర్ఎస్ నాయకులు డబ్బు మధం ఎక్కి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారన్నారు. కేటీఆర్, హరీశ్ ఇంటి ఆడవాళ్లపై ట్రోల్ చేస్తే ఎలా ఉంటుందని గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ భార్యకు.. తాను సూటిగా ఒక ప్రశ్నవేస్తున్నానని..ఈ ఫోటోలో తప్పు ఏముందో చెప్పాలన్నారు లేకపోతే.. కేసీఆర్ ను ఉరికిస్తామని కొండా సురేఖ ఫైర్ అయ్యారు. అసభ్య కరమైన పోస్టులపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదుచేసినట్లు తెలిపారు. ఈ ట్రోలింగ్ పై రఘునందన్ రావు.. నాకు ఫోన్ చేసి అక్క క్షమించండి...మీరు నాకు పెద్ద అక్క లాంటి వాళ్లు అని అన్నారు..కేటీఆర్ నీకు సిగ్గు లజ్జ ఉందా.. చేనేత కళను నువ్వు అవమానిoచావంటూ మండిపడ్డారు. గతంలో సీతక్కను, పొన్నం ప్రభాకర్ ను, మేయర్ ను కూడా ట్రోల్ చేశారని గుర్తు చేశారు. ఇలాంటివి మళ్ళీ జరిగితే మా కార్యకర్తలు నీ బట్టలు విప్పించి కొడతారంటూ వార్నింగ్ ఇచ్చారు. తనపై ట్రోలింగ్ చేసిన వ్యక్తి.. డీపీ హరీశ్ రావు ఫోటో ఉంది కనుక హరీశ్ రావు, కేటీఆర్ క్షమాపణ చెప్పాలన్నారు.
Shameless b@stards!
— Darshni Reddy (@angrybirdtweetz) September 30, 2024
Thu me bathukulu. Em chillara party ra meedi @BRSparty 💦💦
pic.twitter.com/wnO54OcKsD