అన్వేషించండి

Minister Harish Rao: 80 వేల మందికి త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగాలు, ఆరోగ్యశాఖలోనే దాదాపు 10 వేలు: హరీష్‌

Minister Harish Rao: రాష్ట్రంలో 80 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు శ్రీకారం చుట్టామని మంత్రి హరీష్ రావు తెలిపారు. ఒక్క ఆరోగ్య శాఖలోనే 9,222 పోస్టులకు నోటిఫికేషన్ వేయబోతున్నట్లు వివరించారు. 

Minister Harish Rao: వైద్యరంగంలో అత్యంత పారదర్శకంగా నియామకాలు జరుగుతున్నాయని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. కొత్తగా ఎంపికైన 1061 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు మంత్రి హరీష్ రావు నియామక పత్రాలను అందజేశారు. శిల్పకళా వేదికలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వైద్య విద్యలో దేశంలోనే ఇది ఒక రికార్డు అని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 80 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టామని అన్నారు. 1931 మంది ఆయుష్ కాంట్రాక్టు సిబ్బందిని క్రమబద్ధీకరించినట్లు స్పష్టం చేశారు. అలాగే ప్రత్యేక తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి 22 వేల 263 మందికి ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు ఇచ్చినట్లు తెలిపారు. మరో 9 వేల 222 పోస్టులకు రెండు నెలల్లో నోటిఫికేషన్ ఇస్తామన్నారు. ఎవరైనా ప్రమాదాలకు గురైనా, అనారోగ్యానికి గురైనా వారిని కాపాడే శక్తి కేవలం వైద్యులకు మాత్రమే ఉందని మంత్రి హరీష్ రావు అన్నారు. వైద్యులు సమాజానికి మంచి సేవలు అందించాలని కోరారు. 

వచ్చే నెల నుంచి టీ డయాగ్నస్టిక్స్ లో 134 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ప్రస్తుతం 54 పరీక్షలు మాత్రమే అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రానికి ఒక ఎయిమ్స్ ఇచ్చింనందుకు బీజేపీ నేతలు తెగ సంబరపడిపోయి.. లేని పోని ఆర్భాటాలు చేశారన్నారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఒకే ఏడాదిలో తొమ్మిది కళాశాలలు ఏర్పాటు చేసింది. ఒక్కో మెడికల్ కళాశాలకు సుమారు రూ.500 కోట్లు ఖర్చు పెడుతున్నామన్నారు. ప్రతి లక్ష మందికి 22 ఎంబీబీఎస్ సీట్లతో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని అన్నారు. 

నిమ్స్ దవాఖాన నూతన భవనానికి త్వరలోనే శంకుస్థాపన

నిమ్స్‌ దవాఖాన విస్తరణలో భాగంగా నిర్మించబోతున్న 2వేల పడకల నూతన భవనానికి త్వరలో సీఎం కేసీఆర్‌ భూమిపూజ చేస్తారని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌ రావు వెల్లడించారు. ఈ మేరకు త్వరగా అన్ని ఏర్పాట్లు చేయాలని, అవసరమైన అన్ని విభాగాల అనుమతులు పూర్తి చేయాలని ఇటీవలే అధికారులను ఆదేశించారు. మంత్రి హరీశ్‌ రావు డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖ ఉన్నత అధికారులతో తొలి సారి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన భవనంలో ఓపీ, ఐపీ, ఎమర్జెన్సీ సేవలకు ప్రత్యేకంగా బ్లాకులు ఉంటాయన్నారు.

3, 500 పడకలతో నిమ్స్ ఆస్పత్రి నూతన భవన నిర్మాణం

భవనం మొత్తం ఎనిమిది అంతస్తులుగా ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం నిమ్స్‌లో 1500 పడకలు ఉన్నాయని, నూతన భవనం పూర్తయితే పడకల సంఖ్య 3,500కు చేరుతుందన్నారు. ఇటీవల భూమి పూజ చేసుకున్న సూపర్‌ స్పెషాలిటీ ఎంసీహెచ్‌ కూడా పూర్తయితే మరో 200 పడకలు అదనంగా అందుబాటులోకి వస్తాయని చెప్పారు. తద్వారా ఒక నిమ్స్‌లోనే 3,700 పడకలు ఉంటాయని చెప్పారు. నిమ్స్‌ ఎంసీహెచ్‌ పనులు వేగవంతం చేయాలని అన్నారు. పెరుగుతున్న జనాభా, అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్‌ నలువైపులా ఒక్కొక్కటి వెయ్యి పడకలు కలిగి ఉండే టిమ్స్‌ దవాఖానలతోపాటు నిమ్స్‌ విస్తరణకు సీఎం కేసీఆర్‌ శ్రీకారం చుట్టినట్లు గుర్తు చేశారు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget