అన్వేషించండి

Minister Harish Rao: ఇన్ఫెక్షన్ నియంత్రణకు ప్రతీ ఆస్పత్రిలో కమిటీ ఏర్పాటు: హరీష్ రావు

Minister Harish Rao: ప్రతీ ఆస్పత్రిలో మూడంచెల విధానంలో ఇన్ఫెక్షన్ కంట్రోల్ కమిటీ ఏర్పాటు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్రం నిర్ణయం తీసుకుందని మంత్రి హరీష్ రావు కామెంట్లు చేశారు.

Minister Harish Rao: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రుల్లో మూడంచెల విధానంలో ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. ప్రతి ఆస్పత్రిలో సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో ఇన్ఫెక్షన్ కంట్రోల్ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ప్రతి సోమవారం ఆ కమిటీ రివ్యూ చేసి వివరాలు సమర్పించాల్సి ఉంటుందన్నారు. ఆపరేషన్ల థియేటర్ల వారీగా ఇన్ఫెక్షన్ కంట్రోల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్ లను నియమించనున్నట్లు మంత్రి వెల్లడించారు. పంజాగుట్టలోని నిమ్స్ ఆసుపత్రిలో ఇన్ఫెక్షన్ ప్రివెన్షన్ ట్రైనింగ్ కార్యక్రమంలో హరీశ్ రావు పాల్గొని మాట్లాడారు. నిమ్స్ ఆస్పత్రిలో ఇన్ఫెక్షన్ కంట్రోల్ చాలా బాగుందని అన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇన్ఫెక్షన్ కంట్రోల్ 7 శాతం ఉంటే.. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 10 శాతంగా ఉందని వెల్లడించారు. 

టీవీవీపీ ప్రైమరీ హెల్త్ కేంద్రాల ప్రతినిధులకు ట్రైనింగ్..

ఇన్ఫెక్షన్ కంట్రోల్ లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని టీచింగ్ ఆస్పత్రుల ప్రతినిధులను నిమ్స్ లో రెండు రోజుల పాటు శిక్షణ ఇస్తారని పేర్కొన్నారు. అనంతరం టీవీవీపీ ప్రైమరీ హెల్త్ కేంద్రాల ప్రతినిధులకు ట్రైనింగ్ ఉంటుందని వివరించారు. ప్రతి రెండేల్లకు ఒకసారి ఇన్ఫెక్షన్ కంట్రోల్ ట్రైనింగ్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు. ఆపరేషన్ థియేటర్, లేబర్ రూం, డయాలసిస్ ప్రాంతాల్లో అత్యంత జాగ్రత్తగా ఉండాలన్నారు. టీచింగ్ ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు మెగురు అయ్యాయని చెప్పారు. ఆపరేషన్ థియేటర్లలో అవసరమైన అన్ని పరికరాలు కొుగోలు చేయాలని ఆస్పత్రుల సూపరింటెండెంట్ లకు ఆదేశాలు జారీ చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమైన ఆస్పత్రుల్లో రూ.30 కోట్లతో మార్చురీల ఆధునికీకరణ చేపట్టామన్నారు. అలాగే 56 హై కఎండ్ అల్ట్రా సౌండ్ మిషన్ లు అందుబాటులోకి రానున్నాయని మంత్రి హరీష్ రావు వివరించారు. గర్భిణులు ఒక్క స్కాన్ కోసం కూడా బయటకు వెళ్లాల్సిన పని ఉండదు. పీహెచ్ సీల కోసం వచ్చే 10 రోజుల్లో వెయ్యి మంది వైద్యులను పూర్తి స్థాయిలో నియమించేందుకు చర్యలు తీసుకుంటాం. రానున్న రెండు రోజుల్లో 1,140 అసిస్టెంట్  అసిస్టెంట్ ఫ్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. 

ఇటీవలే మెడికల్ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పి మంత్రి..

వైద్య విద్యార్థుల కోసం అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నామని తెలంగాణ ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. గతంలో వైద్య విద్య కోసం ఉక్రెయిన్, రష్యాకు వెళ్లి చదువుకునే వారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిందని, రాష్ట్రంలో జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసుకుంటున్నామన్నారు. రాబోయే రోజుల్లో సిద్ధిపేటలో రూ.15 కోట్లతో క్యాథలాబ్ గుండె చికిత్స, రేడియో థెరపీ సేవలకు అనుగుణంగా క్యాన్సర్ చికిత్స అందిస్తామన్నారు. సిద్దిపేటలో 900 పడకల ఆసుపత్రిని త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. రానున్న రోజుల్లో బీ కేటగిరీలో లోకల్ రిజర్వేషన్లు అమలు చేస్తామని, పీజీ సీట్లను 40 వరకు పెంచుతున్నామని మంత్రి హరీష్ రావు తెలిపారు.

టాప్ హెడ్ లైన్స్

Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
Road Accidents: పశ్చిమ గోదావరి జిల్లాలో కాల్వలోకి దూసుకెళ్లిన కారు- నలుగురు యువకులు గల్లంతు
Road Accidents: పశ్చిమ గోదావరి జిల్లాలో కాల్వలోకి దూసుకెళ్లిన కారు- నలుగురు యువకులు గల్లంతు
India Census 2027: జనాభా లెక్కల్లో తప్పుడు సమాధానాలు ఇస్తే ఏమవుతుంది, జైలు శిక్షనా ? జరిమానా విధిస్తారా
జనాభా లెక్కల్లో తప్పుడు సమాధానాలు ఇస్తే ఏమవుతుంది, జైలు శిక్షనా ? జరిమానా విధిస్తారా
Harish Rao: రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్టం దావాతో కోర్టుకు లాగుతా: హరీష్ రావు
రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్టం దావాతో కోర్టుకు లాగుతా: హరీష్ రావు

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
రూ.19.45 లక్షల నుంచి మహీంద్రా BE 6 Sporteq.. మీ అవసరానికి సరిపోయే వేరియంట్‌ ఇదే!
మహీంద్రా BE 6 Sporteqలో ఏ వేరియంట్‌ బెస్ట్? ధర, బ్యాటరీ, ఫీచర్ల పూర్తి వివరాలు!
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
RRB JE Posts 2026: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
RRB JE Posts: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
Embed widget