By: ABP Desam | Updated at : 02 Apr 2023 10:01 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
బలగం సినిమా చూసిన మంత్రి ఎర్రబెల్లి
Minister Dayakar Rao : తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తూ తీసిన బలగం సినిమాను మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరులోని శ్రీ వేంకటేశ్వర సినిమా టాకీస్ లో ఆదివారం ప్రదర్శించారు. ఈ సినిమాని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కొంతమంది అనాథ పిల్లలు, పట్టణ ప్రముఖులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రేక్షకులతో కలిసి వీక్షించారు. అనంతరం తొర్రూర్ కు చేరుకున్న బలగం సినిమా రైటర్, డైరెక్టర్ వేణు ఎల్డంది, నటుడు రచ్చ రవి కెమెరామెన్, ఇతర యూనిట్ సభ్యులు వెంకటేశ్వర థియేటర్ కు వచ్చి మంత్రి ఎర్రబెల్లిని అక్కడ ప్రేక్షకుల్ని కలిశారు. కొద్దిసేపు ప్రేక్షకులు అనాథ పిల్లలతో కలిసి సందడి చేశారు. మా బలగం మీరేనంటూ ఫొటోలు దిగారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, బలగం సినిమా తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించింది అన్నారు. కంచంలో బొక్క సృష్టించిన సమస్యతో మొదలై ప్రపంచంలో ప్రేమానురాగాలు, బంధాలు, అనుబంధాలను అద్భుతంగా చిత్రీకరించిన సినిమాగా బలగం చరిత్రలో నిలిచిపోతుందని మంత్రి తెలిపారు. ఇంత గొప్ప సినిమా తీసిన సినీ నటులంతా డైరెక్టర్ తో సహా మనవాళ్లు కావడం, మనతోనే ఉండడం మన అదృష్టం అన్నారు. ఇక పాలకుర్తి నియోజకవర్గానికి చెందిన పలువురు సినిమా రంగంలో రాణిస్తుండటం మంచి పరిణామం అని మంత్రి అన్నారు. అమ్మపురం నవీన్ కుమార్ గట్టు పాలకుర్తికి చెందిన శశివర్మ సుంకరి ఇంకా అనేకమంది సినిమా రంగంలో సరికొత్త సినిమాలని తీస్తున్నారని రాణిస్తున్నారని మంత్రి అభినందించారు.
నా బలగం ప్రేక్షకులని ఇలా కదిలిస్తుంది అని వీడియోస్ నాకు పంపిస్తుంటే అదృష్టంగా భావిస్తున్న🙏
— Venu Yeldandi #Balagam (@VenuYeldandi9) April 2, 2023
ఇలా చూసి మల్లి థియేటర్సకి ఫ్యామిలీ తో వెళ్లి చూస్తున్నాం అని పిక్స్ పంపుతున్నారు..
ఆనందభాష్పలతో మీ వేణు 🥰🥰#balagam #Venuyeldandi @DilRajuProdctns @HR_3555 @LyricsShyam @vamsikaka https://t.co/cdcRqXNlre
సినిమా డైరెక్టర్ వేణు ఎలదండి మాట్లాడుతూ... సినిమా సక్సెస్ గురించి చెప్పాల్సింది లేదు కానీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సహకారం ఎన్నటికీ మరువలేనిది అన్నారు. ఆదరించిన ప్రేక్షకులకు సహకరించిన మంత్రికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు. సినీ నటుడు రచ్చ రవి మాట్లాడుతూ ఈ సినిమాలో నటించిన వాళ్లలో సినిమాకు పనిచేసిన వాళ్లలో ఎక్కువమంది ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన వారేమన్నారు. అలాగే సిరిసిల్ల నుంచి వచ్చిన ఎల్దండి వేణు అద్భుత ప్రతిభ కనబరిచారని తన జీవితంలో మరిచిపోలేని గొప్ప అనుభూతిని మిగిల్చిన మంచి సినిమాను ఇచ్చారని చెప్పారు. అలాగే మంత్రి దయన్న చూపిన చొరవ ఆదరణని ఎప్పటికీ మరువలేమన్నారు.
నిన్న రాత్రి ఎక్కడో తెలియదు..వూరంతా కలిసి బలగం సినిమా చూసారు..ఇలా ప్రతి పల్లె చూస్తున్నారు..చాల సంతోషంగా వుంది.. ఇట్లా చూసి అసలైన మజా రావాలంటే థియేటర్లో చూడాలే.. అని థియేటర్లకు పోతున్నారు ..ఇంత ఘన విజయం అందించిన తెలుగు ప్రేక్షకులకి నా కృతజాజ్ఞతలు 🙏🙏🙏
— Venu Yeldandi #Balagam (@VenuYeldandi9) March 31, 2023
#balagam pic.twitter.com/une9o3b5Do
Medical Collages: 50 కొత్త మెడికల్ కాలేజీలకు కేంద్రం ఆమోదం - ఏపీ, తెలంగాణకు ఎన్నంటే
Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు షాక్! మహిళా కమిషన్ కీలక ఆదేశం
TS PGECET Results: తెలంగాణ పీజీఈసెట్ - 2023 ఫలితాలు వెల్లడి, డైరెక్ట్ లింక్ ఇదే!
KTR: యువత స్కిల్ సంపాదించాలి, ఉద్యోగం దానికదే వస్తుంది - కేటీఆర్
Hyderabad: ఉన్నట్టుండి ఉరేసుకున్న ఇంటర్ విద్యార్థిని, ఇంటి ఎదురుగా క్షుద్ర పూజలు!
Sharwanand: సీఎం కేసీఆర్‌ను కలిసిన శర్వానంద్ - వెడ్డింగ్ రిసెప్షన్‌కు ఆహ్వానం
Ambati Rayudu : జగన్ ను కలిసిన అంబటి రాయుడు - వైసీపీలో చేరికకు ముహుర్తం ఖరారైనట్లేనా ?
CM Jagan Review: ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు ఉండాల్సిందే - అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు
IND VS AUS: 469కు ఆస్ట్రేలియా ఆలౌట్ - నాలుగు వికెట్లతో చెలరేగిన సిరాజ్!