KTR Legal Notices : కొండా సురేఖ, ఎమ్మెల్యే యెన్నంలకు లీగల్ నోటీసులు - అన్నంత పని చేసిన కేటీఆర్ !
Andhra news : కొండా సురేఖ, యెన్నం శ్రీనివాసరెడ్డిలకు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. సారీ చెప్పకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
KTR sent legal notices to Konda Surekha and Yennam Srinivasa Reddy : ఫోన్ ట్యాపింగ్ విషయంలో తనపై తప్పుడు ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖతోపాటు మరో ఇద్దరు కాంగ్రెస్ నేతలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరువునష్టం నోటీసులు పంపించారు. తన ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా ప్రకటనలు చేసింనందుకు క్షమాపణలు చెప్పాలని, లేకుంటే న్యాయపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలని నోటీసుల్లో పేర్కొన్నారు. మంత్రి సురేఖతోపాటు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డికి కేటీఆర్ నోటీసులు పంపించారు.
కొండా సురేఖ ఏమన్నారంటే ?
మంత్రి కొండా సురేఖ కేటీఆర్‌పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ చేసి పలువురు సినిమా హీరోయిన్లను బెదిరించారని కామెంట్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో నిందితులను వదిలిపెట్టబోమని ఆమె అన్నారు. తన భర్త కొండా మురళి ఫోన్‌ను కూడా ట్యాప్ చేశారని ఆమె పేర్కొన్నారు.
ట్యాపింగ్‌పై డీజీపీకి ఫిర్యాదు
కాంగ్రెస్ సీనియర్ లీడర్ కె.కె.మహేందర్ రెడ్డి సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. అసెంబ్లీ ఎన్నికల టైమ్‌లో తన ఫోన్ ట్యాప్ చేయాలని కేటీఆర్ ఆదేశించారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సైతం మార్చి 26న డీజీపీకి ఫిర్యాదు చేశారు. తన ఫోన్ ట్యాప్ చేశారని ఆరోపించారు.
మంగళవారమే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన కేటీఆర్
మంగళవారమే.. తనపై ట్యాపింగ ఆరోపణలు చేస్తున్న వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఒక్క రోజులోనే అందరికీ నోటీసులు పంపించారు.
Both these Congress fellows (including the minister) will be served legal notices for defamation & slander
— KTR (@KTRBRS) April 2, 2024
Either Apologise for this shameful, baseless & nonsensical allegations or face legal consequences
Also will be serving legal notices to news outlets who are dishing out… pic.twitter.com/IjHNQ7Yn2T
నోటీసులకు భయపడేది లేదు : కొండా సురేఖ
తమకు లీగల్ నోటీసులు పంపిస్తే భయపడేది లేదని, అది పెద్ద సమస్యే కాదన్నారు. అధికారంలో ఉన్నప్పుడు పిచ్చి జోకులు వే సి అపహాస్యం చేసిందే కేసీఆర్, కేటీఆర్ అన్నారు. ఫోన్ ట్యాపింగ్‌లో కేటీఆర్ లేనప్పుడు ఎందుకు భుజాలు తడుముకుంటున్నాడన్నారు. చేసిందే బుద్ధి తక్కువ పని.. అది సమర్థించుకోవడానికే పిచ్చిగా మాట్లాడుతున్నాడంటూ మండిపడ్డారు.