KTR: పేపర్ బ్యాలెట్లతోనే ఎన్నికలు నిర్వహించాలి - ఈసీకి స్పష్టం చేసిన కేటీఆర్
Paper ballot elections: బీహార్‌లో పేపర్ బ్యాలెట్లతోనే ఎన్నికలు నిర్వహించాలని కేటీఆర్ ఎన్నికల సంఘాన్ని కోరారు. కాళేశ్వరం రిపోర్టును సభలో పెడితే ఫుట్‌బాల్ ఆడుకుంటామన్నారు.

KTR appeals for paper ballot elections: ఈవీఎంలపై ప్రజలకు అనుమానాలు ఉన్నాయి. తిరిగి పేపర్ బ్యాలెట్ తోనే దేశంలో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ ను బీఆర్ఎస్ పక్షాన కోరామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. తాము వేసిన వారికి ఓటు పోవడం లేదన్న అనుమానం ప్రజలకు వస్తే అది భారత ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. *భారత ఎన్నికల కమీషన్ తో సమావేశం తరువాత ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన కేటీఆర్ పలు అంశాలపై స్పందించారు.
నవంబర్ లో జరిగే బీహార్ ఎన్నికలతోనే పేపర్ బ్యాలెట్ ను ప్రవేశపెట్టి, తరువాత జరిగే సాధారణ ఎన్నికలనూ బ్యాలెట్ తోనే నిర్వహించాలని కోరామనని కేటీఆర్ స్పష్టం చేశానారు. ఎన్నికల సంస్కరణలు, ప్రతిపాదనలు, ప్రవర్తనా నియమావళి సంబంధిత అంశాలపై చర్చించాలన్న భారత ఎన్నికల కమిషన్ ఆహ్వానం మేరకు వారితో సమావేశమయ్యామని కేటీఆర్ చెప్పారు. కారు గుర్తును పోలిన గుర్తులతో బీఆర్ఎస్ కు జరుగుతున్న నష్టాన్ని వివరించి తక్షణమే వాటిని తొలగించాలని కోరినట్టు తెలిపారు. ఇక బీహార్ లో జరుగుతున్న ఓటర్ జాబితా సవరణ ప్రక్రియపై ప్రజలకు వస్తున్న అనుమానాలు, కలుగుతున్న ఆందోళనలను తొలగించాలని కోరామన్నారు. కాళేశ్వరం కమీషన్ నివేదిక పై కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తుందన్న కేటీఆర్, మైకులు కట్ చేయకుండా తమను అసెంబ్లీలో మాట్లాడనిస్తే ప్రభుత్వంతో ఫుట్ బాల్ ఆడుకుంటామన్నారు.
అమెరికా, యూకే, జర్మనీ, ఇటలీ తో పాటు ఇంకా చాలా దేశాలు ఈవీఎంలతో కొన్ని ప్రయోగాలు చేసి, ఆ తరువాత ప్రజలకు అనుమానాలు రావడంతో ఓటింగ్ మెషిన్లను వద్దనుకుని ఆయా దేశాలు తిరిగి పేపర్ బ్యాలెట్ కే వెళ్లాయన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. 140 కోట్ల జనాభా కలిగిన భారతదేశం. దాదాపు వంద కోట్ల ఓటర్లు మన దేశంలో ఉన్నారు. ఇలాంటి దేశంలో మిషన్ లతో నష్టం జరుగుతుందని, తమ ఓటు అనుకున్న వ్యక్తికి పోవడం లేదని ప్రజలకు అనుమానాలు వస్తే అది ప్రజాస్వామ్యానికి చేటు అన్నారు. అందుకే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను పక్కనపెట్టి తిరిగి పేపర్ బ్యాలెట్ తీసుకోవాలని మా పార్టీ తరపున ఎలక్షన్ కమిషన్ ను కోరామమన్నారు.
బీహార్ లో జరుగుతున్న ఓటర్ జాబితా సవరణ మీద వస్తున్న అనుమానాలు, దాదాపు 65 లక్షల ఓట్లు గల్లంతయ్యాయని అక్కడి రాజకీయ పార్టీలు చేస్తున్న ఆందోళనపై ఎన్నికల కమిషన్ తో మాట్లాడామమన్నారు. చనిపోయిన వారి, వలస కార్మికులు, స్పందించని వారి ఓట్లను తీసేశామని కమీషన్ చెప్పిందని.. అన్ని రాజకీయ పార్టీలను విశ్వాసంలోకి తీసుకుని ఓటర్ జాబితా సవరణ చేయాలని మేము చెప్పాము. ముఖ్యంగా తాలూకా లెవెల్లో.. మండల్ లెవెల్లో...బూత్ లెవల్లో ప్రతిపక్షాలను భాగస్వామ్యం చేసి పారదర్శకంగా చేస్తే అన్ని పార్టీల మద్దతు ఉంటుందని తెలిపామన్నారు. ఎవరి ఓట్లు తీస్తున్నారు? ఎందుకు తీస్తున్నారు? ఏ కారణంతో తీస్తున్నారన్న విషయాన్ని అన్ని పార్టీలకు చెప్పి పారదర్శకంగా తీసేయాలని ఎన్నికల కమీషన్ కు చెప్పామని కేటీఆర్ తెలిపారు.
బీసీలతో కాంగ్రెస్ పార్టీ క్రూరమైన పరిహాసం ఆడుతుందని శాసనసభలో బిల్లు పెట్టినప్పుడే మేము చెప్పామమని కేటీఆర్ గుర్తు చేశారు.
42% రిజర్వేషన్లు అని ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ డ్రామా చేస్తున్నది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బీసీ డిక్లరేషన్ లో కేవలం రాజకీయ రిజర్వేషన్లు మాత్రమే లేవు. ఇంకా వేరే హామీలు కూడా ఉన్నాయి. వాటిని అమలుచేయకుండా ఆ పార్టీ నాటకాలు ఆడుతోందన్నారు. రాజకీయాల్లో 42 శాతం వాటా వస్తే రాజకీయ నాయకులకే లాభం జరుగుతుంది. కానీ బీసీ జాతికి లాభం కావాలంటే, బీసీల్లో ఉండే పేదవారికి లాభం జరగాలంటే 42% కాంట్రాక్టులు ఇవ్వండి, 42 శాతం రిజర్వేషన్లు విద్య ఉద్యోగ ఉపాధి రంగాల్లో ఇవ్వాలన్నారు.
655 పేజీల కమిషన్ నివేదికను 60 పేజీలకు కుదించడంలోనే కాంగ్రెస్ భాగోతం అర్థమైందని కేటీఆర్ విమర్శఇంచారు. రిపోర్ట్ ఎవరూ చదవకముందే ఆ రెండు పత్రికలు మాత్రం రోత వార్తలను రాసి కేసిఆర్ గారి మీద , బీఆర్ఎస్ మీద దుష్ప్రచారం చేస్తున్నాయని విమర్శఇంచారు. అసెంబ్లీలో మా మైకులు కట్ చేయకుండా మమ్మల్ని మాట్లాడిస్తే ఎవరు నిజం చెబుతున్నారు? ఎవరు అబద్ధం చెపుతున్నారో తెలిసిపోతుంది. కాంగ్రెస్ పార్టీకీ దమ్ముందా? అని ప్రశఅనించారు. కాళేశ్వరం, బీఆర్ఎస్ మీద దుష్ప్రచారం చేస్తున్న ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీని చీల్చి చెండాడి ఫుట్ బాల్ ఆడుతామని హెచ్చరించారు.





















