అన్వేషించండి

KTR: మగాడివైతే ఆ ఎమ్మెల్యేలతో రాజీనామా చేపియ్, మళ్లీ గెలిపిస్తే దమ్మున్నోడివే - రేవంత్‌పై కేటీఆర్ వ్యాఖ్యలు

BRS Latest News: జగిత్యాల పట్టణంలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ జిల్లా స్థాయి ఆత్మీయ సమ్మేళనంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. పార్టీ ఫిరాయింపులపై మాట్లాడారు.

BRS News: కాంగ్రెస్ పార్టీ సిగ్గు లేకుండా పార్టీ  ఫిరాయింపులకు పాల్పడుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. ఈ ఆయారాం, గయారాం అనే విషబీజానికి శ్రీకారం చుట్టిందే ఇందిరాగాంధీ హాయాంలోని కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు. 2004లో మనతో పొత్తు పెట్టుకొని మన 26 మంది ఎమ్మెల్యేలలో 10 మంది ఎమ్మెల్యేలను కలుపుకునే పని చేసిందని అన్నారు. అయినా సరే 2014లో ఇదే కాంగ్రెస్ తో కొట్లాడి కేసీఆర్ ఆధ్వర్యంలో మనం తెలంగాణ తెచ్చుకున్నామని అన్నారు. జగిత్యాలలో జరిగిన బీఆర్ఎస్ జిల్లా పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. 

‘‘2014 లో ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి మన ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేసింది మీరంతా చూశారు. తెలంగాణను నడిపియ్యలేకపోతున్నారని చెప్పేందుకు, ప్రభుత్వం స్థిరంగా లేదని సర్కార్ ను పడగొట్టే ప్రయత్నం చేశారు. ఆ పరిస్థితుల్లో రాజ్యాంగ బద్దంగా మూడింట రెండు వంతుల మంది ఎమ్మెల్యేలు మన పార్టీలో చేరారు. రాజ్యాంగాన్ని తుంగలో తొక్కే విధంగా మనం వ్యవహరించలేదు. అప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో చేరినప్పడు ఇదే రేవంత్ రెడ్డి వాళ్లను రాళ్లతో కొట్టి చంపాలన్నాడు. 

మగాడివైతే రాజీనామా చేయించు - కేటీఆర్
రేవంత్ రెడ్డి ఇప్పుడు చెప్పాలె? ఎవరిని రాళ్లతో కొట్టాలే? ఎవరు పిచ్చి కుక్క? ఇప్పుడు రేవంత్ రెడ్డిని కొట్టాలా? ఇక్కడి ఎమ్మెల్యే సంజయ్ ను కొట్టాలా? రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే, నీవు మగాడివైతే నువ్వు తీసుకున్న ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో రాజీనామా చేపియ్. వాళ్లను మళ్లీ గెలిపించుకుంటే నువ్వు దమ్మునోడివి. ఒక్క రేవంత్ రెడ్డి మాత్రమే కాదు. రాహుల్ గాంధీ ఏమన్నాడో కూడా వినాలె. ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో చేరితే ఆటోమేటిక్ గా సభ్యత్వం రద్దు అయ్యేలా చేస్తామని హైదరాబాద్ లోనే చెప్పిండు. పాంచ్ న్యాయ్ పేరుతో ఇదే అంశాన్ని రాహుల్ గాంధీ మేనిఫెస్టోలో కూడా పెట్టిండు. కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి చేస్తుందేమిటీ ప్రజలు గుర్తించాలె. 

వాళ్ల పార్టీ నాయకుడు జీవన్ రెడ్డి కూడా ఇదే అంశంపై సొంత పార్టీ పై విమర్శలు చేశాడు. బీఆర్ఎస్ కార్యకర్తలు భయపడాల్సిన, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ రెండు సార్లు అధికారంలోకి వచ్చింది. మూడోసారి మూడో వంతు సీట్లలో గెలిచింది. 14 సీట్లలో కొద్ది తేడాతో మాత్రమే ఓడిపోయింది. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో ఏం జరిగిందో మీకు తెలుసు? మోదీ కావాలా? వద్దా? అన్నట్లుగా ప్రచారం చేశారు. దీంతో ఐతే ఎన్డీయే, ఇండియా కూటమి లో లేని పార్టీలకు ఇబ్బంది జరిగింది. ఒక్క బీఆర్ఎస్ కు మాత్రమే కాదు. ఏ కూటమిలో లేని సీపీఎం, వైఎస్ఆర్ సీపీ, బీజేడీ, అన్నాడీఎంకే, బీఎస్పీ, అకాలీదల్ లకు కూడా ఎదురుదెబ్బ తగిలింది.

కుండ పగిలితే పగిలింది.. కానీ కుక్క బుద్ది తెలిసింది - కేటీఆర్
420 హామీలు ఇచ్చి రేవంత్ రెడ్డి గద్దెనెక్కిండు. వాటికి సంబంధించి ప్రజలు నిలదీస్తే.. కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లోనే ముసలం పుడుతుందని రేవంత్ భయపడ్డాడు. అందుకే ఎమ్మెల్యేలను గొర్రెలు, బర్రెల మాదిరిగా డబ్బులు పడేసి కొని తన దొడ్లో కట్టేసుకుంటున్నాడు. ఇచ్చిన హామీలను డైవర్ట్ చేసేందుకు ఎమ్మెల్యేలను ఎత్తుకుపోతుండు. జగిత్యాల కార్యకర్తలను చూస్తే సంతోషంగా ఉంది. జగిత్యాలకు పట్టిన శని పోయిందన్నట్లుగా ధైర్యంగా కనిపిస్తున్నారు. జగిత్యాలలో కార్యకర్తలందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. గాలికి కొట్టుకుపోయేటివి గడ్డిపోచలే.  గడ్డపారాలు కొట్టుకుపోవు. ఇక్కడ ఎమ్మెల్యే గడ్డిపోచలాంటి వ్యక్తి. కవితక్క సహా మీరందరూ కష్టపడితే ఆయన ఎమ్మెల్యే అయ్యిండు. కానీ దొంగలల్లా కలిసి పోయిండు. రేవంత్ రెడ్డి విసిరే ఎంగిలి మెతుకుల కోసం పోయిండు. కుండ పగిలితే పగిలింది. కానీ కుక్క బుద్ది తెలిసిందన్నట్లుగా మీ ఎమ్మెల్యే బుద్ది తెలిసింది’’ అని కేటీఆర్ మాట్లాడారు.

టాప్ హెడ్ లైన్స్

Akbaruddin Owaisi: హైడ్రా ఒకటి కూల్చితే, మేం 100 కడతాం.. బెదిరింపులకు భయపడేది లేదన్న అక్బరుద్దీన్ ఒవైసీ
హైడ్రా ఒకటి కూల్చితే, మేం 100 కడతాం.. బెదిరింపులకు భయపడేది లేదన్న అక్బరుద్దీన్ ఒవైసీ
KTR On Polavaram Project: దశాబ్దాలు గడిచినా పోలవరం పూర్తి కాలేదు.. కాలంతో పోటీపడి కాళేశ్వరం నిర్మించాం: కేటీఆర్
దశాబ్దాలు గడిచినా పోలవరం పూర్తి కాలేదు.. కాలంతో పోటీపడి కాళేశ్వరం నిర్మించాం: కేటీఆర్
Uttam Kumar Reddy: బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
CM Revanth Reddy: హైదరాబాద్ మెట్రోపై నిర్ణయాల అమల్లో జాప్యం ఎందుకు?: కేంద్ర మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి లేఖ
హైదరాబాద్ మెట్రోపై నిర్ణయాల అమల్లో జాప్యం ఎందుకు?: కేంద్ర మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి లేఖ

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Women T20 World Cup Champ Australia: ఆసీస్ ఏడోసారి.. రికార్డ్ ఛేజింగ్ తో వ‌ర‌ల్డ్ చాంప్ గా నిలిచిన కంగారులు.. ఇంగ్లాండ్ కి నాలుగోసారి భంగ‌పాటు.. స‌త్తా చాటిన మూనీ, లీచ్ ఫీల్డ్..
ఆసీస్ ఏడోసారి.. రికార్డ్ ఛేజింగ్ తో వ‌ర‌ల్డ్ చాంప్ గా నిలిచిన కంగారులు.. ఇంగ్లాండ్ కి నాలుగోసారి భంగ‌పాటు.. స‌త్తా చాటిన మూనీ, లీచ్ ఫీల్డ్..
Prashna Ravan Wife: పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఒప్పు.. నా భర్త మాట్లాడితే తప్పా? మమ్మల్ని ఒకేసారి చంపేయండి: ప్రశ్న రావణ్ భార్య
పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఒప్పు.. నా భర్త మాట్లాడితే తప్పా? మమ్మల్ని ఒకేసారి చంపేయండి: ప్రశ్న రావణ్ భార్య
Uttam Kumar Reddy: బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
KTR Challenges Revanth Reddy: చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్‌కి అప్పజెప్పండి.. అన్ని జలాశయాలు నింపి చూపిస్తాం: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!
చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్‌కి అప్పజెప్పండి.. మొత్తం నీటితో నింపి చూపిస్తాం: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!
Satluj OTT : మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
MLC Duvvada Srinivas: భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
Tata Tiago EV on Discount: దేశంలో అత్యంత చౌకైన ఈవీపై రూ.1.45 లక్షల డిస్కౌంట్.. ఫీచర్లు, రేంజ్ చూసి కొనేయండి
అత్యంత చౌకైన ఈవీపై రూ.1.45 లక్షల డిస్కౌంట్.. ఫీచర్లు, రేంజ్ చూసి కొనేయండి
Prashna Ravan Sedition Case: ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
Embed widget