Komatireddy comments : కాంగ్రెస్‌లోకి 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు - ఎప్పుడో చెప్పిన కోమటిరెడ్డి !
Telangana News : లోక్ సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. మంత్రి జగదీష్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమన్నారు.

Komati Reddy Venkata Reddy : లోక్‌సభ ఎన్నికల తర్వాత 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరబోతున్నారంటూ తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నల్లగొండ కలెక్టరేట్‌లో నిన్న నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అనంతరం మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కోసం మంత్రి పదవిని సైతం వదులుకున్న తన గురించి మాజీమంత్రి, బీఆర్ఎస్ నేత జగదీశ్‌రెడ్డి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో అక్రమాలతోపాటు చత్తీస్‌గఢ్‌లో కరెంటు కొనుగోళ్లలో అవినీతి బయటపడుతుందన్న అక్కసుతోనే ఆయన తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లోపు అమలు చేసి తీరుతామని పునరుద్ఘాటించారు.
ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి.. చావు తప్పి కన్ను లొట్ట పోయి గెలిచాడు అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఒక్క ఎమ్మెల్యేను కూడా గెలిపించుకోలేని అసమర్థ నాయకుడు.. ముగ్గురుని హత్య చేసిన కేసులో నిందితుడు, హంతకుడు అని ఆయన ఆరోపణలు చేశాడు. రేపో మాపో జగదీశ్ రెడ్డి జైలుకు పోవడం ఖాయం.. కోవర్టు అనేది తప్పుడు ఆరోపణలు చేశాడు.. ఆయన గురించి మాట్లాడటం వెస్ట్ అని మంత్రి పేర్కొన్నారు. 80 ఎకరాల ఫామ్ హౌస్ ఎలా కట్టాడు అని ప్రశ్నించారు. అలాగే, జగదీశ్వర్ రెడ్డికి సూర్యాపేట కలెక్టర్ కార్యాలయం చుట్టూ 150 ఎకరాల భూములు వచ్చాయిని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అడిగారు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేసి తీరుతామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. ఇక, 200 యూనిట్ల కరెంట్..100 రోజుల్లో ఇచ్చి.. హామీ నిలబెట్టుకుంటాం అని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో దళితుణ్ణి సీఎం చేస్తా అని చెప్పిన కేసీఆర్ ఏం చేశాడు.. దళితుణ్ణి సీఎం చేయకపోతే మెడ మీద తల నరుక్కుంటా అన్నాడు.. 9 ఏండ్లు తల నరుక్కున్నాడా..? అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ దోపిడీతో.. మేము ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయలేకపోయామన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తా అని కేసీఆర్ ఇవ్వలేదు.. నిరుద్యోగులను బీఆర్ఎస్ మోసం చేసింది.. పదేళ్లు వారికి ఉద్యోగాలు ఇవ్వకూండా తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది.. ఇప్పుడు నిరుద్యోగులను కేసీఆర్ ఇంటికి పంపాలా.. కేటీఆర్ ఇంటికి పంపాలా? అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు.
కేసీఆర్ సర్కార్ నిర్వాకం వల్ల రాష్ట్రం గుల్ల అయ్యిందన్నారు. కేసీఆర్ నిరుద్యోగ భృతి మొదలుకుని డబల్ బెడ్ రూంల వరకు అన్ని హమీలను మీరు విస్మరించారన్నారు. మేము ప్రజలను మీలాగా రెచ్చగొడితే ఫార్మ్ హౌస్ దాటకపోయే వారని హెచ్చరించారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు రాదని స్పష్టం చేశారు. కాలేశ్వరంతో పాటు అన్ని అక్రమాలపై విచారణ కొనసాగుతొందన్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

