అన్వేషించండి

Covid Vaccination: ఖమ్మం జిల్లాలో 100 శాతం వ్యాక్సినేషన్... మొదటి డోస్ పంపిణీ పూర్తి చేయడంపై మంత్రి పువ్వాడ హర్షం

ఖమ్మం జిల్లా 100 శాతం వ్యాక్సినేషన్ మార్కును అందుకుంది. కోవిడ్ వ్యాక్సిన్ మొదటి డోసు పంపిణీ 100 శాతం పూర్తి చేయడంపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వైద్య సిబ్బందిని అభినందించారు.

కరోనా మహమ్మారి నివారణకు అందిస్తున్న కోవిడ్ వాక్సినేషన్ మొదటి డోస్ పంపిణీలో ఖమ్మం జిల్లా 100% పూర్తిచేసింది. 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయడంపై జిల్లా యంత్రాంగాన్ని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  అభినందించారు. మొదటి డోస్ వ్యాక్సినేషన్ ను విజయవంతంగా పూర్తి చేయడానికి గ్రామ స్థాయి నుంచి నగరాల వరకు పని చేసిన సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది అంకిత భావంతో పని చేశారన్నారు. వారి సహకారంతోనే వ్యాక్సినేషన్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా విజయవంతంగా పూర్తి చేశారని మంత్రి తెలియజేశారు. కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో జిల్లా యంత్రంగం, సిబ్బంది సాహసోపేతంగా పనిచేశారని గుర్తు చేశారు. రెండో డోసు వేయించుకోవాల్సిన వారు నిర్ణీత సమయానికల్లా వేయించుకోవాలని ఆయన సూచించారు. 

Also Read: తీవ్ర తోపులాటల మధ్య రేవంత్ రెడ్డి అరెస్టు.. చిరిగిన మల్లు రవి చొక్కా, పీఎస్‌కు తరలింపు

రాష్ట్రంలో మొదటి డోస్ వ్యాక్సినేషన్ 99.35 శాతం

ఒమిక్రాన్ వ్యాపిస్తున్న వేళ రెండో డోసుని అంద‌రూ త‌ప్పకుండా వేయించుకోవాల‌ని, బూస్టర్ డోస్ కూడా త్వరలో అందుబాటులోకి రానుందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ప్రజలకు కరోనా టీకాలు వేయటంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్‌ వన్‌ స్థానంలో నిలిచిందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ కుమార్ అన్నారు. భౌతిక దూరం పాటిస్తూ ప్రతి ఒక్కరు మాస్కులు తప్పక ధరించాలని విజ్ఞప్తి చేశారు. టీకాలు వేసుకొనేందుకు ఆసక్తి చూపని వారు, గడువు ముగిసినా రెండో డోస్‌ వేసుకోని వారిని గుర్తించి టీకాలు వేయాలని వైద్య సిబ్బందిని మంత్రి కోరారు. రాష్ట్రంలో శుక్రవారం నాటికి మొదటి డోస్‌ 99.35 శాతానికిపైగా వేయగా, 63.40 శాతం మందికి రెండో డోస్ లు అందించడం పట్ల మంత్రి పువ్వాడ హర్షం వ్యక్తం చేశారు. 100% వాక్సిన్ పూర్తి చేసిన సందర్భంగా కేక్ కట్ చేశారు. అనంతరం పలువురు వైద్య సిబ్బందిని శాలువతో సత్కరించారు.

Also Read: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికితే ఇక అక్కడ కూడా మీ పరువు పోయినట్టే..! పోలీసుల కొత్త ఐడియా

తెలంగాణలో 25 లక్షల మందికి ప్రికాషన్ డోస్

దేశంలో 60 ఏళ్లకు పైబడిన సుమారు 3 కోట్ల మందికి వ్యాక్సిన్ ప్రికాషన్ డోస్ వేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. జనవరిలో చేపట్టనున్న ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియలో తెలంగాణలో 25 లక్షల మందికి మూడో డోస్ వేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 60 ఏళ్లు పైబడి వారిలో 65 లక్షల మంది వరకూ రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్నారు. వ్యాక్సిన్ రెండో డోసు వేసుకుని తొమ్మిది నెలలు గడిచిన వారికే మూడో డోస్ వ్యాక్సిన్ వేయనున్నారు. తెలంగాణలో మూడో డోసు వేసుకోవడానికి ఎక్కువ అర్హత కలిగిన వారు 18 నుంచి 44 ఏళ్ల మధ్య వయసు వారే అన్నారు. వీరి సంఖ్య సుమారు 2.73 కోట్లు ఉంటారని తెలుస్తోంది. అది గాక 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు గల వారు 1.17 కోట్ల మంది వరకూ ఉన్నారు. 

Also Read: సీఎం కేసీఆర్‌ను పొగడ్తలతో ముంచెత్తిన బాలయ్య.. ఆ పని అద్భుతమని ప్రశంసలు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy: వచ్చే ఎన్నికల్లో కోటి ఓట్లు, 90 సీట్లు.. మళ్లీ అధికారంలోకి కాంగ్రెస్: సీఎం రేవంత్ రెడ్డి
వచ్చే ఎన్నికల్లో కోటి ఓట్లు, 90 సీట్లు.. మళ్లీ అధికారంలోకి కాంగ్రెస్: సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy: కేసీఆర్ హయాంలోనే పల్నాడు వాటర్ గ్రిడ్ మొదలైంది: బీఆర్ఎస్ నేతలకు రేవంత్ రెడ్డి కౌంటర్
కేసీఆర్ హయాంలోనే పల్నాడు వాటర్ గ్రిడ్ మొదలైంది: బీఆర్ఎస్ నేతలకు రేవంత్ రెడ్డి కౌంటర్
CM Revanth Reddy: కేంద్రానికి తెలంగాణ కాంగ్రెస్ బిగ్ డిమాండ్! ఎల్‌నినో నేపథ్యంలో రూ.30 వేల కోట్లు డిమాండ్
కేంద్రానికి తెలంగాణ కాంగ్రెస్ బిగ్ డిమాండ్! ఎల్‌నినో నేపథ్యంలో రూ.30 వేల కోట్లు డిమాండ్
Congress Politics: గాంధీ భవన్‌లో కొత్త ఇంఛార్జ్ సందీప్‌నకు సీఎం రేవంత్ ఘనస్వాగతం.. కీలక అంశాలపై చర్చ
గాంధీ భవన్‌లో కొత్త ఇంఛార్జ్ సందీప్‌నకు సీఎం రేవంత్ ఘనస్వాగతం.. కీలక అంశాలపై చర్చ

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: కేంద్రానికి తెలంగాణ కాంగ్రెస్ బిగ్ డిమాండ్! ఎల్‌నినో నేపథ్యంలో రూ.30 వేల కోట్లు డిమాండ్
కేంద్రానికి తెలంగాణ కాంగ్రెస్ బిగ్ డిమాండ్! ఎల్‌నినో నేపథ్యంలో రూ.30 వేల కోట్లు డిమాండ్
Pawan Kalyan: పంచాయతీ ఎన్నికల్లో పోటీపై జనసైనికులకు పూర్తి స్వేచ్ఛ.. పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన
పంచాయతీ ఎన్నికల్లో పోటీపై జనసైనికులకు పూర్తి స్వేచ్ఛ.. పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన
Viral Video: భార్యతో గొడవ.. బ్యాంక్ నుంచి తెచ్చి రూ.500 నోట్లు తగలబెట్టిన భర్త 
భార్యతో గొడవ.. బ్యాంక్ నుంచి తెచ్చి రూ.500 నోట్లు తగలబెట్టిన భర్త 
Rishabh Pant Century: తొలి టెస్టులో 720 పరుగులతో ఇండియా రికార్డు.. ఆసియా తొలి వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్ అరుదైన మైలురాయి
తొలి టెస్టులో 720 పరుగులతో India రికార్డు.. ఆసియా తొలి వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్ అరుదైన మైలురాయి
Safest Electric Cars: జర్నీలో మీరు పూర్తిగా సురక్షితం.. సేఫ్టీలో బెస్ట్ రేటింగ్ పొందిన 5 ఎలక్ట్రిక్ కార్లు ఇవే
జర్నీలో మీరు పూర్తిగా సురక్షితం.. సేఫ్టీలో బెస్ట్ రేటింగ్ పొందిన 5 ఎలక్ట్రిక్ కార్లు ఇవే
Congress Politics: గాంధీ భవన్‌లో కొత్త ఇంఛార్జ్ సందీప్‌నకు సీఎం రేవంత్ ఘనస్వాగతం.. కీలక అంశాలపై చర్చ
గాంధీ భవన్‌లో కొత్త ఇంఛార్జ్ సందీప్‌నకు సీఎం రేవంత్ ఘనస్వాగతం.. కీలక అంశాలపై చర్చ
AgriGold Scam: అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట.. ఈ నెల 25 నుంచి బాండ్ల వెరిఫికేషన్.. వెంట తీసుకెళ్లాల్సిన పత్రాలివే
అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట.. ఈ నెల 25 నుంచి బాండ్ల వెరిఫికేషన్.. వెంట తీసుకెళ్లాల్సిన పత్రాలివే
Horror Comedy OTT : ప్రేమలో పడ్డ మగాళ్లను బొమ్మలుగా మార్చే మంత్రగత్తె - ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లో కొత్త మూవీ
ప్రేమలో పడ్డ మగాళ్లను బొమ్మలుగా మార్చే మంత్రగత్తె - ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లో కొత్త మూవీ
Embed widget