అన్వేషించండి

KCR : మహాత్ముని స్ఫూర్తితోనే తెలంగాణ సాధన - ప్రపంచాన్ని గాంధీ సిద్ధాంతం ప్రభావితం చేస్తోంది : కేసీఆర్

మహాత్మా గాంధీ స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమం నడిపినట్లుగా కేసీఆర్ తెలిపారు. హెచ్‌ఐసీసీలో శుక్రవారం నిర్వహించిన స్వాతంత్ర్య వజ్రోత్సవ ముగింపు కార్యక్రమంలో కేసీఆర్ ప్రసంగించారు.


KCR :   మహాత్ముడు చూపిన బాటలోనే తెలంగాణ సాధించామని సీఎం కేసీఆర్ అన్నారు. హెచ్‌ఐసీసీలో శుక్రవారం నిర్వహించిన స్వాతంత్ర్య వజ్రోత్సవ ముగింపు కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా కేసీఆర్ హాజరై ప్రసంగించారు.   రాజ్యాంగ పరిధిలో ఉద్యమించడం వల్లనే తెలంగాణ రాష్ట్ర స్వప్నం సాకారమైంద‌ని, అహింసా పోరాటంతోనే గమ్యాన్ని ముద్దాడ గలిగామ‌ని అన్నారు. వేల సంవత్సరాల క్రితమే ప్రపంచానికి భారత్‌ ఆదర్శంగా నిలిచింది. విభిన్న సంస్కృతుల ప్రజలను స్వాతంత్రోద్యమం ఏకతాటిపై నిలిపింది. నేటికీ యావత్‌ ప్రపంచాన్ని గాంధీ సిద్ధాంతం ప్రభావితం చేస్తోందన్నారు.  గాంధీజీ చూపించిన అహింసా మార్గంలోనే  స్వాతంత్ర్య ఉద్యమం  విజయతీరం చేరిందన్నారు.  ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం అంటే హింసాత్మక ఆందోళన మాత్రమే అనే అభిప్రాయం ఉండేదని గుర్తు చేశారు. 

గాంధీ  స్ఫూర్తితోనే తెలంగాణలో అహింసాయుత ఉద్యమం 

టీఆర్‌ఎస్‌ ను స్థాపించినప్పుడు అహింసాయుత ఉద్యమం ద్వారా రాజ్యాంగ పరిధిలో ఉద్యమించి విజయం సాధిస్తామని నేను నిండు మనసుతో స్పష్టంగా ప్రకటించానని గుర్తు చేసుకున్నారు.  మొదట కొందరు నాతో ఏకీభవించలేదని..   రాను.. రాను నేను ఎంచుకున్న మార్గమే సరైందని అంగీకరించి వెంట నడిచారని కేసీఆర్ తెలిపారు.  ప్రాణాన్ని పణంగా పెట్టి అయినా సరే లక్ష్యాన్ని సాధించాలి తప్ప అహింసా మార్గాన్ని వీడకూడదని నేను నిర్ణయించుకున్నా. ఆ నేపథ్యంలో నుంచి వచ్చిందే ఆమరణ నిరాహార దీక్ష ఆలోచన. స్వాతంత్య్ర పోరాట కాలంలో బ్రిటీష్‌ పాలనే బాగుందన్న ప్రబుద్ధుల వంటి వారు తెలంగాణ ఉద్యమ కాలంలోనూ ఉండే వారు. వారు తెలంగాణ వద్దు సమైక్య పాలనే ముద్దు అని నిస్సిగ్గుగా ప్రకటిస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చాలా చేశారు. మన చిత్తశుద్ధి ముందు వారి ప్రయత్నాలు విఫలం కాక తప్పలేదు. విచిత్రం ఏంటంటే వాళ్లే ఇవాళ మనకు తెలంగాణ ఉద్యమం గురించి పాఠాలు చెప్పడానికి సిద్ధపడుతున్నారని స్పష్టం చేశారు. 

తెలంగాణ ఏర్పాటు తర్వాత  గ్రామ స్వరాజ్యం, గ్రామ స్వయం పోషకత్వం దిశగా ముందడుగు

గ్రామ స్వరాజ్యం, గ్రామ స్వయం పోషకత్వం దిశగా మనం ఎంతో దూరం ప్రయాణించగలిగాం. గ్రామీణ వృత్తులకు ప్రోత్సాహం ఇవ్వగలిగాం. గ్రామాలు సుసంపన్నంగా మారుతున్నాయి. ప్రజలందరికీ తాగునీరు కూడా ఇంతకాలం ప్రభుత్వాలు ఇవ్వలేకపోయాయి. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచింది. సంక్షేమానికి అగ్ర తాంబూలం ఇవ్వడం లోనూ, రైతు కేంద్రంగా ప్రణాళికల రచన చేయడంలోనూ, గ్రామీణ ఆర్థిక వృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం వెనుక గాంధీగారి ప్రభావమే ఉన్నదని తెలిపారు.  భారత దేశం ఆత్మ గ్రామాల్లోనే ఉన్నదని గాంధీగారు పదే పదే చెప్పారు. ఆ మాటల ప్రేరణతోనే గ్రామీణ జీవన ప్రమాణాలను అభివృద్ధి చేసుకుంటున్నాం. తెలంగాణ మోడల్‌ ఈరోజు దేశానికి దిక్సూచిగా నిలిచింది. ఈ అభివృద్ధి నమూనా ఇదే విధంగా కొనసాగిస్తూ సకల జనులకు ప్రగతి ఫలాలను సమానంగా పంచడం ద్వారానే స్వాతంత్ర్యోద్యమ ఆశయాలను పరిపూర్తి చేసుకోగలుగుతాం. మనది న్యాయ పథం.. మనది ధర్మ పథం. సకల జనుల సంక్షేమమే మనకు సమ్మతం   అని సీఎం కేసీఆర్‌ అన్నారు.

గాంధీ సినిమా 35 లక్షల మంది వీక్షణ 

సమాచారశాఖ ఆధ్వర్యంలో ప్రదర్శించిన గాంధీ సినిమాను 35లక్షల మంది విద్యార్థులు, ఇతరులు చూసి ప్రభావితమయ్యారని తెలిపారు. గాంధీ చిత్రాన్ని ఈ తరం వారికి పరిచయం చేయడం సంతోషంగా ఉందన్నారు. మహనీయుల త్యాగాలను స్మరించుకోవటం మనందరి బాధ్యత అన్న సీఎం కేసీఆర్ స్వాతంత్ర్య సమరయోధుల గొప్పతనం నేటి తరానికి సమగ్రంగా తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. సకల జనులకు ప్రగతి ఫలాలను సమానంగా పంచడం ద్వారానే స్వాతంత్ర్యోద్యమ ఆశయాలను పరిపూర్తి చేసుకోగలుగుతామని తెలంగాణ ముఖ్యమంత్రి అభిల‌షించారు. ముందుగాహెచ్‌ఐసీసీ వద్ద ఏర్పాటు చేసిన జాతీయ పతాకాన్ని సీఎం ఆవిష్కరించారు. సాంస్కృతిక కార్యక్రమాలను సీఎం కేసీఆర్‌, పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు వీక్షించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Airbus: ఏపీలో ఎయిర్‌బస్ హెలికాప్టర్ల తయారీ ప్లాంట్ -  నేడో రేపో కీలక ప్రకటన చేసే చాన్స్
ఏపీలో ఎయిర్‌బస్ హెలికాప్టర్ల తయారీ ప్లాంట్ - నేడో రేపో కీలక ప్రకటన చేసే చాన్స్
Kolikapudi Srinivas: తిరువూరు ఎమ్మెల్యేపై వేటుకు రంగం సిద్ధం - సోమవారం నిర్ణయం తీసుకోనున్న టీడీపీ
తిరువూరు ఎమ్మెల్యేపై వేటుకు రంగం సిద్ధం - సోమవారం నిర్ణయం తీసుకోనున్న టీడీపీ
Hyderabad Outer Ring Rail Project:రీజినల్‌ రింగు రోడ్డు తరహలోనే హైదరాబాద్‌లో మరో బిగ్ ప్రాజెక్టు
రీజినల్‌ రింగు రోడ్డు తరహలోనే హైదరాబాద్‌లో మరో బిగ్ ప్రాజెక్టు
Lokesh Deputy CM: నిన్న మహాసేన రాజేష్, ఇవాళ శ్రీనివాస్ రెడ్డి - లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయయాాలని డిమాండ్ - ప్లానేనా ?
నిన్న మహాసేన రాజేష్, ఇవాళ శ్రీనివాస్ రెడ్డి - లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయయాాలని డిమాండ్ - ప్లానేనా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Anil Ravipudi Cringe Movies Director | Sankranthiki Vasthunnam తో వందకోట్లు కొట్టినా వేస్ట్ డైరెక్టరేనా.? | ABP DesamAI Videos Impact | ఏఐ వీడియోలు చేస్తున్న అరాచకాలు గమనించారా | ABP DesamBidar Robbers Hyderabad Gun Fire | లక్షల డబ్బు కొట్టేశారు..మనీ బాక్సుతో పారిపోతూ ఉన్నారు | ABP DesamKonaseema prabhala Teertham | కోలాహలంగా కోనసీమ ప్రభల తీర్థం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Airbus: ఏపీలో ఎయిర్‌బస్ హెలికాప్టర్ల తయారీ ప్లాంట్ -  నేడో రేపో కీలక ప్రకటన చేసే చాన్స్
ఏపీలో ఎయిర్‌బస్ హెలికాప్టర్ల తయారీ ప్లాంట్ - నేడో రేపో కీలక ప్రకటన చేసే చాన్స్
Kolikapudi Srinivas: తిరువూరు ఎమ్మెల్యేపై వేటుకు రంగం సిద్ధం - సోమవారం నిర్ణయం తీసుకోనున్న టీడీపీ
తిరువూరు ఎమ్మెల్యేపై వేటుకు రంగం సిద్ధం - సోమవారం నిర్ణయం తీసుకోనున్న టీడీపీ
Hyderabad Outer Ring Rail Project:రీజినల్‌ రింగు రోడ్డు తరహలోనే హైదరాబాద్‌లో మరో బిగ్ ప్రాజెక్టు
రీజినల్‌ రింగు రోడ్డు తరహలోనే హైదరాబాద్‌లో మరో బిగ్ ప్రాజెక్టు
Lokesh Deputy CM: నిన్న మహాసేన రాజేష్, ఇవాళ శ్రీనివాస్ రెడ్డి - లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయయాాలని డిమాండ్ - ప్లానేనా ?
నిన్న మహాసేన రాజేష్, ఇవాళ శ్రీనివాస్ రెడ్డి - లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయయాాలని డిమాండ్ - ప్లానేనా ?
Delhi Assembly Election 2025:అరవింద్ కేజ్రీవాల్‌పై దాడి, పర్వేష్ వర్మ మద్దతుదారుల పనిగా ఆప్ ఆరోపణ 
అరవింద్ కేజ్రీవాల్‌పై దాడి, పర్వేష్ వర్మ మద్దతుదారుల పనిగా ఆప్ ఆరోపణ 
Manchu Family Issue:  మనోజ్‌కు షాక్ ఇచ్చిన మోహన్ బాబు - తన ఆస్తుల నుంచి గెంటివేత !
మనోజ్‌కు షాక్ ఇచ్చిన మోహన్ బాబు - తన ఆస్తుల నుంచి గెంటివేత !
ICC Champions Trophy: బుమ్రా తిరిగొచ్చాడు.. కరుణ్ నాయర్ కు మొండిచెయ్యి.. మెగాటోర్నీకి భారత జట్టు ప్రకటన
బుమ్రా తిరిగొచ్చాడు.. కరుణ్ నాయర్ కు మొండిచెయ్యి.. మెగాటోర్నీకి భారత జట్టు ప్రకటన
Crime News:  అఫ్జల్‌గంజ్‌ కాల్పుల కేసులో నిందితుడి గుర్తింపు! పాత కేసుల్లో బిహార్‌లో క్యాష్ రివార్డ్!
అఫ్జల్‌గంజ్‌ కాల్పుల కేసులో నిందితుడి గుర్తింపు! పాత కేసుల్లో బిహార్‌లో క్యాష్ రివార్డ్!
Embed widget