Breaking News Live: నేడు శివరాత్రి, భక్తులతో కిటకిటలాడుతున్న శైవ క్షేత్రాలు
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

Background
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పొడి గాలులు తగ్గడంతో కనిష్ట ఉష్ణోగ్రత దిగొచ్చింది. పగటి పూట వేడి, ఉక్కపోత ఉన్నా, సోమవారం రాత్రి చలి మళ్లీ పెరిగింది. కొన్ని చోట్ల కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీలు నమోదైంది. ఆగ్నేయ దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో ఏపీలో మరికొన్ని రోజులపాటు వాతావరణం పొడిగా ఉంటుంది.
ఆగ్రేయ గాలులు ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో వీచడంతో వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వేడి గాలులు కాస్త తగ్గాయి. పగటి ఉష్ణోగ్రతలు కొన్నిచోట్ల 36 డిగ్రీలు నమోదు కాగా, రాత్రి ఉష్ణోగ్రతలు అందులో సగం కూడా లేవు. మత్స్యాకారులకు వేటకు వెళ్లేందుకు ఎలాంటి ఆంక్షలు లేవని వెదర్ అప్‌డేట్‌లో పేర్కొన్నారు. అత్యల్పంగా కళింగపట్నంలో 15.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. జంగమేశ్వరపురంలో 17.2 డిగ్రీలు, బాపట్లలో 18.3 డిగ్రీలు, నందిగామలో 17.9 డిగ్రీలు, అమరావతిలో 18.4 డిగ్రీలు, తునిలో 18.7 డిగ్రీలు, విశాఖపట్నంలో 17.8 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
రాయలసీమలో ఉదయం వేడి.. రాత్రి చలి
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో పగటి పూట అధిక ఉష్ణోగ్రతలు నమోదు కాగా, ఇక్కడ సైతం రాత్రిపూట చలి మళ్లీ పెరిగింది. కొన్ని రోజుల కిందటి వరకు చలికి గజగజ వణికిన ఆరోగ్యవరంలో 16 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రత నమోదైందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. అనంతపురంలో 18.3 డిగ్రీలు, కర్నూలులో 17.9 డిగ్రీలు నంద్యాలలో 17.2 డిగ్రీలు, తిరుపతిలో 19 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైంది.
తెలంగాణ వెదర్ అప్‌డేట్..
తెలంగాణలో కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గరిష్ట ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలు దాటే అవకాశం ఉంది. ఆగ్నేయ దిశ నుంచి గంటలకు 6 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. భద్రాచలంలో, ఆదిలాబాద్‌లో, హైదరాబాద్‌లో 30 డిగ్రీలకు పైగా పగతి ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.
బంగారం, వెండి ధరలు
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు (Todays Gold Rate) విపరీతంగా పెరిగింది. ఉక్రెయిన్ - రష్యా పరిణామంతో నాలుగు రోజుల క్రితం బంగారం ధర అతి భారీగా ఎగబాకిన సంగతి తెలిసిందే. తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చి.. ఇప్పుడు మళ్లీ పెరిగాయి. తాజాగా గ్రాముకు ఏకంగా రూ.66 చొప్పున పెరిగింది. వెండి ధర మాత్రం రూ.0.90 పైసలు పెరిగింది. దీంతో తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్ (Hyderabad Gold Rate) మార్కెట్‌లో రూ.47,000 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.51,280 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో రూ.69,900 వద్ద ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.
ఏపీలో బంగారం రేట్లు ఇవీ.. (Gold Rates in Andhrapradesh)
ఇక విశాఖపట్నం (Gold Rate in Vizag) మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,000 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,280గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.69,900 గా ఉంది. విజయవాడలోనూ పసిడి ధర స్వల్పంగా పెరిగింది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.47,000 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.51,280గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.69,900 వేలుగా ఉంది.
KCR Meet Kejriwal: దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌తో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ
దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌తో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. బీజేపీకి వ్యతిరేకంగా పార్టీలను కూడగడుతున్న కేసీఆర్.. ఆ దిశగా కేజ్రీవాల్‌తో చర్చించారు. ఇప్పటికే మహారాష్ట్ర సీఎంతో భేటీ అయ్యి తన స్ట్రాటజీ వివరించారు. ఇప్పుడు కేజ్రీవాల్‌తో సమావేశమయ్యారు.
KCR: తమిళనాడు సీఎం స్టాలిన్‌కు కేసీఆర్ శుభాకాంక్షలు
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు, సీఎం కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా స్టాలిన్‌కు ఫోన్ చేశారు. ఆయురారోగ్యాలతో కలకాలం సుఖ సంతోషాలతో జీవించాలని, తాను మరిన్ని విజయాలు సాధించాలని, కోరుకున్న లక్ష్యాలను స్టాలిన్ చేరుకోవాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. తనకు జన్మ దిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్‌కు ఎంకే స్టాలిన్ కృతజ్ఞతలు తెలిపారు.





















