అన్వేషించండి

MLC Kavitha : కవిత డీఫాల్ట్ బెయిల్ పిటిషన్ ఉపసంహరణ - జైల్లోనే ఉండాలనుకుంటున్నారా ?

Kavitha Bail Petition : ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ ఉపసంహరించుకున్నారు. సీబీఐ చార్జిషీట్‌లో లోపాలున్నాయని తనకు బెయిల్ ఇవ్వాలని ఆ పిటిషన్ దాఖలుచేశారు.

Delhi Liquor Scam :  ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. సీబీఐ కోర్టులో తాను దాఖలుచ చేసిన డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ ను ఉపసంహరించుకున్నారు. నిజానికి ఈ పిటిషన్ దాఖలు చేశారు కానీ వాదనలు వినిపించలేదు. పదే పదే వాయిదాలు కోరారు. సోమవారం కూడా ఈ పిటిషన్‌పై రౌస్ అవెవ్యూ కోర్టు విచారణ జరిపింది. అయితే సీనియర్ లాయర్లు రానందున కేసు వాయిదా వేయాలని కవిత తరపు లాయర్లు కోరారు. దీంతో న్యాయమూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం ఎట్టి పరిస్థితుల్లోనూ వాదనలు వినిపించాలన్నారు. అయితే మంగళవారమే పిటిషన్ ఉపసంహరించుకుంటామని కవిత లాయర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 

కోర్టు కూడా అంగీకరించింది. అయితే కవిత హఠాత్తుగా డీఫాల్ట్  బెయిల్ పిటిషన్ ఉపసంహరించుకోవడం ఆసక్తికరంగా మారింది. సీబీఐ చార్జిషీటులో లోపాలు ఉన్నాయని కవిత ప్రధానగా ఈ డీఫాల్ట్  బెయిల్ పిటి,న్ దాఖలు చేశారు. కానీ ఇటీవల సీబీఐ చార్జిషీటును కోర్టు పరిగణనలోకి తీసుకుంది. కోర్టే పరిగణనలోకి తీసుకున్నప్పుడు లోపాలు ఉంటాయని ఎలా అంటారని న్యాయస్థానం ప్రశ్నించి.. పిటిషన్ ను డిస్మిస్ చేసే అవకాశాలు ఉన్నాయని ఆమె తరపు లాయర్లు అనకోవడం వల్లనే ఈ పిటిషన్ ఉపసంహరించుకున్నట్లుగా తెలుస్తోంది. తర్వాత అసలు బెయిల్ పిటిషన్‌పై వాదనల్లో ప్రభావం చూపకుండా ఉపసంహరించుకోవడమే మంచిదని అనుకున్నారని అంచనా వేస్తున్నారు. 

 మద్యం కుంభకోణంలో మనీలాండరింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఈడీ అధికారులు   కవితను మార్చి 15వ తేదీన హైదరాబాద్‌లోని ఆమె నివాసంలోనే అరెస్ట్ చేశారు.   ఆమె ఇంట్లో తనిఖీలు నిర్వహించిన అధికారులు.. అదే రోజు సాయంత్రం  అదుపులోకి తీసుకుని ఢిల్లీ తరలించారు.  అప్పటి నుంచి కొన్ని రోజుల పాటు ఆమె ఈడీ కస్టడీలో ఉన్నారు. ఆపై ఆమెను తీహార్ జైలులో జ్యుడిషియల్ కస్టడీలో ఉంచారు.  అనంతరం  తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కవితను సీబీఐ అధికారులు ఏప్రిల్ 11న అరెస్టు చేశారు.   ఐదు నెలలుగా తీహార్ జైలులో ఉంటున్నారు. మంగళవారం తీహార్ జైల్లో ఉన్న కవితతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీష్ రావులు ములాఖత్ అయ్యారు.                              

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో దర్యాప్తు పూర్తయిందని ఇటీవలే సీబీఐ కోర్టుకు తెలిపింది.  ఇప్పుడు దర్యాప్తు పూర్తయినందున .. ఇక  తనకు బెయిల్ ఇవ్వాలని.. సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉండదని పూర్తి స్థాయి బెయిల్కోసం ప్రయత్నం చేసే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. అయితే కవిత అటు ఈడీ..  ఇటు సీబీఐ  కేసుల్లోనూ బెయిల్ తెచ్చుకోవాల్సి  ఉంది. అలా అయితేనే ఆమె   బయటకు రాగలరు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీావాల్ కు ఈడీ కేసులో బెయిల్ వచ్చింది కానీ సీబీఐ కేసులో ఇం కా రాలేదు.                               

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
Trump: గ్రీన్ కార్డ్ లాటరీని రద్దు చేసిన ట్రంప్ సర్కార్ - ఇక అమెరికా పౌరసత్వం కల్లేనా? ఇవిగో డీటైల్స్
గ్రీన్ కార్డ్ లాటరీని రద్దు చేసిన ట్రంప్ సర్కార్ - ఇక అమెరికా పౌరసత్వం కల్లేనా? ఇవిగో డీటైల్స్
Bangladesh Protest:బంగ్లాదేశ్‌లో ఘర్షణలతో భారత్‌ అలర్ట్‌! సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం
బంగ్లాదేశ్‌లో ఘర్షణలతో భారత్‌ అలర్ట్‌! సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం
Balakrishna : 'వారణాసి'లో బాలయ్య - కాశీ విశ్వేశ్వరుని సన్నిధిలో 'అఖండ 2' టీం... ఫోటోలు వైరల్
'వారణాసి'లో బాలయ్య - కాశీ విశ్వేశ్వరుని సన్నిధిలో 'అఖండ 2' టీం... ఫోటోలు వైరల్

వీడియోలు

టీమిండియా, సౌతాఫ్రికా మధ్య నేడు ఆఖరి పోరు
సంజూ.. చుక్కలు చూపించాల!
కోహ్లీ రికార్డ్‌ బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో అభిషేక్ శర్మ
టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్
G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
Trump: గ్రీన్ కార్డ్ లాటరీని రద్దు చేసిన ట్రంప్ సర్కార్ - ఇక అమెరికా పౌరసత్వం కల్లేనా? ఇవిగో డీటైల్స్
గ్రీన్ కార్డ్ లాటరీని రద్దు చేసిన ట్రంప్ సర్కార్ - ఇక అమెరికా పౌరసత్వం కల్లేనా? ఇవిగో డీటైల్స్
Bangladesh Protest:బంగ్లాదేశ్‌లో ఘర్షణలతో భారత్‌ అలర్ట్‌! సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం
బంగ్లాదేశ్‌లో ఘర్షణలతో భారత్‌ అలర్ట్‌! సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం
Balakrishna : 'వారణాసి'లో బాలయ్య - కాశీ విశ్వేశ్వరుని సన్నిధిలో 'అఖండ 2' టీం... ఫోటోలు వైరల్
'వారణాసి'లో బాలయ్య - కాశీ విశ్వేశ్వరుని సన్నిధిలో 'అఖండ 2' టీం... ఫోటోలు వైరల్
Avatar Fire And Ash Box Office Day 1: ఇండియాలో రికార్డుల దిశగా 'అవతార్ 3' కలెక్షన్లు... మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చే అవకాశం ఉందంటే?
ఇండియాలో రికార్డుల దిశగా 'అవతార్ 3' కలెక్షన్లు... మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చే అవకాశం ఉందంటే?
Indonesian Hindu Religious Rights : ఏ ముస్లిం దేశంలో హిందువులకు అత్యధిక స్వేచ్ఛ లభిస్తుంది? ఆలయం ఏర్పాటు నుంచి ఈ విషయాల వరకు మినహాయింపు!
ఏ ముస్లిం దేశంలో హిందువులకు అత్యధిక స్వేచ్ఛ లభిస్తుంది? ఆలయం ఏర్పాటు నుంచి ఈ విషయాల వరకు మినహాయింపు!
Year Ender 2025: ఎన్టీఆర్‌తో పాటు 2025లో అదరగొట్టిన యాంటీ హీరోలు... బాలీవుడ్‌లో విలన్స్‌లకు సపరేట్ ఫ్యాన్‌ బేస్
ఎన్టీఆర్‌తో పాటు 2025లో అదరగొట్టిన యాంటీ హీరోలు... బాలీవుడ్‌లో విలన్స్‌లకు సపరేట్ ఫ్యాన్‌ బేస్
Vijayawada Crime News: విజయవాడలో దారుణం: పది రూపాయల కోసం ప్రాణం తీసిన మైనర్‌!
విజయవాడలో దారుణం: పది రూపాయల కోసం ప్రాణం తీసిన మైనర్‌!
Embed widget