అన్వేషించండి

Kavitha: కేసీఆర్ చుట్టూ ఉన్న దెయ్యాల్లో మొదటి దెయ్యం సంతోష్ రావే - ఆయన రేవంత్ ఇన్ఫార్మర్ - కవిత సంచలన ఆరోపణలు

Santosh Rao: కవిత సంతోష్ రావును కూడా టార్గెట్ చేశారు. ఆయన రేవంత్ ఇన్ ఫార్మర్ అని ఆరోపించారు. అలాగే కేసీఆర్ ఒంటరి కావడానికి.. పార్టీ నుంచి చాలా మంది వెళ్లిపోవడానికి కూడా ఆయనే కారణం అని అంటున్నారు.

Kavitha allegations against Santosh Rao BRS :  కేసీఆర్ పక్కన దెయ్యాల్లో మొదటి స్థానం సంతోష్ రావుదేనని కల్వకుంట్ల కవిత ఆరోపించారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆమె  ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు వచ్చిన సమయంలో సంతోష్ రావును టార్గెట్ చేశారు. కేసీఆర్ చుట్టూ ఒక ఇనుప గొలుసులా మారి, ఆయనను బాహ్య ప్రపంచానికి, చివరకు సొంత కుటుంబ సభ్యులకు కూడా దూరం చేసింది సంతోష్ రావేనని కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రజా గాయకుడు గద్దర్ ప్రగతి భవన్ గేటు వద్ద గంటల తరబడి నిలబడినా లోపలికి రానివ్వలేదని, ఈటల రాజేందర్ వంటి ఉద్యమ నేతలు పార్టీ వీడటానికి కూడా ఆయనే ప్రధాన కారణమని ఆమె మండిపడ్డారు. కేసీఆర్‌ను  అందరి నుంచి ఐసోలేట్ చేసి, పార్టీకి అత్యంత నష్టం కలిగించిన వ్యక్తిగా సంతోష్ రావును ఆమె అభివర్ణించారు.

సంతోష్ రావు ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి  ఇన్ఫార్మర్ గా వ్యవహరిస్తున్నారని కవిత చేసిన ఆరోపణ అత్యంత చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ వ్యక్తిగత విషయాలను, ఆయన ఆహారపు అలవాట్ల నుండి రాజకీయ వ్యూహాల వరకు ప్రతి చిన్న విషయాన్ని రేవంత్ రెడ్డికి చేరవేస్తున్నారని ఆమె ఎద్దేవా చేశారు. కేసీఆర్ అర ఇడ్లీ తిన్నారా.. పూర్తి ఇడ్లీ తిన్నారా అన్న విషయాన్ని కూడా చేరవేస్తారన్నారు. సంతోష్ రావు కేవలం రాజకీయంగానే కాకుండా.. వ్యక్తిగతంగా కూడా కేసీఆర్ పరువు తీసేలా వ్యవహరిస్తున్నారని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి చుట్టూ ఉన్న కోటరీని బద్దలు కొట్టాల్సిన సమయం వచ్చిందని, అందుకే ఇలాంటి వ్యక్తుల అసలు స్వరూపాన్ని బయటపెడుతున్నట్లు ఆమె స్పష్టం చేశారు.  

సంతోష్ రావు వల్ల కేవలం పార్టీకే కాదు, కుటుంబానికి కూడా తీరని నష్టం జరిగిందని కవిత మాటల్లో స్పష్టమవుతోంది. కవితకు, కేసీఆర్‌కు మధ్య దూరం పెరగడానికి, తండ్రీకూతుళ్ల మధ్య తప్పుడు సమాచారంతో చిచ్చు పెట్టడానికి సంతోష్ రావు నిరంతరం ప్రయత్నించారని ఆమె ఆరోపిస్తున్నారు.   ఢిల్లీ లిక్కర్ స్కామ్ సమయంలో కూడా తనకు ఆశించిన స్థాయిలో పార్టీ నుంచి మద్దతు లభించకపోవడం వెనుక సంతోష్ రావు హస్తం ఉందని కవిత గట్టిగా నమ్ముతున్నట్లు తెలుస్తోంది.              

అయితే కవిత ఆరోపణలు బీఆర్ఎస్ అగ్రనేతల్లో పెద్దగా కదలిక సృష్టించడం కష్టమని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కవిత ఇప్పటికే సొంత పార్టీ ప్రయత్నాల్లో ఉన్నారు. బీఆర్ఎస్ ను బలహీనం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని అందులో భాగంగా నే హరీష్ రావు, సంతోష్ రావులను టార్గెట్ చేస్తున్నారని అనుమానిస్తున్నారు. వారి ట్రాప్ లో పడకూడదని పార్టీ ముఖ్యలు..ఎవరూ ఇలాంటి అంశాలపై స్పందించవద్దని సంకేతాలు ఇస్తున్నట్లుగా తెలుస్తోంది.   

టాప్ హెడ్ లైన్స్

BRS MLCs: ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌కుమార్ రెడ్డిలకు కోర్టులో ఊరట.. అంతలోనే వారికి బిగ్ షాక్!
ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌కుమార్ రెడ్డిలకు కోర్టులో ఊరట.. అంతలోనే వారికి బిగ్ షాక్!
Ganesh Chaturthi 2026: ఆన్‌లైన్‌లో గణేశ్‌ మండపాల నమోదు తప్పనిసరి.. ఎలా చేయాలో తెలిపిన సజ్జనార్‌
ఆన్‌లైన్‌లో గణేశ్‌ మండపాల నమోదు తప్పనిసరి.. ఎలా చేయాలో తెలిపిన సజ్జనార్‌
Telangana Speaker Gaddam Prasad: వెనక్కి తగ్గని హరీష్ రావు.. సభ నుంచి తప్పుకున్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
వెనక్కి తగ్గని హరీష్ రావు.. సభ నుంచి తప్పుకున్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
KTR And Harish Rao Arrest: ఎర్రవల్లికి వెళ్తున్న కేటీఆర్, హరీష్ రావు అరెస్ట్! మా ఇంటికి మేం వెళ్లకూడదా అంటూ ఆగ్రహం
ఎర్రవల్లికి వెళ్తున్న కేటీఆర్, హరీష్ రావు అరెస్ట్! మా ఇంటికి మేం వెళ్లకూడదా అంటూ ఆగ్రహం

వీడియోలు

Ishan Kishan 270 In Duleep Trophy Final | డబుల్ సెంచరీ వెనుక రహస్యాన్ని చెప్పిన ఇషాన్ కిషన్
Fatima Sana Women's Asia Cup 2026 | పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనాకు ఐసీసీ షాక్
Telangana Politics | BRS MLC Arrest | తెల్లవారుజామున BRS ఎమ్మెల్సీల అరెస్ట్.. తాతా మధు, నవీన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
KTR challenges Congress | ఎమ్మెల్సీల అరెస్ట్‌పై కేటీఆర్ ఫైర్.. “మేమంతా అరెస్ట్‌కు సిద్ధం.. మీరు సిద్ధమా?”
Mohsin Naqvi Women's Asia Cup 2026 | టీమిండియా గెలిస్తే ట్రోఫీ ఇస్తారా? నఖ్వీ రాకతో మళ్లీ వివాదం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu: డేటా సెంటర్లకు నీళ్లు అసలు సమస్యే కాదు, లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది: చంద్రబాబు
డేటా సెంటర్లకు నీళ్లు అసలు సమస్యే కాదు, లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది: చంద్రబాబు
Historic IND VS JPN Clash: వ‌ర‌ల్డ్ ఛాంపియన్ ఇండియాతో చారిత్రాత్మక పోరుకు జపాన్  సిద్ధం.. జ‌ట్టును ప్ర‌క‌టించిన ఆ దేశ క్రికెట్ బోర్డు
వ‌ర‌ల్డ్ ఛాంపియన్ ఇండియాతో చారిత్రాత్మక పోరుకు జపాన్  సిద్ధం.. జ‌ట్టును ప్ర‌క‌టించిన ఆ దేశ క్రికెట్ బోర్డు
Telangana Assembly Sessions: నీ తల్లిని కాదు నా తల్లిని అవమానించారు.. దీనికేం చెబుతావు? హరీష్ రావుపై స్పీకర్ మండిపాటు
నీ తల్లిని కాదు నా తల్లిని అవమానించారు.. దీనికేం చెబుతావు? హరీష్ రావుపై స్పీకర్ మండిపాటు
KTR Challenge: 420 హామీలు నెరవేర్చుతామంటే మేమే అరెస్ట్ అవుతాం! అందుకు సిద్ధమా? కేటీఆర్ ఛాలెంజ్
420 హామీలు నెరవేర్చుతామంటే మేమే అరెస్ట్ అవుతాం! అందుకు సిద్ధమా? కేటీఆర్ ఛాలెంజ్
Anaswara Rajan: కాకా కూతురు అమ్ములు పాప... చిరంజీవి సినిమాలో అనస్వర రాజన్ ఫస్ట్ లుక్ రిలీజ్... బర్త్‌డే స్పెషల్
కాకా కూతురు అమ్ములు పాప... చిరంజీవి సినిమాలో అనస్వర రాజన్ ఫస్ట్ లుక్ రిలీజ్... బర్త్‌డే స్పెషల్
2026 మారుతి బలెనో ఫేస్‌లిఫ్ట్‌ vs పాత మోడల్‌.. మైలేజ్, పవర్‌లో వచ్చిన మార్పులేంటి?
2026 మారుతి బలెనో ఫేస్‌లిఫ్ట్‌ ఎంత మైలేజ్ ఇస్తుంది? కంపెనీ లెక్కలు చూస్తే షాకే!
Dates Benefits : ఖాళీ కడుపుతో ఖర్జూరాలు తింటే కలిగే ప్రయోజనాలు ఇవే.. రోజుకు ఎన్ని తింటే మంచిది
ఖాళీ కడుపుతో ఖర్జూరాలు తింటే కలిగే ప్రయోజనాలు ఇవే.. రోజుకు ఎన్ని తింటే మంచిది
KL Rahul Future Clarity: ట్రేడింగ్ రూమర్లకు చెక్ పెట్టిన రాహుల్..తన ట్వీట్ తో క్లారిటీ , ఇక హార్దిక్ పాండ్యా ఇష్యూలో మ‌రో ట్విస్ట్
ట్రేడింగ్ రూమర్లకు చెక్ పెట్టిన రాహుల్..తన ట్వీట్ తో క్లారిటీ , ఇక హార్దిక్ పాండ్యా ఇష్యూలో మ‌రో ట్విస్ట్
Embed widget