News
News
X

వానాకాలం ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ పూర్తి, ఈ నెల 24 వరకూ చివరి ఛాన్స్: మంత్రి గంగుల

రైతుల వద్ద ధాన్యం ఉంటే ఈ నెల 24 వరకూ సేకరిస్తామని, రికార్డు స్థాయిలో 64.30 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణతో 2022-23 వానాకాలం ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ముగిసిందన్నారు మంత్రి గంగుల కమలాకర్.

FOLLOW US: 
Share:

రాష్ట్రంలో వానాకాలం ధాన్యం సేకరణ రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా ముగిసిందని తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సీఎం కేసీఆర్ అనుసరిస్తున్న వ్యవసాయ అనుకూల విధానాలతో ధాన్యం సేకరణ ఏఏటికాయేడు పెరిగిపోతుందని, ఎక్కడైనా రైతుల వద్ద ధాన్యం ఉంటే ఈ నెల 24 వరకూ సేకరిస్తామని, రికార్డు స్థాయిలో 64.30 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణతో 2022-23 వానాకాలం ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ముగిసిందన్నారు. మంత్రుల నివాస సముదాయంలో శనివారం పౌరసరఫరాల కమిషనర్ వి. అనిల్ కుమార్ ఇతర ఉన్నతాధికారులతో కలిసి వానాకాలం కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించారు.

64.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు 
సీఎం కేసీఆర్ మార్గదర్శనంలో రైతులకు చిన్న ఇబ్బందులు కూడా తలెత్తకుండా అత్యద్భుతంగా వానాకాలం ధాన్యం కొనుగోళ్లు చేసామన్నారు మంత్రి గంగుల కమలాకర్. అక్టోబర్ 21న ప్రారంభమైన వానాకాలం పంట సేకరణ మూడునెల్లకు పైగా 94 రోజులు నిరంతరాయంగా నిర్వహించామని, మారుమూల ప్రాంతాల రైతులు సైతం రవాణా కోసం వెతలు పడకుండా, వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అందుబాటులోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసామన్నారు మంత్రి గంగుల. రాష్ట్రంలో 7024 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసామని వీటి ద్వారా 13,570 కోట్ల విలువ గల 64.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 9 లక్షల 76వేల మంది రైతుల నుండి సేకరించామన్నారు. ఓపీఎంఎస్లో నమోదైన 12,700 కోట్లను చెల్లించామని మిగతావారికి సైతం వారం రోజుల్లోనే డబ్బులు అందజేస్తామన్నారు మంత్రి గంగుల కమలాకర్. 

ఈ అత్యధిక సేకరణ కోసం ఎక్కడా గన్నీ బ్యాగుల కొరత లేకుండా వ్యయ ప్రయాసల కోర్చి గన్నీలను సేకరించామని, 16 కోట్ల గన్నీలు వాడగా ఎంత ధాన్యం వచ్చినా సేకరించేందుకు అనువుగా మరో ఐదున్నర కోట్ల గన్నీలు అధనంగా సమకూర్చుకున్నామన్నారు. రాష్ట్రంలో యాసంగి నాట్లు ప్రారంభమైనందున గత వానాకాలంలో లేటుగా నాట్లేసిన వారికి సైతం ఈనెల 24 వరకూ ధాన్యం అమ్ముకోవడానికి అవకాశం ఉందని, రైతులు ఈ అవకాశాన్ని వాడుకొని తమ ధాన్యాన్ని అమ్ముకోవాలని మంత్రి గంగుల అన్నారు. 

బహిరంగ మార్గెట్లలోనూ అత్యధిక ధర 
2014లో కేవలం 24.29 లక్షల మెట్రిక్ టన్నుల నుండి దేశంలో పంజాబ్ తర్వాత అత్యధికంగా వరి ధాన్యం సేకరించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని, 2014-15లో 11.04 LMT’s ఉన్న వానాకాలం ధాన్యం సేకరణ గతేడాది వరకూ 70.44 LMT’s కు చేరుకోవడం తెలంగాణలో అమలవుతున్న రైతు సంక్షేమ ప్రభుత్వానికి నిదర్శనమన్నారు. ఈ ఏడాది బహిరంగ మార్గెట్లలోనూ అత్యధిక ధర లభించడం సంతోషకర పరిణామమన్నారు మంత్రి గంగుల కమలాకర్. 

ఈ వానాకాలంలో అత్యధికంగా నిజమాబాద్లో 5.86 లక్షల మెట్రిక్ టన్నులు, కామారెడ్డిలో 4.75, నల్గొండలో 4.13, మెదక్ 3.95, జగిత్యాలలో 3.79 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించగా అత్యల్పంగా ఆదిలాబాద్లో 2264 మెట్రిక్ టన్నులు, మేడ్చల్లో 14361, ఆసిఫాబాద్లో 21548, రంగారెడ్డి 22164, గద్వాల్లో24181 మెట్రిక్ టన్నులు సేకరించామన్నారు, ఈ ధాన్యం సీఎంఆర్ ప్రక్రియ సైతం వేగంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. రికార్డు స్థాయిలో సుధీర్ఘంగా జరిగిన ధాన్యం కొనుగోల్లకు సహకరించిన రైతులకు, హమాలీలు, ప్యాక్స్, ఐకేపీ యంత్రాంగం, సివిల్ సప్లైస్ అధికారులకు మంత్రి గంగుల కమలాకర్ అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ వి.అనిల్ కుమార్, జాయింట్ కమిషనర్ ఉషారాణి, సివిల్ సప్లైస్ కార్పోరేషన్ జీఎం రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Published at : 21 Jan 2023 04:18 PM (IST) Tags: Gangula kamalakar Farmers Paddy Procurement Telangana KCR

సంబంధిత కథనాలు

తెలంగాణలోని ఆ ఏడు జిల్లాలకు మాత్రం ఆరెంజ్‌ అలెర్ట్‌!

తెలంగాణలోని ఆ ఏడు జిల్లాలకు మాత్రం ఆరెంజ్‌ అలెర్ట్‌!

వర్ధన్నపేటలో వైఎస్ షర్మిల ఫ్లెక్సీలు చింపేసిన బీఆర్ఎస్ కార్యకర్తలు

వర్ధన్నపేటలో వైఎస్ షర్మిల ఫ్లెక్సీలు చింపేసిన బీఆర్ఎస్ కార్యకర్తలు

Telangana Budget 2023: అభివృద్ధిలో దేశానికే ఆదర్శం నా తెలంగాణ- బడ్జెట్ ప్రసంగంలో గవర్నర్‌ తమిళిసై

Telangana Budget 2023: అభివృద్ధిలో దేశానికే ఆదర్శం నా తెలంగాణ- బడ్జెట్ ప్రసంగంలో గవర్నర్‌ తమిళిసై

BRS Vs BJP: కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, ఖర్మరా బాబూ అంటున్న మంత్రి కేటీఆర్

BRS Vs BJP: కరీంనగర్ ఎంపీ బండి సంజయ్,  ఖర్మరా బాబూ అంటున్న మంత్రి కేటీఆర్

Karimnagar News: వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో జడ్పీ సీఈఓ గానం

Karimnagar News: వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో జడ్పీ సీఈఓ గానం

టాప్ స్టోరీస్

Peddagattu Jatara 2023 Effect: హైదరాబాద్‌ - విజయవాడ హైవేపై ఈ నెల 9 వరకు ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపులు ఇలా

Peddagattu Jatara 2023 Effect: హైదరాబాద్‌ - విజయవాడ హైవేపై ఈ నెల 9 వరకు ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపులు ఇలా

Buggana Rajendranath: మూడేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన అప్పులు రూ.1.34 లక్షల కోట్లు: మంత్రి బుగ్గన

Buggana Rajendranath: మూడేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన అప్పులు రూ.1.34 లక్షల కోట్లు: మంత్రి బుగ్గన

Hero Naveen Reddy : టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ రెడ్డి అరెస్టు, చీటింగ్ చేసి జల్సాలు!

Hero Naveen Reddy : టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ రెడ్డి అరెస్టు, చీటింగ్ చేసి జల్సాలు!

AOC Recruitment 2023: పదోతరగతి అర్హతతో 'ఇండియన్ ఆర్మీ'లో ఉద్యోగాలు, 1793 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల!

AOC Recruitment 2023: పదోతరగతి అర్హతతో  'ఇండియన్ ఆర్మీ'లో ఉద్యోగాలు, 1793  పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల!