అన్వేషించండి

Konda Surekha News: నిబంధనల ప్రకారం కోడెల పంపిణీ, దుష్ప్రచారం చేస్తే చర్యలు- వేములవాడ వివాదంపై మంత్రి కొండా సురేఖ

Vemulawada Temple cow distribution | వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలోని కోడెలను అక్రమంగా విక్రయించినట్లు వచ్చిన వార్తల్లో నిజంలేదని, ప్రచారంలో ఉన్న వార్తలను మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు.

వరంగల్: వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలోని కోడెలను అక్రమంగా విక్రయించినట్లు వచ్చిన వార్తల్లో నిజంలేదని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. తెలంగాణ అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయశాఖల మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై బురదజల్లే రీతిలో కుట్రపూరితంగా దుష్ప్రచారం జరిగిందంటూ, ప్రచారంలో ఉన్న వార్తలను ఖండించారు. 

నిర్వహణ భారం... పంపిణీ కోసం కమిటీ
గత ప్రభుత్వ హయాంలో వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి భక్తులు సమర్పించిన కోడెల సంఖ్య పెరుగుతుండటంతో కోడెల నిర్వహణ భారంగా మారి చాలా కోడెలు మరణించిన విషయాన్ని మంత్రి కొండా సురేఖ గుర్తు చేశారు. ఈ క్రమంలో భక్తుల విన్నపాల మేరకు మొక్కుల రూపంలో భక్తులు సమర్పించిన కోడెల నిర్వహణ నిమిత్తం విధివిధానాలను రూపొందించేందుకు ఆరు నెలల క్రితం మే నెలలో సిరిసిల్ల జిల్లా కలెక్టర్ చైర్మన్ గా, వేములవాడ ఆలయ ఈవో కన్వీనర్ గా, పలువురు ఇతర సభ్యులతో ఏర్పాటు చేసిన కమిటి మార్గదర్శకాలను రూపొందించినట్లు మంత్రి సురేఖ స్పష్టం చేశారు. ఈ మేరకు జీవో విడుదల చేసిన విషయాన్ని మంత్రి సురేఖ గుర్తు చేశారు. 
రైతుకు రెండు కోడెలు మాత్రమే..
ఈ మార్గదర్శకాల ప్రకారం పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్ కార్డు, ఫోన్ నంబర్, సంబంధిత మండల అగ్రికల్చర్ ఆఫీసర్ ధ్రువీకరణ పత్రం వుంటేనే పంపిణీ చేస్తున్నట్లు మంత్రి సురేఖ గుర్తు చేశారు. ధ్రువీకరణ పత్రాలు నిబంధనలకు అనుగుణంగా వుంటేనే  ఒక రైతుకు రెండు కోడెల చొప్పున మాత్రమే ఇస్తున్న విషయాన్ని మంత్రి సురేఖ స్పష్టం చేశారు. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కోడెల సంరక్షణ కోసం గోశాలలో సిసి ఫ్లోరింగ్, సరిపడా షెడ్లు, తాగునీటి వసతి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు మంత్రి సురేఖ వివరించారు. మూగజీవాల పై తమ ప్రభుత్వానికున్న శ్రద్ధ అటువంటిది అన్నారు. ఎంతో నిబద్ధతతో గోశాలల నిర్వహణ, గోవుల సంరక్షణను చేపడుతున్న పరిస్థితుల్లో కోడెలను అక్రమంగా విక్రయించారని వచ్చిన వదంతులను  మంత్రి కొండా సురేఖ కొట్టి పారేశారు. 

Also Read: Telangana Talli Statue: తెలంగాణ తల్లి రూపం మార్చడంపై హైకోర్టులో పిటిషన్‌, తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ! 

నిబంధనల ప్రకారం కోడెల పంపిణీ
సాధారణంగా తన వద్దకు వచ్చే దరఖాస్తులను పరిశీలించాలని సంబంధింత అధికారులకు సూచిస్తుంటామని, కోడెల పంపిణీకి సంబంధించి వచ్చిన దరఖాస్తులను అదే విధంగా పంపించామని మంత్రి సురేఖ స్పష్టం చేశారు. దేవస్థానం అధికారులు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే రైతులకు కోడెలను పంపిణీ చేసారని మంత్రి పునరుద్ఘాటించారు. ఇందులో ఎలాంటి అవకతవకలు, అక్రమాలు జరగలేదని మంత్రి కొండా సురేఖ తేల్చి చెప్పారు.

 

వేములవాడ రాజరాజేశ్వర దేవస్థానంలోని ప్రతి కోడెకు శాశ్వతమైన ట్యాగ్ వుంటుందని, అటువంటి ట్యాగ్ లున్న కోడెలు ఎక్కడా పట్టుబడలేదని మంత్రి సురేఖ స్పష్టం చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి నిజానిజాలను వెల్లడిస్తూ నిన్న వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థాన ఈవో స్పష్టతనిచ్చిన విషయాన్ని మంత్రి సురేఖ గుర్తు చేశారు. ప్రభుత్వం హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నదని అవాస్తవ ప్రచారం చేస్తూ, సమాజంలో అశాంతిని సృష్టించే అసాంఘిక శక్తులను వెలికితీసి, చట్టపరంగా చర్యలు చేపడతామని మంత్రి సురేఖ స్పష్టం చేశారు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
Cheyutha Pensions: తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
Telangana NEET Cutoff: తెలంగాణలో ఎంబీబీఎస్ సీటు రావాలంటే నీట్‌ ర్యాంక్ ఎంత ఉండాలి? పూర్తి కటాఫ్ వివరాలు ఏంటీ?
తెలంగాణలో ఎంబీబీఎస్ సీటు రావాలంటే నీట్‌ ర్యాంక్ ఎంత ఉండాలి? పూర్తి కటాఫ్ వివరాలు ఏంటీ?
TGPSC FBO Notification 2026: తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాలు! 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ పోస్టులకు త్వరలో ప్రకటన!
తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాలు! 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ పోస్టులకు త్వరలో ప్రకటన!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Rukmini Vasanth : అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
ఈ నెలలో Kia కారు కొంటే రూ.లక్షల్లో ఆదా.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్‌ ఉందంటే?
కియా కారు కొనేవాళ్లకు సర్‌ప్రైజ్‌ - రూ.లక్షన్నర మిగిలినట్లే!, ఈ డబ్బుతో మంచి బైక్‌ కొనొచ్చు
Mouneesha Chowdary: బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. జోరుగా ప్రచారం.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు!
Embed widget