Karimnagar News: నెల రోజుల వ్యవధిలో ఒకే కుటుంబంలో నలుగురు మృతి- గ్రామంలో తీవ్ర విషాదం!
Karimnagar News: కరీంనగర్ లో ఒకే కుటుంబంలోని నలుగురి మరణాలు మిస్టరీగా మారాయి. ఒకే ఇంట్లో నెలరోజుల వ్యవధిలో నలుగురు మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాదం నెలకొంది.
![Karimnagar News: నెల రోజుల వ్యవధిలో ఒకే కుటుంబంలో నలుగురు మృతి- గ్రామంలో తీవ్ర విషాదం! Karimnagar News Mystery Deaths in Gangadhar, Four family members died in One Month dnn Karimnagar News: నెల రోజుల వ్యవధిలో ఒకే కుటుంబంలో నలుగురు మృతి- గ్రామంలో తీవ్ర విషాదం!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/31/aab73abaaf1c15347b4b619834eb582e1672461101173543_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Karimnagar News: కరీంనగర్ లో ఒకే కుటుంబంలోని నలుగురు వివిధ కారణాలతో మరణించారు. ఒకే ఇంట్లో నెలరోజుల వ్యవధిలో ఇలా జరగడం స్థానికుల్లో ఆందోళన బాధ వ్యక్తమవుతోంది.
ఒకే రోజు ముగ్గురు
కరీంనగర్ జిల్లాలోని గంగాధరలో మమత అనే వివాహిత తన భర్త శ్రీకాంత్, కుమార్తె అమూల్య (6 సంవత్సరాలు), కుమారుడు అద్వైత్ (20 నెలలు) లతో కలిసి జీవిస్తోంది. ఇటీవల మమత, ఆమె పిల్లలు అంతుచిక్కని వ్యాధితో మరణించారు. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చనిపోయిన వారి రక్త నమూనాలకు పరీక్షల కోసం హైదరాబాద్ లోని ల్యాబ్ పంపారు. వాటి ఫలితాలు ఇంకా రాలేదు. ఈ క్రమంలోనే ఆ కుటుంబంలో మరో మరణం సంభవించింది.
నెలరోజుల వ్యవధిలో మరో మరణం
మమత భర్త శ్రీకాంత్ నిన్న ఇంట్లో రక్తం కక్కుకుని చనిపోయాడు. కుటుంబసభ్యులు అతడిని ఆసుపత్రికి తరలించినా లాభం లేకపోయింది. వీరందరూ ఎలా చనిపోయారో తెలియడం లేదంటూ బంధువులు చెప్తున్నారు. నెల రోజుల వ్యవధిలోనే ఓ కుటుంబంలోని నలుగురు చనిపోవడం ఆ గ్రామంలో విషాదాన్ని నింపింది. బంధువులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రాత్రి మమత భర్త శ్రీకాంత్ సూసైడ్ చేసుకొని చనిపోయాడు. కుటుంబంలో అందరూ చనిపోవడంతో మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నాడు. పిల్లనిచ్చిన అత్తింటి వారి వేధింపులు, వాళ్ల చావుకు తానే కారణం అని అనుమానంతో కేసు పెట్టారు. ఆ కేసు విచారణలో ఉండగానే ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)